సబ్ ఫీచర్

‘బంగారం’లాంటి నగలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెళ్లికూతుర్ని చేసే రోజు.. ఆ చీరకు మ్యాచింగ్‌గా పొడవాటి హారం.. సంగీత్ రోజున మెడకు పెద్ద చోకర్.. పెళ్లిరోజున మెడనిండా కాసులపేరు, నెక్లెస్.. రిసెప్షన్‌కు స్టైల్‌గా, ట్రెండీగా ఉండే రాళ్ల నెక్లెస్.. దానికి తగ్గట్టు కమ్మలు, గాజులు లేదా బ్రేస్‌లెట్.. ఇలా.. సందర్భానుసారంగా కాబోయే వధువు రకరకాల నగలను వేసుకోవాలనుకుంటుంది. కానీ మధ్యతరగతి అమ్మాయి సందర్భానికి తగినట్టు ఇన్ని నగలు వేసుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. పైగా తల్లిదండ్రులకు అది కొండంత భారం. అందుకే వెండిపై బంగారపు పూత, అల్లాయ్, మైక్రోగోల్డ్‌ప్లేటెడ్, వన్‌గ్రామ్ గోల్డ్ వంటి ఎన్నో రకాల ఆభరణాలు ఇప్పుడు మార్కెట్లోకి వచ్చేశాయి.
జీవితంలో ఒకే ఒక్కసారి వచ్చే మధురఘట్టం పెళ్లి. అలాంటి పెళ్లిలో పెళ్లికూతురు నిండైన నగలతో, తీరైన చీరకట్టుతో కనిపిస్తేనే అందం. అలాగని అందరికీ అచ్చంగా బంగారంతో నగలను చేయించుకునే స్థోమత ఉండదు. అందుకని ఈ రోజుల్లో ఎక్కువమంది బంగారుపూత ఉన్న నగలకే ఎక్కువగా ఓటేస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఇలాంటివి బోలెడు రకాలున్నాయి. తాళికట్టేవేళ నచ్చిన ఒకటే పెద్ద నగను ఎంచుకుంటే బాగుంటుంది. అది సీజెడ్‌దైనా కావచ్చు.. లేదా గుత్తపూసల హారాలు, కాసులపేరు, మామిడిపిందెల హారం, స్టెప్‌చైన్, లాంగ్ చైన్.. ఇలా నగలను వివిధ వరుసల్లో, వివిధ సైజుల్లో ఎంచుకోవచ్చు. వీటికి మిక్స్ అండ్ మ్యాచింగ్‌గా పెద్ద పెద్ద జుంకీలు, చెంపసరాలు, మాటీలు, పాపిటిబిళ్ల, జడపిన్ను, జడకుచ్చులు, బంగారుజడ, వడ్డాణం, వంకీ, పట్టీలు.. ఇలా ప్రతీదీ పెళ్లిరోజున వేసుకునే పెద్దనగకు మ్యాచింగ్‌గా కొనుక్కుంటే బాగుంటుంది. ఆడంబరంగానూ ఉంటుంది. నేటితరం అమ్మాయిలకు స్మార్ట్ఫోన్ పేరుతో నెట్ అరచేతిలోనే ఉండటంతో ఎప్పుడెప్పుడు ఆన్‌లైన్‌లోకి కొత్త నగలు వస్తాయా అని ఎదురుచూసి సందర్భానుసారంగా వాటిని ఎంచుకుంటున్నారు. ధరించే దుస్తులను అనుసరించి నవరత్నాలు, సీజెడ్, కుందన్లు, బీడ్స్, మొఘల్, కుందన్, మీనాకారీ, టెంపుల్ జ్యుయలరీ.. లను ఎంచుకుంటున్నారు. ఇక యాంటిక్ జ్యుయలరీ సంగతి చెప్పనే అక్కరలేదు. నెమళ్లు, లక్ష్మీదేవి, ఏనుగులు వంటివాటితో ప్రత్యేకంగా రూపొందించిన నగలు కూడా బంగారు పూత నగల్లో ఉంటున్నాయి. ఇవి పెళ్లికూతురికి నిండుతనాన్ని, అందాన్ని ఇస్తాయి.