సబ్ ఫీచర్

తెలుగు రాష్ట్రాల్లో జాతీయ భాషకు తూట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయోద్యమంలో అఖిల భారతాన్ని జాగృతం చేసి ఏకతాటిపై నడిపించిన హిందీ భాషకు తెలుగు రాష్ట్రాల్లో తీరని అన్యాయం జరుగుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో హిందీ మాట్లాడేవారి సంఖ్య 43.63 శాతం ఉంది. ఇంతకీ తెలుగు రాష్ట్రాల్లో జాతీయ అధికార భాష హిందీ అత్యంత దయనీయ స్థితిలో ఉంది. ముఖ్యంగా పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో హిందీ కనీస ఉత్తీర్ణత నూటికి 20 మార్కులుగా ఉంది. దీంతో ఈ సబ్జెక్టుపై విద్యార్థులు ఏ మాత్రం శ్రద్ధ కనబరచడం లేదు. సంస్కృతం కాంపోజిట్ కోర్సు సబ్జెక్టుతో సహా మిగిలిన అన్ని సబ్జెక్టులకు 35 శాతం మార్కులను కనీస ఉత్తీర్ణతగా నిర్ణయించారు. దీంతో విద్యార్థులు ఆ సబ్జెక్టులపై మాత్రమే ఆసక్తి చూపుతున్నారు. ప్రైవేటు ట్యూషన్లు కూడా తీసుకుంటున్నారు. హిందీ సబ్జెక్టును మూలనపడేశారు. ఫలితంగా వారికి అక్షరం ముక్క కూడా రాకుండా పోతోంది. దీంతో హిందీ సబ్జెక్టును బోధించే ఉపాధ్యాయులు కూడా తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారు. దీనికితోడు వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్య పాలిటెక్నిక్‌లు, ఐ.టి.ఐలలో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకొనేటప్పుడు హిందీ మార్కులను పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఇలా జాతీయ భాష తీవ్ర నిర్లక్ష్యానికి లోనవుతోంది.
ఆరో తరగతి నుంచి పాఠశాలలో హిందీ ఓ సబ్జెక్టుగా కొనసాగుతోంది. ప్రాథమిక పాఠశాలల్లో హిందీ సబ్జెక్టు లేనే లేదు. ఇవే పాఠశాలల్లో పరభాషయైన ఆంగ్లాన్ని ఒకటో తరగతి నుంచి ఓ సబ్జెక్టుగా ఉంచి నేర్పుతున్నారు. జాతీయ సమైక్యతకు వారధిగా, అనుసంధానంగా ఉన్న హిందీ భాషను పూర్తిగా విస్మరించడం అత్యంత దారుణం. క్షమించరాని విషయమని చెప్పక తప్పదు. పాలకుల నిర్లక్ష్య ధోరణికిది నిదర్శనమని వేరేగా చెప్పనక్కరలేదు.
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో హిందీ ఉత్తీర్ణత శాతాన్ని 35 మార్కులకు నిర్ణయిస్తే తప్ప జాతీయ భాషకు న్యాయం జరగదనేది అక్షర సత్యం. ఈ విషయమై గతంలో పలుసార్లు ఉపాధ్యాయ పండిత పరిషత్, భాషోపాధ్యాయ సంఘాలు సర్కారువారికి విజ్ఞాపన పత్రాలను అందజేసినప్పటికీ ప్రాతినిధ్యం జరిపినప్పటికీ బధిర శంఖారావమే అయింది. హిందీలో కనీస ఉత్తీర్ణత శాతాన్ని 35కి పెంచడంవల్ల ప్రభుత్వాలకు వచ్చిన ఇబ్బంది ఏమిటో అర్ధం కాదు. దీనివల్ల ఎలాంటి ఆర్థిక భారం లేదు. మిగిలిన సబ్జెక్టులతో సమానంగా 35 శాతం మార్కులను నిర్ణయించడంవల్ల విద్యార్థులకు హిందీ సబ్జెక్టుపై ఆసక్తి పెరుగుతుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన ఇంటర్వ్యూలలో హిందీ భాషపై పట్టున్న వారికి ఎంతో కొంత ప్రయోజనం కలుగుతుంది. తెలుగేతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేసేటప్పుడు ఎంతో సౌలభ్యంగా ఉంటుంది. మనం వ్యక్తిగతంగా గాని, అధికార పూర్వకమైన పని మీద గాని ఉత్తరాది రాష్ట్రాలకు వెళితే హిందీ భాష రాకపోతే అక్కడి వారు మనల్ని నిరక్షరాస్యులుగానే చూస్తారు. వ్యవహారాలు సజావుగా సాగే అవకాశం ఉండదు.
ఇలా ఎన్నో అసౌకర్యాలు కలుగుతాయి. అంచేత ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పదో తరగతిలో హిందీ ఉత్తీర్ణత శాతాన్ని 35గా నిర్ణయించాలి. పదో తరగతి అనంతరం చదివే అన్ని కోర్సుల ప్రవేశాలకు హిందీ మార్కులను పరిగణనలోకి తీసుకోవాలి. ఆరోజే భావిభారత పౌరులైన విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. అలాగే ప్రాథమిక పాఠశాలల స్థాయి నుంచి హిందీ సబ్జెక్టును ప్రవేశపెట్టాలి. దీనివల్ల విద్యార్థులకు ఈ సబ్జెక్టు పట్టుబడుతుంది. మంచి ప్రవేశం వస్తుంది. తద్వారా విద్యార్థుల భవిష్యత్తు బంగారు బాటగా మారుతుంది. దేశంలో గుర్తింపు పొందిన 21 భాషల్లో హిందీకే ప్రముఖ స్థానం ఉంది. ఈ విషయాన్ని పాలకులు గమనంలోకి తీసుకొని అనుసంధాన భాషగా ఉన్న హిందీ విషయమై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రోత్సహించాలి. అభ్యర్థులకు దేశవ్యాప్తంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయి. అంచేత ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలి.

-- వాండ్రంగి కొండలరావు, 9490528730