సబ్ ఫీచర్

తక్షణ కర్తవ్యం ‘దీక్షా’శిబిరమేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎనిమిదవ తేదీ వస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడుగారు నాటికి రెండేళ్ల పరిపాలనా కాలాన్ని పూర్తిచేసుకుంటున్నాడు. ఈలోగానే, రెండవ తేదీనాడు తెలంగాణా ఆవిర్భావ దినోత్సవంనాడు- అవతల ధూంధాంలు ప్రేలిపోతూంటే- తాత్కాలిక రాజధాని అంటూ మనం చెప్పుకుంటున్న బెజవాడలో, బెంజి సర్కిల్‌లో నిలబడి, నాయుడుగారు- ప్రజలందరికీ సుదీర్ఘమైన దీక్షోపదేశం అందించారు.
‘‘గాయాలు మానేదాకా జనం పండుగలు, వేడుకలు చేసుకోవద్దు. 2020దాకా ఆగితే, అప్పుడు ‘నవ్యాంధ్ర దినోత్సవం’ ఘనంగా జరుపుకుందాం,’’ అన్న ధ్వని, ఆయన ప్రతి గంభీరమైన సందేశాక్షరంలోనూ ప్రతిఫలించేసరికి సభలోని చివరి వరుసలు ఖాళీ అయిపోవడం కనబడ్డదని స్థానిక మీడియా రిపోర్టుచేసింది. నాయుడిగారి పరిపాలన మీద తప్పనిసరిగా చర్చించాల్సిన పరిస్థితిని, ప్రజలలో ముఖ్యమంత్రిగా తానే కల్పించి రేపు ఎనిమిదవ తేదీన పరిపాలనా వార్షిక దినోత్సవంనాడు మరిన్ని విమర్శనాత్మక అభిప్రాయ బాణాలు తనని తాకేలాగా చేసుకున్నాడు. రెండవ తేదీనాడు అర్జెంట్‌గా, దీక్షా శిబిరం దేనికి? దీంతో ప్రజలలో సానుభూతికి బదులు దెప్పిపొడుపుల సణుగుళ్ళు వినబడ్డాయి.
అందరి దృష్టీ యిటీవల నాయుడిగారి పరిపాలన మీద ఢిల్లీలోగల ‘సెంటర్ ఫర్ మీడియా సర్వీసెస్’వారు సీరియస్‌గా ఆంధ్రప్రదేశ్ జిల్లాలన్నిటా తిరిగి చేసిన సర్వే రిపోర్టు మళ్లీ నెల తిరగకుండా యివాళ తెరమీదికి వచ్చింది. పైగా, రుూ దీక్షా శిబిర కార్యక్రమంలో చంద్రబాబునాయుడుగారు - అమాయకంగా తనకీ, కె.సి.ఆర్.కీ- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దక్షతకీ- తెలంగాణా పరిపాలనా తీరుకీ మధ్య వ్యత్యాస వైరుధ్యాల బేరీజుకి అవకాశం యిచ్చాడు.
నిజానికి ఒకప్పటి కింగ్ మేకర్, అక్కడ ఢిల్లీలోనూ యిక్కడ అంటే ఎక్కడ? రాష్ట్ర పరిపాలన ఎక్కడినుంచి జరుగుతోంది అని చెప్పాలి? ఆయనకేం? అనుభవంలో- రికార్డు హోల్డరు. ఒక రాజధాని ఉమ్మడిగా హైదరాబాద్‌లోనూ- మరో రాజధాని తాత్కాలికంగా బెజవాడలో ‘అసలు రాజధాని’ ‘అరచేతిలో వైకుంఠం’- సారీ- ‘సింగపూర్‌గా’ అమరావతిలోనూ- యిలా ఆయనెక్కడుంటే అక్కడ నుంచి సాగిపోతున్న పరిపాలన మీద విమర్శలూ, విసుర్లూ ఎక్కువై పోతున్నాయి- ఎందుకని? ఆలోచించాల్సిన సమయం.
అవతల కొత్త రాష్ట్రంలో సరికొత్త ముఖ్యమంత్రి- (అనుభవం ‘నిల్లు’కదా!) కె.సి.ఆర్.గారు ‘‘నెంబర్ వన్’’ నేనేనంటూ దూసుకుపోతూండగా- సి.ఎమ్.ఎస్. (సెంటర్ ఫర్ మీడియా స్టడీసు) నివేదిక ‘బాబు’కి 67 శాతం మార్కులు మాత్రమే యిచ్చింది. ‘ఆంధ్ర రాష్ట్ర ప్రజలే తెలంగాణలో పనితీరు మనకన్నా 43 శాతం ‘బెటర్’ అన్నారు అని సర్వే రికార్డు చేసింది.
