సబ్ ఫీచర్

అక్రమాలకు అడ్డుకట్టేదీ..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు సరఫరాచేస్తున్న రేషన్ బియ్యం అక్రమాలకు తెర పడటం లేదు. బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్నిరకాల చర్యలు తీసుకుంటున్నా ఫలితాలు ఇవ్వడంలేదు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలనుండి బియ్యం మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అక్రమ మార్గాన వెళ్ళిపోతోంది. అక్రమాలకు అలవాటుపడ్డ అధికారుల సహకారంతో వ్యాపారులు కిలో బియ్యాన్ని లబ్ధిదారుల నుండి రూ.10కి కొనుగోలు చేసి పక్క రాష్ట్రాల్లో రూ.20 నుండి 30 రూపాయలకు అమ్మేస్తున్నారు. ఇలాంటి వ్యాపారం ఎక్కువగా ఆదిలాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్, మంచిర్యాల, కరీంనగర్, మెదక్ జిల్లాల్లోని నారాయణఖేడ్, జహీరాబాద్, నిజామాబాద్‌లోని బిచ్కుంద, మద్నూర్ ప్రాంతాల్లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో రైళ్ళలో బియ్యాన్ని తరలిస్తుండగా, మిగతా ప్రాంతాల్లో లారీలు, ట్రాలీలు, ఆటోలను వినియోగిస్తున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో రేషన్ దుకాణాల నిర్వహణ బోగస్ డీలర్ల చేతుల్లోకి వెళ్ళడంతో ప్రభుత్వం ఇటీవల స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించి వారిపై కేసులు సైతం నమోదుచేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో కేసుల ప్రభావం కన్పిస్తున్నా సరిహద్దుల్లో మాత్రం బియ్యం అక్రమాలు జరగుతూనే ఉన్నాయి. దీనికి ప్రాంతాల వారీగా వ్యాపారులు తోడై బియ్యాన్ని పక్క రాష్ట్రాలకు తరలిస్తూ కోట్లు కూడగడుతున్నారు. రూపాకి కిలో చొప్పున పంపిణీ చేస్తున్న బియ్యాన్ని డీలర్లు రూ.6 నుంచి రూ.10కి అక్రమ వ్యాపారులకు అమ్ముకుంటుండగా, మరి కొన్నిచోట్ల నేరుగా లబ్దిదారుల నుంచే వ్యాపారులు రూ.10 నుంచి రూ.15కు కొనుగోలు చేస్తున్నారు. ఇదే బియ్యాన్ని రైళ్ళు, ట్రాలీ ఆటోల్లో సరిహద్దులు దాటిస్తున్నారు. కాగజ్‌నగర్, మంచిర్యాల రైల్వేస్టేషన్ల నుండి వందల క్వింటాళ్ళ బియ్యం ప్రతిరోజూ సరిహద్దులు దాటుతోంది. ఇటీవలే కాగజ్‌నగర్‌లో పౌర సరఫరా చేసిన దాడుల్లో వందల సంచుల బియ్యాన్ని పట్టుకున్నారు.
మహారాష్టల్రో పౌర సరఫరాలశాఖ ద్వారా కేవలం సబ్సిడీపై గోధుమలను మాత్రమే సరఫరా చేస్తుండగా రాయితీ బియ్యం లేవు. దీన్ని ఆసరా చేసుకొనే రాష్ట్ర వ్యాపారులు ఇక్కడి రాయితీ బియ్యాన్ని మహారాష్టక్రు తరలించి అక్కడి ధరలకన్నా రూ.5 నుంచి రూ.10కి తక్కువగా అమ్మేస్తుండడంతో మంచి గిరాకీ ఉంటోంది. ఇదే బియ్యాన్ని మహారాష్ట్ర వ్యాపారులు సన్నబియ్యంగా మార్చి తిరిగి రాష్ట్ర మిల్లర్లకు చేరవేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో తెలంగాణ జిల్లాల సరిహద్దుల వెంట వందల సంఖ్యలో మిల్లింగ్ కేంద్రాలు నడుస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా వాంకిడి, భోరజ్ చెక్‌పోస్టుల నుండి మహారాష్టక్రు నిజామాబాద్ జిల్లా మద్దూర్ సరిహద్దు నుండి మహారాష్టక్రు, మహబూబ్‌నగర్ నుండి రాయచూర్ మీదుగా కర్ణాటకకు, నల్లగొండ జిల్లానుండి ఆంధ్రప్రదేశ్‌కు ఈ విధంగా బియ్యం అక్రమ రవాణా నిర్విరామంగా కొనసాగుతున్నట్లు ఇటీవల జరిపిన తనిఖీల్లో విజిలెన్స్ శాఖ సైతం గుర్తించింది.
ప్రజాపంటిణీ వ్యవస్థ పనితీరు రాష్ట్రంలో రోజురోజు నీరుగారిపోతోంది. లబ్ధిదారులకు అందాల్సిన బియ్యం అక్రమార్కుల పాలవుతోంది. ఎంతో ఉన్నతాసయంతో ప్రభుత్వం నిర్వహిస్తున్న బియ్యం పథకం అనుకున్న లక్ష్యాలను చేరుకోలేక పోతోంది. శాఖల మధ్య సమన్వయలోపం, అధికారుల లంచగొండితనం, స్థానిక నేతల సహకారంతో అక్రమ దందా మూడుపువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతూనే ఉంది. పేద ప్రజలకు అందించే బియ్యం పథకాన్ని సక్రమ మార్గంలో నిర్వహించేందుకు తక్షణమే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

- గుండు రమణయ్యగౌడ్