సబ్ ఫీచర్

సంప్రదాయంగా.. ట్రెండీగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవరాత్రులు.. బతుకమ్మ ఆటలు.. బొమ్మల కొలువులు.. పేరంటాలు. . దాండియా..
ఇలా ఒకటేమిటి.. ప్రతిరోజూ పండుగే.. సాయంత్రమవుతూనే చక్కగా ముస్తాబు చేసుకుని బతుకమ్మ ఆడటానికో, బొమ్మల కొలువు పేరంటానికో, గుడికో వెళుతుంటారు మహిళలు.. ఈ సందర్భాల్లో మహిళలు సంప్రదాయ చీరకట్టుకే పెద్దపీట వేస్తుంటారు. అయితే సంప్రదాయ చీరకట్టులనే కొత్తగా, ట్రెండీగా ఎలా కట్టుకోవాలో చూద్దాం. పండుగల్లో పాల్గొనడానికి లేత రంగుల్ని కాకుండా, ముదురు, కాంతివంతమైన రంగుల్ని ఎంచుకోవాలి. ఎరుపు, నీలం, పసుపు, గులాబీ, ఆకుపచ్చ.. వంటి రంగుల్ని ఎంచుకోవచ్చు. అప్పుడే బ్రైట్‌గానూ, అందర్లోనూ ప్రత్యేకంగా కనిపించవచ్చు. అలాగే పట్టుచీరకు తగినట్లుగా సాదా పట్టు జాకెట్టు కాకుండా ట్రెండీగా ఉండేలా చూసుకోవాలి. బోట్‌నెక్, రౌండ్‌నెక్, హాల్టెర్ నెక్‌లతో ఉన్న జాకెట్లను ఎంచుకుంటే బాగుంటుంది. వీటికి ఎంబ్రాయిడరీ, జర్దోసీ వర్క్, బీడ్ వర్క్, కుందన్ వర్క్.. వంటివి చేయిస్తే మరింత అందంగా, కొత్తగా కనిపించవచ్చు. ఇక బతుకమ్మ కానీ, దాండియా కానీ ఆడాలనుకునేవాళ్లు ధగధగలాడే వస్త్రాలను ధరించాలి. బెనారస్, రా సిల్క్ చీరలు ఇందుకు అనువుగా ఉంటాయి. వీటికి అద్దాలతో కుట్టిన జాకెట్ కానీ, కుందన్‌లతో కుట్టిన జాకెట్ కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. డ్రస్సింగ్‌కు తగినట్లుగా హెయిర్‌స్టైయిల్, నగలు వేసుకుంటే చాలు.. పండుగల్లో ప్రత్యేకంగా, ట్రెండీగా, అందంగా కనిపించవచ్చు. మరి ఇంకెందుకాలస్యం.. కాంతులీనడానికి తయారవ్వండి..