సబ్ ఫీచర్

కార్మికులకు అందని సంక్షేమ ఫలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలోకెల్లా జనాభాపరంగా రెండవ స్థానంలో వున్న మన భారతదేశంలో యువత పరంగా ప్రథమస్థానంలో వుంది. భారతదేశానికి అతి పెద్ద వరం ఆ దేశంలో వున్న యువతేనని ఇటీవలి కాలంలో అమెరికా, చైనా, రష్యా అధ్యక్షులు ప్రకటించడం చూస్తుంటే మనకు ఎంత మంచి సంపద లభించిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. భారతదేశంలోవున్న యువత వంటి మానవ వనరులతో మేము అద్భుతాలను సాధించగలమని ఫ్రాన్స్ అధ్యక్షులు స్వయంగా సెలవిచ్చారు. అటువంటి యువ సంపదను సద్వినియోగం చేసుకోవడంలో మన ప్రభుత్వాలు దారుణంగా విఫలవౌతున్నాయి. సరైన ఉపాధి అవకాశాలు లేక కోట్లాది మంది యువత తీవ్ర నిరాశా నిస్పృహలలో కొట్టుమిట్టాడుతున్నారు. దేశంలో ఒకవైపు నిరుద్యోగ సమస్య జడలు విప్పుతుంటే, మరోవైపు వేతనాల వృద్ధిలో అసమానతలు, లింగ వివక్ష తీవ్రతరమవుతున్నాయి. పైకి అందరూ సమానమని ప్రకటిస్తున్నా ఆచరణలో అది విఫలవౌతోంది. సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న దాదాపు 69శాతం మంది కార్మికులు కనీస వేతనాలకు నోచుకోని దయనీయస్థితిలో రెక్కలు ముక్కలు చేస్కుంటున్నారని, గడచిన రెండు దశాబ్దాలలో వారి స్థితిగతులలో ఎలాంటి మార్పు కానరావడం లేదని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) మన దేశంలోని వేతనాల స్థితిగతులపై ఇటీవల విడుదల చేసిన నివేదిక మన ప్రభుత్వాలకు కనువిప్పు కావాలి. 1991-2011 మధ్యకాలంలో భారత ఆర్థిక వ్యవస్థ 275 బిలియన్ డాలర్ల నుంచి 1.80 ట్రిలియన్ డాలర్లకు పెరిగినా నిరుద్యోగ సమస్య, వేతనాల వృద్ధి, కనీస వేతన అమలులో అసమానతల తొలగింపు, దేశంలో పెరుగుతున్న జీవన వ్యయ సూచీ ఆధారంగా కనీస వేతనాల పెంపు, ఔట్ సోర్సింగ్ కార్మికులకు వెట్టిచాకిరి నుండి విముక్తి వంటి అంశాలలో ఎలాంటి అభివృద్ధి కానరాకపోవడం నిజంగా శోచనీయం. ప్రభుత్వ, ప్రైవేట్, అసంఘటిత రంగాలలో ఏర్పడిన ఖాళీలను పూరించకుండా, ఔట్ సోర్సింగ్ విధానాలను అమలుపరుస్తూ, తాత్కాలిక ఉద్యోగుల సంఖ్యను, పర్మినెంట్ ఉద్యోగుల సంఖ్య కంటే ఎన్నో వేల రెట్లు పెంచేందుకు ప్రభుత్వ విధానాలు తోడ్పడ్డాయి. ఏ రకమైన సాంఘిక భద్రత, సౌకర్యాలు లేని కాంట్రాక్ట్, క్యాజువల్ కార్మికుల సంఖ్యను ఇబ్బడిముబ్బడిగా పెంచడం ఆరోగ్యకర విధానం కాదని ఎన్నో కమిటీలు, మేధావులు, మానవ వనరుల నిపుణులు పోరుపెట్టినా ప్రభుత్వం పట్టించుకోలేదు. గత సంవత్సరంలో వెలువడిన ఆక్స్‌ఫామ్ నివేదిక ప్రకారం ప్రపంచ సంపదలో 82 శాతం ఒక శాతం మంది వద్దే పోగుపడుతున్నది. అంటే కార్మికుల పొట్టగొట్టి సంపదను కూడబెడుతున్నారని స్పష్టమవుతోంది. ఇటువంటి అనైతిక విధానాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా సామ్రాజ్యవాద తత్వాన్ని పెంచి పోషిస్తున్నాయి. అభివృద్ధి చెందిన అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ దేశాలలో కూడా కార్మిక, యువశక్తి ద్వారా వస్తున్న ఆదాయంలో అతి తక్కువ శాతం మాత్రమే ఆ ఆదాయం పెరిగేందుకు తమ జీవితాలను పణంపెట్టి రేయింబవళ్ళు శ్రమిస్తున్న కార్మిక, యువ శక్తికి అందుతోంది. స్వాతంత్య్రం అనంతరం మన దేశంలో ఈ విషయంలో కొంత సువిశాల దృక్పధం వున్నా 1990 దశకంలో ప్రారంభించిన నయా ఉదారవాద విధానాల కారణంగా సంకుచిత ధోరణి మొదలయ్యింది. మన దేశ కార్మికుల్లో 66 శాతం మంది క్యాజువల్ లేబర్‌గా పనిచేస్తున్నారనీ, వారికి రెగ్యులర్ కార్మికులకు అందే వేతనాలలో 36 శాతమే దక్కుతున్నదని సదరు నివేదిక వెల్లడించింది. మన దేశంలో గత 20 సంవత్సరాలలో జీడీపీలు పెరుగుతున్నా.. వేతనాలలో వృద్ధి మందగించింది. సంపద సృష్టిస్తున్న కార్మికులకు సరైన వాటా రావడం లేదు. నిరుడు పట్టణ, గ్రామీణ ప్రాంత తేడాతో లింగ సంబంధిత వేతన వ్యత్యాసం దాదాపు సగానికి సగం ఉంటున్నట్లు అంతర్జాతీయ కార్మిక సంస్థ స్వయంగా పేర్కొంది. వేతనాల చెల్లింపులో ప్రాంతీయ వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. దళారీల వ్యవస్థ పట్టణ ప్రాంతాలతోపాటు కార్పొరేట్ వ్యవస్థలోకి కూడా ప్రవేశించింది. సంస్థలు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను నేరుగా కాక మానవ వనరుల సంస్థల ద్వారా ఏర్పాటుచేసుకోవడంవలన ఈ మధ్యంతర సంస్థలు ఉద్యోగుల శ్రమను దోచుకోవడంతోపాటు వారికి సరైన వేతనాలు కూడా ఇవ్వడం లేదు. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద సంక్షేమ పథకంగా ప్రఖ్యాతి వహించిన మహాత్మాగాంధీ రోజ్‌గార్ యోజన పథకంలో ఎంతో అవినీతి చోటుచేసుకొని ప్రభుత్వ నిధులలో 65 శాతం దళారులు, అవినీతి అధికారుల జేబుల్లోకి వెళిపోతోందని కాగ్ స్వయంగా తన నివేదికలో పేర్కొన్నా దిద్దుబాటు చర్యలు శూన్యం.