సబ్ ఫీచర్

విజయాలనిచ్చే దశమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాక్షస అంశలపై గెలిచిన యుద్ధానికి
ప్రతీక- దశమి
మనిషిలో దాగిన అరిషడ్వర్గాలని
అదుపులో ఉంచుతూ
సక్రమమైన దిశానిర్దేశం చేసే
గొప్ప దిక్సూచి

తీరొక్క పూవులతో బతుకమ్మని చేసి
ఊరంతా ఆత్మీయతని పంచె
గొప్ప వేడుక
ప్రాంతమేదైనా పరమార్థం ఒక్కటే
మనిషి చేసిన విధ్వంసాలకు
చరమగీతం పాడే పండుగ

మహిషాసురులు అడుగడుగునా పొంచి ఉన్న
నేటి కాలపు మహిళకి భరోసా
అంతరిక్షం దాకా నగరా మోగించిన
మహిళా విజయానికి విజయ సూచిక
ప్రేమ రాహిత్యంలో పడి- ద్వేషంతో
సమూహాల్ని హత్యలు చేసే మనుషులని
సత్ప్రవర్తనతో సరి చేసేది
ఒక్కోచోట ఒక్కో పేరుతో పిలుచుకుంటూ
మనమంతా ఒక్కటే అన్న సందేశాన్ని
మోసుకెళ్లే గొప్ప వాహిక

చెడుపై మంచి ఎప్పుడూ గెలుస్తూ
ముందుకు సాగుతుందనే నమ్మికకి
తిరుగులేని పతాకమే దశమి

యుగాలు మారినా
తరాలు అంతరించినా
చరిత్రలో నిలిచే సత్యమొక్కటే

ధర్మాన్ని రక్షించే దుర్గమ్మలు
జీవితంలో ఎప్పటికీ ముందుకు
సాగిపోతూనే ఉంటారు

ఓటమిని తరిమేసి
విజయాలను చేకూర్చే దిశగా
మానవాళి పయనించాలి
అప్పుడే నిజమైన విజయ దశమి!

-పుష్యమీ సాగర్ 90103 50317