సబ్ ఫీచర్

ప్లాస్టిక్ బ్యాగ్స్ వద్దు కాగితపు సంచులే ముద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనకు సులువుగా వచ్చే పాలిథిన్ కవర్ ప్రతిరోజూ ఓ వ్యక్తి ఓ పాలిథీన్ కవర్‌ను పడేసినా.. ఆ కవర్లన్నీ కలిపి రోజుకు వందకోట్ల చెత్తగా తయారు అవుతాయని పరిశోధకులు చెప్తున్నారు. కాని చెత్త లో కూడా పరమ చెత్త వేరయా అన్నట్టు ఈ ప్లాస్టిక్ చెత్త మాత్రం కరగదు, కలసి పోదు, ఎన్నో వేల యేంఢ్లు అయనా అట్లానే ఉంటుంది. ఇక్కడే వస్తోంది చిక్కంతా...ఈ చెత్తనే కొండలా మారి కొండచిలువలా మానవజాతిని మింగేస్తోంది. అదే.. పాలిథీన్ రాక్షసిగా మారుతోంది.
ఈ రాక్షసిని చూసి నోరు లేని జంతువులు తినేపదార్థాలు అనుకొని తినేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటు న్నాయ. ఆ పాలిథిన్ మాత్రం పేగులకు చుట్టుకుపోయి ఆమూగ ప్రాణిని నరకయాతనకు గురిచేస్తోంది. పాలిథిన్ కవర్ల కారణంగా రోజుకు వంద పశువుల వరకూ చనిపోతున్నట్లు ఓ అంచనా! కొన్నాళ్ల క్రితం ఆపరేషన్ చేసి ఓ ఆవు పొట్టలోంచి దాదాపు 35 కిలోల పాలిథిన్ సంచులు తీసిన సంగతి అందరికీ తెలిసిందే కదా. దీనికి కారణం మనమే అంటే ఎలా ఉంటుంది. చేసినపుడు చేసేసినా ఇట్లాంటి వార్తలు వింటే మనసు ద్రవించిపోతుంది కదా. అందుకే ఇపుడైనా మేల్కొందాం. ప్లాస్టిక్ రాక్షసిని తరిమివేద్దాం.
దానికి కోసం పాలిథిన్ కవర్లను నిషేధిద్దాం. కాగితపు కవర్లను వాడుతాం. యూజ్ అండ్ త్రో కాక పదేపదే చక్కగా వాడుకోగలిగే పరికరాలను వాడుదాం. దీనికోసం ప్రతిఒక్కరం కృషిచేద్దాం.
పాలిథిన్ కవర్లకు రీ సైకిల్ గుణం లేనందువల్ల ఇది పర్యావరణానికి హానికరంగా మారుతున్నాయ. ఇట్లాంటివాటికి గుడ్‌బై చెప్పి రీయూజ్ ఉండేవస్తువులకు ఆహ్వానం పలుకుదాం. బయట నుంచి సరుకులు కానీ, కూరగాయలు కానీ తెచ్చేటప్పుడు వస్త్రంతో చేసిన సంచిని కానీ, జూట్ బ్యాగులు కానీ వాడదాం. చెత్తను వేసేటప్పుడు కూడా చెత్త డబ్బాలను వాడదాం. అవి కూడా ప్లాస్టిక్‌వి కాదు సుమా. పర్యావరణ హితమైనవి. పిల్లలకు క్యారేజీలను జూట్ బ్యాగుల్లో కానీ, మనమే తయారుచేసిన అందమైన బ్యాగుల్లో కానీ సర్దుదాం. ఇలా ఒక్కొక్కటిగా మార్చుకుంటూ మనమూ మారి మనపర్యావరణాన్ని కాపాడు కుందాం.

-మానస (ఎస్.ప్రసన్నలక్ష్మి) 99592 53016