సబ్ ఫీచర్

జాతీయతావాదానికే జనం జేజేలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిటిష్ పాలనలోనూ మన దేశంలో అనేక సామ్రాజ్యాలు రాజుల అధీనంలో ఉండేవి. 55 శాతం రాజ్యాలు బ్రిటన్ రాణి ప్రతినిధులతోనూ, 45 శాతం రాజ్యాలు కప్పం చెల్లిస్తున్న రాజుల పాలనలో కొనసాగేవి. రాజుల కాలంలోనూ చట్టసభలు, న్యాయవ్యవస్థ, పరిపాలనా విభాగం, రక్షణ దళం వంటివి ఉండేవి. రాజుల వ్యవస్థ కూలిపోయిన తర్వాత ప్రజాస్వామ్యం పేరుతో ప్రజాప్రతినిధుల ద్వారా పరిపాలన కొనసాగుతున్నది. ఈ వ్యవస్థ ద్వారా అనేకమంది పాలకులుగా మారి ప్రజాసేవ చేస్తున్నారు.
ఒకప్పుడు రాజులు పరిపాలించిన కాలంలో కూడా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేవారు. సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో జీవించేవారు. విదేశీ మతాలవారు మన దేశంపై దండయాత్రలు చేసి రాజ్యాలను ఆక్రమించి, వారి మతాలను, సిద్ధాంతాలను మన దేశంలో వ్యాపింపజేసేందుకు మన విశ్వవిద్యాలయాలను ధ్వంసం చేశారు. వేల సంఖ్యలో హిందూ దేవాలయాలను నేలమట్టం చేసి, మసీదులను, చర్చిలను నిర్మించుకున్నారు. విదేశీ మతాల ప్రభువులు మన దేశాన్ని పాలించిన దాదాపు వేయి సంవత్సరాల కాలంలో వారి మతాల స్థాపనకు, మత మార్పిడులకు పాల్పడి ఇక్కడి హిందువులను నానాహింసలు పెట్టారు. హిందూ మహిళలపై అత్యాచారాలు చేశారు. ఇక్కడి ప్రజల మాతృభాషలను నిర్మూలించే ప్రయత్నంలో ఆంగ్లభాషలో విద్యాలయాలను నడిపారు.
విదేశీ మతాల పరిపాలకులకు మన దేశంలో నూకలు చెల్లిన సమయంలో కుట్ర పూర్తిగా మతప్రాతిపదికగా దేశాన్ని రెండు ముక్కలు చేశారు. పాకిస్తాన్‌లో ఇప్పటికీ మతాధిపత్యమే కొనసాగుతున్నది. భారత్ మాత్రం సర్వసత్తాక ప్రజాస్వామ్య దేశం. ఇలాంటి రాజ్యంలో మెజారిటీ, మైనారిటీ అనే దుష్టసాంప్రదాయాన్ని పాలకులు ప్రవేశపెట్టారు. ‘సెక్యులర్’ ముసుగులో మైనారిటీలకు వత్తాసు పలుకుతూ అధిక సంఖ్యాకులైన హిందువులను ప్రతి విషయంలో దోషులుగా నిలబెడుతున్నారు. ఈ దేశంలో మైనారిటీలకు ‘బాధ్యతలతో సంబంధం లేకుండా’ పలు హక్కులను జాతీయ నిష్ఠలేని జాతీయ నాయకులు కల్పించారు.
దాదాపు అరవై సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించిన జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాస్వామ్య యుగంలో కుటుంబ పాలనను కొనసాగించేలా దారులు వేశారు. కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాలను ఒక్క భారతీయ జనతాపార్టీ మినహాయించి దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు కొనసాగిస్తున్నాయి. దాదాపు ముప్పయి అయిదు సంవత్సరాల పాటు బెంగాల్‌ను పరిపాలించిన కమ్యూనిస్టు పార్టీ విదేశీ చొరబాటుదారులకు ఆశ్రయం కల్పించి వారిని ఓటు బ్యాంకుగా మార్చుకుంది. కమ్యూనిస్టులు వేసిన దుష్టసాంప్రదాయాన్ని ఇపుడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కొనసాగిస్తున్నారు. అక్కడి స్థానికులైన హిందువులపై దాడులు చేయిస్తున్నారు.