పద్ధెనిమిదికీ ఏభైకీ మధ్య వయస్సుగల జనాలు నాయుడుగారి పనితీరుకి 34 శాతం మార్కులు (అభిప్రాయాల ద్వారా) మాత్రం యిచ్చారు. అవినీతి నిర్మూలనకు కంక ణం కట్టుకున్నానంటూ రంగంలోకి దూకిన సి.ఎమ్. గారి ‘దూకుడు’ కనబడలేదు. ఈ సర్వే ప్రకారం రెవిన్యూ, పోలీసు, విద్యా, వైద్య రంగాల్లో భ్రష్టాచారం మరింత పెరిగింది. రాజధానికో అడ్రస్ అంటూ లేకపోడంతో, బాబుగారు ఎక్కడ వుంటే అక్కడే ‘‘క్యాంపు ఆఫీసు’’-
కాకపోతే విద్యుత్ సరఫరా బాగా మెరుగైంది. పెన్షన్‌దారులు కొంత హాయిగా వున్నారు. మంత్రులలో ఎవరూ ‘‘సారు’’కి, సహకారం యివ్వటం లేదు. తన మంత్రివర్గంలో అవినీతి భయంకరంగా వుండే ముఖ్యమంత్రికి మంత్రుల పనితీరువల్ల కూడా భరోసా లేకుండా పోయిం ది. తెల్లారేపాటికి ఎవడు తనవాడు మరో పార్టీలోకి జారుకుంటాడో తెలియని అనిశ్చిత స్థితి. అంతా బేజారు కం గారు తప్పదు.
జగన్ మహాశయుడు ‘్భరోసా యాత్రలు’చేస్తూ నిరంతరం ‘తిట్టుకవిత్వం’ వినిపిస్తూండడంవల్ల మనశ్శాంతి కరువైంది. అసలు హైదరాబాద్‌ను పోగొట్టుకున్నది తానే తప్ప మనం కాదు. ఇరవై నాలుగ్గంటలూ పోయిన దానిమీద అంగలార్చే ఓపిక ఎవరికుంది యిక్కడ? ‘‘మా వూరే, మా నగరాలే చాలు. మాకు చేతినిండా పని’’-అంటూ ఒక కార్యకర్త వైజాగ్‌లో నుదురు చిట్లించాడు.
అటు చూస్తే బుద్ధవిగ్రహానికి తోడుగా అమరావతిలో అతి ఎతె్తైన ఎన్.టి.ఆర్. విగ్రహం పెడతాం అన్న హామీ తప్ప మరేమీ లేదంటూ- గుంటూరులో ‘టాకు’. ఇంతకీ జపానా? సింగపూరా? అమరావతిని కట్టేది? అంతా అయోమయ స్థితి. వెలగుపూడి మాత్రం ఏం వెలిగిపోతోంది? ఈ జూన్‌లో వానలు పడే వేళకి స్ట్ఫా అంతా అక్కడికి చేరుకుంటే తప్ప వానాకాలం ‘‘టెంపో’’- పరిపాలనలో రాదు- మంత్రివర్గంలో ‘దీక్ష’ కార్యకర్తల్లో ‘్భరోసా’ నింపాల్సిన చంద్రబాబుగారు ఎవరి పనిపాటల్లో వాళ్లు తుఫాన్ దెబ్బల్నీ, ఎండ దెబ్బల్నీ తడుముకుంటూ - బండి లాగుతూ పరిపాలనా యంత్రాంగం వైపు చూస్తే అక్కడేమి కనిపిస్తున్నది? వాళ్లకి?
పైరవీలకీ, పనిపాటలకీ, హైకోర్టు పనులకీ- ఒక్కోసారి ఒక్కో చోటికి తిరిగే మధ్యవర్తుల స్థితి ఏమిటి? ‘‘బెజవాడ బ్యారేజీ మీద భారీ వాహనాలు వెళ్లే వీలులేదు. ప్రత్యామ్నాయం లేదు. యింతవరకు’’- అంటాడు సామాన్య వ్యాపారి. ఇరుకు వీధుల విశాల నగరం బెజవాడ అలాగే వుంది.
కృష్ణాగోదావరీ నదుల అనుసంధానం గొప్ప సంగతే గానీ- ఆ రెండు నదులకీ ‘పై’నుంచి నీళ్లు రావాలి. దానికి స్పీడుబ్రేకర్లు పడకూడదు కదా? నాయుడుగారికి యివాళ మరో ‘‘నాయుడు’’ పోటీలేడు కనుక సాగిపోతోంది. అం దుకు అభినందించాలి కాని శూన్యం వుంటే ‘గాలి’రాదా? పరిపాలనా ద్వితీయ వార్షికోత్సవం దీపాల తోరణంగా సాగే స్థితి ఆంధ్రప్రదేశ్‌లో రావాలీ అంటే ముందు ఆంధ్రా అంతటా రైతులకు- భరోసా జగన్ యివ్వడం ఎందుకు? నేనే యిస్తానంటూ నాయుడుగారు నడుంకట్టాలి. దీక్షబూనాలి. దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి! ‘దీక్ష’ఆయనకే కావాలి- ఆయన పార్టీకే గావాలి-
బెటర్ స్టాప్ ద బ్లేమ్ గేమ్!