సబ్ ఫీచర్

ప్రభుత్వ విద్యాసంస్థలు వెలవెల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమ తప్పిదాలను ఇతరుల పైకి నెట్టివేసి, తాము సచ్చీలురమని చెప్పుకొనే సంస్కృతి సమాజంలో నానాటికి పెరిగిపోతున్నది. అంతే తప్ప, ఆత్మవిమర్శ చేసుకొని, జరిగిన తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించే నాథుడే కరవయ్యారు. అందుకు ప్రత్యక్ష నిదర్శనంగా మన రాష్ట్రంలోని విద్యావ్యవస్థను చెప్పుకోవచ్చు. మన రాష్ట్రంలో నానాటికీ విద్యారంగంలో ప్రైవేటు సంస్థల (కార్పొరేట్) ప్రాబల్యం పెరిగిపోతున్నది. దీనికి కారణం అటు ప్రభుత్వ విధానాలు ఇటు ఉపాధ్యాయ, అధ్యాపక వర్గాలే. విద్యపై సాలీనా వేల కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నా ఆశించిన ఫలితాలు రావడం లేదని ప్రభుత్వం ఆరోపిస్తుండగా, ప్రభుత్వ విద్యాసంస్థలలో కనీస వౌలిక సదుపాయాలు కల్పించక పోవడంవల్లనే ప్రజలకు ప్రభుత్వ విద్యాసంస్థల పైన నమ్మకం కలుగడం లేదని ఉపాధ్యాయ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
స్థూలంగా పరిశీలిస్తే, ‘‘తిలాపాపం తలాకొంచం’అన్న చందాన ప్రభుత్వ విద్యాసంస్థలపై ప్రజలు నమ్మకం కోల్పోవడానికి అటు ప్రభుత్వం ఇటు ఉపాధ్యాయులు కారణమే. ఇరువర్గాలలో చిత్తశుద్ధి లోపించడంవలన విద్యారంగంలో ప్రైవేటు సంస్థల ప్రాబల్యం పెరిగిపోతున్నది. దీనిని ఆసరాగా తీసుకొని కార్పొరేట్ సంస్థలు విద్యను ఒక వినిమయ వస్తువుగా మార్చివేశాయి. కార్పొరేట్ విద్యాసంస్థలు మార్కెట్ మంత్రాంగంను వినియోగిస్తున్నాయి.
డిమాండ్ ఉన్న వస్తువులను మార్కెటింగ్ చేసిన కంపెనీకి అధిక లాభాలు వస్తాయి. ప్రజలలో ఆంగ్లభాషా వ్యామోహం బాగా పెరిగిపోయింది. ప్రభుత్వం తదనుగుణంగా ప్రాథమిక స్థాయినుంచే ఆంగ్ల మాధ్యమంను ప్రవేశపెట్టడానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో పలువురు తమ పిల్లలను ఆంగ్లమాధ్యమంకోసం ప్రైవేటు పాఠశాలలకు పంపుతున్నారు. దీని కారణంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు విద్యార్థుల లేమిని ఎదుర్కొంటున్నాయి.
ఇక కళాశాలల విషయానికి వస్తే, చాలా విచిత్రమైన పరిస్థితి నెలకొని వుంది. నేడు రాష్టవ్య్రాప్తంగా ప్రైవేటు జూనియర్ కళాశాలలు విద్యార్థులతో కిక్కిరిసిపోయి ఉంటుంటే, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు మాత్రం విద్యార్థులు లేక వెలవెలపోతున్నాయి. దీనికి కారణం, అటు ప్రభుత్వం ఇటు అధ్యాపకులు. ప్రస్తుతం అందరు ఎంసెట్, వచ్చే సంవత్సరం నుంచి నీట్ లేదా ఎఐఇఇఇ, జెఇఇ వంటి పోటీ పరీక్షలపై తమ దృష్టిని నిలుపుతున్నారు. వీటిలో అడ్మిషన్ సంపాదించాలంటే పాఠ్యాంశాలను క్షుణ్ణంగా చదవాలి. అంతేకాకుండా వాటిని సక్రమంగా, సమగ్రంగా బోధించాలి. అందుకు ప్రస్తుతం ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నిర్వహిస్తున్న పనిగంటలు చాలవు. అదనపు తరగతులు నిర్వహించాలి. అయితే, ఆ విధంగా అదనపు తరగతులు నిర్వహించే ప్రభుత్వ జూనియర్ కళాశాలలు దాదాపుగా లేవు. ప్రస్తుతం ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో అదనపు తరగతులు నిర్వహిస్తున్నారు. పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా జూనియర్ కళాశాలల్లో బోధన కూడ జరగడం లేదు.
ప్రభుత్వం కూడ అన్ని విద్యాసంస్థలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ/ అధ్యాపక పోస్టులను భర్తీచేయాలి. ఉపాధ్యాయులు/అధ్యాపకులలో జవాబుదారీతనం పెంపునకు కృషిచేసి, ప్రభుత్వ విద్యాసంస్థలలో కనీస వౌలిక సదుపాయాలు కల్పించాలి. అలా జరుగకపోతే మరో దశాబ్దకాలం తరువాత ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, జూనియర్ కళాశాలలు కనుమరుగు అయ్యే ప్రమాదం ఉంది.

- పి.మస్తాన్‌రావు