కాగా, ఉభయ తెలుగు రాష్ట్రాలలోని హిందూ దేవాలయాలు దేవాదాయశాఖ అధీనంలో కొనసాగుతున్నాయి. ఆలయాల ఆదాయంపై ప్రభుత్వాలు ఆధిపత్యం చెలాయిస్తాయి. ముస్లింలకు మాత్రం విద్య, వివాహాలు, పండుగలు, మసీదులకు మరమ్మతులతో పాటు ముల్లాలు, వౌల్వీల వేతనాలకు వేల కోట్ల రూపాయలు నేటి పాలకులు కేటాయిస్తున్నారు. ఇవన్నీ ముస్లింలపై ప్రేమకాదు, కేవలం ఓటుబ్యాంకు కోసం ఇచ్చే తాయిలాలు మాత్రమే. అత్యధిక కాలం దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ వ్యవస్థలన్నింటినీ అవినీతిమయం చేసింది. కొన్ని రాష్ట్రాల్లో పాలించిన ఇతర పార్టీలు సైతం కాంగ్రెస్ అడుగుజాడలలోనే నడిచాయి. ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అవినీతి అభియోగాలపై జైలుశిక్ష అనుభవిస్తున్నవారు, అనుభవించినవారు ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారన్న విషయం జగమెరిగిన సత్యమే.
జాతీయ నిష్ఠగల ప్రధానమంత్రి కోసం అరవై రెండు సంవత్సరాల పాటు నిరీక్షించిన ప్రజలకు ఎట్టకేలకు ఉపశమనం లభించింది. 2014లో భారతీయ జనతాపార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోదీని ప్రకటించడంతో ప్రజలు తమ కలను సాకారం చేసికొన్నారు. లోక్‌సభలో పూర్తి మెజారిటీని భాజపాకు ఇచ్చారు. మోదీ పాలన ప్రారంభమయ్యాక- ప్రతి రాష్ట్రంలోనూ భాజపాకు జనం పట్టం కడుతూ వస్తున్నారు. ఏ రాజకీయ పార్టీ ప్రభుత్వాన్ని నడుపుతున్నా పరిపాలన నిమిత్తం రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన పలు సంస్థలు ఉంటాయి. ప్రభుత్వం నిర్దేశించిన బాధ్యతలను నిరంతరాయంగా నిర్వర్తించడమే ఆ సంస్థల ప్రధాన లక్ష్యం. అనివార్య కారణాల వల్ల ప్రభుత్వం రద్దయినా, ఆ వ్యవస్థలు మాత్రం నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంటాయి. ఇవి ఎలాంటి వివక్ష లేకుండా పనిచేస్తాయి. భాజపా పాలిత రాష్ట్రాలలోను అధికార పార్టీ సానుభూతిపరులపైన, భాజపాయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలోను ఐటీ సోదాలు జరగడం కొత్తేమీ కాదు. తెలుగుదేశం పార్టీ భాజపాకు మిత్రపక్షంగా ఉన్న సమయంలో తెదేపా నాయకుల ఇళ్లపై ఐటి సోదాలు జరిగాయి, భారీగా పన్ను వసూలు చేశారు.
తెదేపా ఎంపీ సీఎం రమేశ్ ఇంటిపైన, కార్యాలయాల్లో ఐటి దాడులు జరగడానికి బిజెపితో తెదేపా విడిపోవడం కారణం కాదు. ఏపీకి ప్రత్యేక హోదా అడిగినందున ఇలా కక్షతో ప్రధానమంత్రి ఐటి దాడులు చేయిస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గగ్గోలు పెడుతున్నారు. సంపన్నులపై, అవినీతి పరులపై ఐటి దాడులు చేయడం నేరమా? సీఎం రమేశ్ కడిగిన ఆణిముత్యమా? తెదేపా నాయకులంతా నిజాయితీపరులా? అని ప్రజలు అడిగితే- చంద్రబాబు సమాధానమేమిటి? జాతీయ నిష్ఠగల మోదీ అంతర్జాతీయంగా దూసుకుపోవడం దేశంలోని అన్ని విపక్ష పార్టీలకు మింగుడుపడడం లేదనేది జగమెరిగిన సత్యం.
కొద్దిరోజుల్లో ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు, వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా విపక్ష పార్టీలకు ఓటమి భయం వెంటాడుతోంది. ఇటీవలి కాలంలో త్రిపుర, అస్సాంలలో బిజెపి ప్రభుత్వాలు ఏర్పాటు ఏర్పడ్డాయి. ఏపీ, తెలంగాణల్లోనూ భాజపా బలం పుంజుకుంటుందని ఆ రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, కేసీఆర్ భయపడుతున్నారు. ఈ కారణంగానే ఈ ఇద్దరూ మోదీపై అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారు.
అవినీతి రహిత పాలనతో దూసుకుపోతూ, అంతర్జాతీయంగా పేరు తెచ్చుకొంటున్న మోదీనే మరొకసారి ప్రధానమంత్రిగా చూడాలనేది దేశ ప్రజల ఆకాంక్ష. కేంద్రంలో సుపరిపాలనను అందించే ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రాలలో కూడా అదే పార్టీ ప్రభుత్వం ఉండాలనేది ప్రజల సాధారణమైన కోరిక.

-బలుసా జగతయ్య 90004 43379