సబ్ ఫీచర్

కో పైలట్ సింధు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు స్వదేశంలో తయారైన తేలికపాటి యుద్ధ విమానాన్ని నడిపింది. బెంగళూరులోని యలహంక ఎయిర్‌బేస్ స్టేషన్‌లో ఏరో ఇండియా ప్రదర్శన జరుగుతున్న విషయం తెలిసిందే. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏరో ఇండియా ఈ నెల 23న విమెన్స్ డే వేడుకలను నిర్వహించింది. ఇందులో భాగంగానే సింధు తేజస్ యుద్ధ విమానంలో ప్రయాణించింది. తేజస్‌కు కో పైలట్‌గా వ్యవహరించిందని రక్షణశాఖ ప్రతినిధి తెలిపారు. తేజస్ యుద్ధవిమానానికి కో పైలట్‌గా వ్యవహరించిన తొలి మహిళగా సింధు నిలిచింది. ఏరో ఇండియాలో మహిళా పారాట్రూపర్లు చేసిన ప్రదర్శన హైలెట్‌గా నిలిచింది. మి17 విమానం నుంచి ఐదుగురు మహిళా పారాట్రూటర్లు జంప్ చేసి అందరి దృష్టిని తమవైపుకు తిప్పుకున్నారు. మహిళా పైలెట్లు కూడా విమానాలను నడిపి తమ నైపుణ్యాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఏవియేషన్, ఏరోస్పేస్ రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మహిళలను ఘనంగా సత్కరించారు. ఏవియేషన్ రంగంలో మహిళా సేవలను కీర్తిస్తూ వారి గుర్తుగా స్టాంపును విడుదల చేశారు. వైమానిక రంగంలో మహిళలు సాధించిన అద్భుతమైన విజయాలను ఏరో ఇండియాలో ప్రదర్శించనున్నారు. మహిళా సిబ్బంది విమానాలను నడిపి తమ ప్రతిభను చాటుకున్నారు. తేలికపాటి యుద్ధ విమానం తేజస్ గత బుధవారమే వాయుసేనలో చేరింది. తేజస్‌ను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఉత్పత్తి చేసింది. గాలిలో ఉండగానే ఇంధనాన్ని నింపుకోవడం, ఎలక్ట్రానిక్ యుద్ధ సూట్లతో పాటు పలు రకాల బాంబు, ఆయుధాలను కలిగి ఉండటం వంటి ప్రత్యేకతలున్నాయి దీనికి.