సబ్ ఫీచర్

మెడ ఆకృతికి యోగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెడ.. ముఖానికి, ఆకృతికి అందాన్ని జతచేస్తుంది. ఈ సన్నని కాండంలాంటి అవయవం తలకి ఇరువైపులా మద్దతును ఇవ్వడంతో పాటు, తలను పైకి, కిందికి వంచడానికి, దాదాపు 180 డిగ్రీల వరకు తిప్పడానికి అనుమతిస్తుంది. రోజువారీ అలవాట్లు మెడ చుట్టూ ఉన్న చర్మం పాడవడానికి దోహదం చేస్తాయి. ఇబ్బందికర భంగిమలో నిద్రించడం, బల్లపై పడుకోవడం, చెవికి, భుజానికి మధ్య సెల్‌ఫోన్‌ను నొక్కిపెట్టడం, కోపం, భయం, మానసిక ఒత్తిడి వంటివి మెడ కండరాలు బిగుసుకుపోవడానికి, కండరాల అలసటకు దారితీస్తాయి. మెడను వనిక నాణ్యతతో, నవ్రతతో కొనసాగించడానికి కొన్ని ప్రత్యేక ఆసనాలు చేయాలి. రోజులో కొన్ని నిముషాలు 3గ్రీవ సంచలన ఆసనాలు2 అభ్యసించడం ద్వారా అందమైన, సున్నితమైన, చక్కని బిగుతైన మెడను పొందవచ్చు. అంతేకాదు ఈ ఆసనాలు వేయడం ద్వారా మంచి నిద్ర, కంటిచూపు మెరుగవడం, వినికిడి సామర్థ్యం పెరగడం, తలనొప్పి తగ్గడం, స్పాండిలైటిస్ నొప్పులు తగ్గడం వంటి ప్రయోజనాలు ఉంటాయి. ఈ కంప్యూటర్ కాలంలో స్పాండిలైటిస్ అనేది ప్రతి ఒక్కరికీ సహజమైపోయింది. అలాంటి వారు ఈ గ్రీవ సంచలన ఆసనాలను వేయడం ద్వారా స్పాండిలైటిస్‌ను తగ్గించుకోవచ్చు. మెడ నరాలు మెదడుకు అనుసంధించి ఉంటాయి కాబట్టి మెడకు సంబంధించిన ఆసనాలు వేయడం ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చు. మరి ఆ ఆసనాల గురించి తెలుసుకుందామా..
* భుజాలను సమాంతరంగా ఉంచి, కళ్ళు మూసుకుని మెడకు విశ్రాంతి కలిగే విధంగా నిటారుగా కూర్చోవాలి.
* ముఖ కండరాలకు విశ్రాంతి కలిగే విధంగా తలను నెమ్మదిగా వెనుక భాగానికి అనగా వీపువైపుకు వంచాలి. ఈ సమయంలో పెదవులను దూరంగా ఉంచాలి. తర్వాత నెమ్మదిగా తలను యథాస్థానానికి తీసుకురావాలి. ఇప్పుడు తలను నెమ్మదిగా వీలైనంత వరకు ముందుకు వంచాలి. నెమ్మదిగా తిరిగి యథాస్థానానికి తీసుకురండి. ఇది ఒక పర్యాయం. ఈవిధంగా పది పర్యాయాలు చేయాలి.
* భుజాలని ఎత్తకుండా తలను నెమ్మదిగా ఎడమవైపుకు వంచాలి. ఇరవై సెకన్లు అలా ఉంచి తరువాత తిరిగి తలను యథాస్థానానికి తీసుకురావాలి. ఇప్పుడు తలను నెమ్మదిగా కుడివైపునకు వంచి తిరిగి యథాస్థానానికి తీసుకురావాలి. ఈ విధంగా మెడను వంచినప్పుడు మెడ కండరాలు, దాని వ్యతిరేకపు వైపుకు లాగినట్లుగా అనిపిస్తుంది. మెడను కుడివైపుకు వంచినప్పుడు కూడా ఎడమవైపు మెడ కండరాలు లాగినట్లు అనిపిస్తుంది. రెండువైపులా చేసినప్పుడు అది ఒక పర్యాయం అవుతుంది. ఇలా పది పర్యాయాలు చేయాలి.
* భుజాలను అలాగే ఉంచి, తలను నిటారుగా చాలా నెమ్మదిగా, సమానంగా, సౌకర్యవంతంగా ఉన్నంతవరకు కుడివైపుకు తిప్పాలి. ఇలా కొన్ని సెకన్లు ఉంచి తిరిగి తలను యథాస్థానానికి తీసుకురావాలి. ఎడమవైపు కూడా ఇలాగే చేయాలి. ఇలా తలను తిప్పినప్పుడు కండరాలు సంకోచం చెందుతాయి. మళ్లీ యథాస్థితికి వచ్చినప్పుడు విశ్రాంతి పొందుతాయి. ఇది ఒక పర్యాయం అవుతుంది. దీన్ని కూడా ప్రతిరోజూ పది పర్యాయాలు చేయాలి.
* మెడను విశ్రాంతి పొందేవిధంగా ఉంచుతూ భుజాలను ముందు వైపుకు వంచి తల గవద భాగం కిందికి చేరుకునేంతవరకు కిందికి వంచాలి. తరువాత కుడి చెవి వరకు, కుడి భుజానికి దగ్గరగా వచ్చేంతవరకు తలను కుడివైపు తిప్పాలి. ఇలా సౌకర్యవంతంగా ఉన్నంతవరకూ తిప్పాలి. తరువాత ఎడమవైపు ఇలాగే చేయాలి. ఇలా ఒక వలయాకారాన్ని పూర్తిచేస్తూ తలను ప్రారంభ స్థానానికి తీసుకురావాలి. ఇది ఒక పర్యాయం అవుతుంది. సవ్యదిశలో ఐదుసార్లు, అపసవ్యదిశలో ఐదుసార్లు ఇలా చేయాలి.
* ముఖాన్ని ముందువైపు ఉంచాలి. మెడను కిందికి చూస్తున్నట్లుగా వంచి, భుజాలకు విశ్రాంతిని కల్పిస్తూ, నెమ్మదిగా భుజాలను చెవుల వైపుకు ఎత్తాలి. ఇలా కొన్ని సెకన్ల పాటు ఉంచి తిరిగి ప్రారంభదశకు వచ్చేయాలి. ఇది ఒక పర్యాయం అవుతుంది. ఇలా పది పర్యాయాలు చేయాలి.
* నోరు తెరచి వీలున్నంతవరకు నాలుకను బయటకు తీసుకురావాలి. ఈ సమయంలో మెడ కండరాలు బిగుసుకున్న అనుభూతిని పొందాలి. తర్వాత మెడ నరాలు బయటలకు కన్పించేంతవరకు దవడలను గట్టిగా నొక్కిపెట్టాలి. ఇలా పదిసార్లు చేయాలి.
ఈ వ్యాయామాలు చేసేటప్పుడు నెమ్మదిగా, ప్రశాంతంగా చేయాలి. గట్టిగా, హడావుడిగా చేయడం వల్ల కండరాలు పట్టేసే ప్రమాదం ఉంది. అధిక రక్తపోటు, గర్భంతో ఉన్నవారు ఎక్కువగా వెనక్కి లేదా ముందుకు వంగకుండా జాగ్రత్తగా చేయాలి. వ్యాయామ నియమావళిని నిర్దేశించికుని క్రమం తప్పకుండా వీటిని అభ్యసించడం వల్ల అధిక ప్రయోజనాలను పొందవచ్చు.