సబ్ ఫీచర్

భక్తి పేరిట ఆడంబరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానసిక పూజ కేవలం జ్ఞానులకే సాధ్యమవుతుంది. సామాన్యులకు నిరక్షరాస్యులకు అట్టి భక్తిసాధ్యమవడం కష్టం కనుక మన పూర్వులు అట్టి వారికి కూడా భక్త్భివం కలగడానికి వివిధ దేవతా పూజలు ప్రవేశపెట్టారు. మనది ఒక మతం కాదు. ఒక సనాతన ధర్మం. దీనికి కూడా ఏదో పేరు ఉండాలని దీనిని హిందూ మతం అన్నారు. ఏ ఉత్సవాలు ఎలా నిర్వహించాలో కొన్ని పద్ధతులు నియమాలు ఉన్నాయి. దేవుని పెళ్లికి అంతా పెద్దలే అని రానురాను ఈ ఉత్సవాలు ఎవరికి తోచిన పద్ధతిలో వారు నిర్వహిస్తున్నారు. పెద్దలు సూచించిన ఆచారాలను సంప్రదాయాలను ప్రక్కనపెట్టారు. ఇప్పుడు ఆడంబరాలు శృతిమించిపోయాయి. ప్రజలు వీటిని భరించలేకపోతున్నారు. ఇది దేవకార్యం అని ఎవరూ నోరు మెదపడంలేదు. ఇలా ఎంతకాలం? ఇటీవల కేరళలోని దేవాలయంలో బాణాసంచా పేలుళ్లకి వందలాది మంది బలి అయినారు. భగవంతునికి బాణాసంచా శబ్దాలు కావాలా? ఆ శబ్దాలు విని దేవతలు ఆనందిస్తారా? దేవతలకు కావలసినవి స్తోత్రాలు.
వినాయక చవితి వస్తున్నదంటే ప్రజలు భయపడిపోతున్నారు. వివిధ కూడళ్లలో పెద్దపెద్ద విగ్రహాలు పెట్టి మైక్‌లు ఏర్పాటుచేస్తున్నారు. బలవంతపు చందాలు రికార్డింగు డ్యాన్సులు బాణాసంచా కాల్పులు మితిమిరీపోతున్నాయి. ఎంత పెద్ద విగ్రహం పెడితే అంత గొప్ప అనుకుంటున్నారు. ఉత్సవాలు చేసే చోట మూడు అడుగుల మట్టి విగ్రహాలు ప్రతిష్ఠించాలి. ఇళ్లలో ఎంత చిన్న విగ్రహమయితే అంత మంచిది. ఇళ్లలో పూజించిన గణపతి విగ్రహాన్ని మూడవ రోజున నూతిలో గాని జలాశయాల్లో గాని ధాన్యపుగాదులలో గాని నిమజ్జనం చేయాలి. నవరాత్రి ఉత్సవాల అనంతరం హైదరాబాదులో భారీ గణపతి విగ్రహాలు హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేస్తున్నారు. ఆరోజు ట్రాఫిక్ మళ్లింపులు వివిధ వాహనాల రణగొణ ధ్వనులు. ఈ భారీ విగ్రహాలను యంత్ర సహాయంతో నిమజ్జనం చేస్తున్నారు. నిమజ్జనం అనేది గణపతిని స్మరిస్తూ చేతులతో జరపాలి. ఈ ఉత్సవాల పేరుతో విపరీతమైన విద్యుత్ ఖర్చవుతుంది. ఇక చందాలు ఇవ్వని వారిపై కొన్నిచోట్ల దౌర్జన్యం చేస్తున్నారు. ఇవన్నీ దైవకార్యాలని పోలీసులు పెద్దలు పట్టించుకోవడం లేదు.
గణపతి ప్రసాదాలను చివర రోజున వేలం వేస్తారు. దేవుని ప్రసాదానికి వేలంపాట ఏమిటి? భక్తి ఎంత వెఱ్ఱితలలు వేసిందో చూడండి. అసలు ప్రసాదం అమ్మకం ఏమిటి? ప్రసాదం అంటే ఉచితంగా ఇచ్చేది. ఏ కూడలిలో ఎంత ఎత్తు విగ్రహం పెట్టారో ఎక్కడ ప్రసాదం హెచ్చువేలంలో వెళ్లిందో మొదలైన వివరాలు వార్తా పత్రికలలో వస్తాయి. ఇదొక పెద్ద ప్రచారం. ఎక్కువ ధనం ఇచ్చి కొంటే గణపతి అనుగ్రహం ఎక్కువ లభిస్తుందా? విగ్రహాల నిమజ్జనకు వెళ్లే సమయంలో గణపతి యొక్క వివిధ నామాలను ఉచ్ఛరించాలి. భజనలు చేయాలి. ఈ సమయంలో మైకులు, బాణాసంచాలు వాడకూడదు. ఇక పల్లెలలో కూడా వినాయక సంబరాలు ఇటీవల ఎక్కువయిపోయాయి. వివిధ వేషాలు ధరించి ట్రాక్టర్లపైన బండ్లపైన ఊరేగుతున్నారు.
అయ్యప్పదీక్షలు పూర్వం మన ప్రాంతంలో లేవు. ఇటీవల అవి ప్రవేశించాయి. వీటిని చూచి కొత్త కొత్త దీక్షలు ప్రారంభమయ్యాయి. దీక్షలు మంచివే అవి ప్రజలకు ఇబ్బందులు కలుగజేయకూడదు. దీక్షా సమయంలో వీరంతా ఏదో దేవాలయంలో ఉంటారు. పెద్ద శబ్దాలతో మైకులు ఉపయోగించి భజనలు చేస్తారు. చుట్టుప్రక్కల చదువుకునే పిల్లలున్నా వృద్ధులున్నా వీరికి అవసరం లేదు. ఇక యాత్రకు బయలుదేరే రోజు ఒక బస్సు గ్రామ పొలిమేరలోకి వస్తుంది. భక్తులు అందరు బాణసంచా కాలుస్తూ ఊరేగింపుగా ఆ బస్సువద్దకు వెడతారు. దీనికి గంటలకొద్ది సమయం పడుతుంది. వాస్తవానికి ఆరోజు దైవనామస్మరణ చేస్తూ బయల్దేరాలి. అలా జరగడం లేదు. నియమాలు ఎల్లకాలం పాటించాలి. కొద్దికాలం పాటిస్తే ప్రయోజనం లేదు. మాలలు వేసే గురువుల యొక్క ఫ్లెక్సీలు అట్టహాసంగా ప్రదర్శించబడతాయి. భక్తికి ప్రచారం ఎందుకు? భక్తులలోనే మార్పురావాలి కాని ఈ విషయంలో ఎవరూ ఏమీ చేయలేరు.

- వేదుల సత్యనారాయణ