సబ్ ఫీచర్

ఎన్నాళ్లకెన్నాళ్లు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇది ముస్లిం మహిళలకు శుభవార్తే. మసీదుల్లోకి మహిళలకు ప్రవేశం లేదు. కాని తొలిసారి లక్నోలోని అషిబాగ్ ఈద్గ్‌లో గురువారంనాడు ముస్లిం మహిళలు నమాజ్ చేయనున్నారు. ఇది ఓవిధంగా ముందడుగే అయినప్పటికీ, మహిళలను ప్రత్యేకంగా ఎన్‌క్లోజర్ బాక్స్‌లో కూర్చోబెట్టి నమాజ్ చేయించేందుకు ఏర్పాట్లు చేయటం పట్ల స్ర్తివాదులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. గురువారంనాడు ముస్లిం మహిళలు నమాజ్ చేసుకునేందుకు తయాబ్ హాలులో ప్రత్యేక ఎన్‌క్లోజర్ ఏర్పాటుచేసినట్లు దర్గా ఇమామ్ తెలియజేస్తున్నారు. దాదాపు 500 మంది మహిళలు వచ్చి నమాజ్ చేసుకోవచ్చు.
పది ప్రార్థనా స్థలాల్లోకి మహిళలకు ప్రవేశం లేదు..
అన్నింటా వివక్షకు గురవుతున్న మహిళ భగవంతుడ్ని పూజించే విషయంలోనూ ఆమె పట్ల చిన్నచూపుచూస్తున్నారు. భక్తితో భగవంతుడ్ని పూజించే విషయంలో తమపట్ల ఈ వివక్షత ఎం దు కు అంటూగ త కొనే్నళ్లుగా అం దోళనలు జరుగుతున్నాయి.ప్రార్థనా ప్రదేశాలలోకి మహిళల ప్రవేశానికి సంబంధించి ఆంక్షలు ఎత్తివేయాలని దేశవ్యాప్తంగా మహిళలు గళమెత్తుతున్నారు. కేరళలోని అయ్యప్పస్వామి ఆలయంలోనూ, అలాగే మహారాష్టల్రోని శని దేవుని ఆలయంలోకి మహిళలకు ప్రవేశం లేదు. దీనిపై స్ర్తివాదులు న్యాయస్థానాలను ఆశ్రయించగా, ఇటీవలనే శని దేవుని ఆలయంలోకి మహిళలను అనుమతిస్తూ కోర్టు తీర్పు ఇచ్చిన విషయం విదితమే. ముస్లిం మహిళలు కూడా ముందుకు వచ్చి హజీ అలీ దర్గాలోకి ప్రవేశం కల్పించాలని ముంబయి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరుగుతుండగా.. లక్నోలోని అషిబాగ్ దర్గాలోకి ముస్లిం మహిళలను నమాజ్‌కు అనుమతి ఇవ్వటం కొంత ముందడుగే అయినప్పటికీ ప్రత్యేక ఏర్పాట్లు చేయటం వల్ల వారిపట్ల వివక్ష కొనసాగుతుందనటానికి నిదర్శనమని జకియా సోమన్ అంటున్నారు. సౌకర్యవంతంగా కూర్చొని అల్లాను ప్రార్థించుకోవటానికి మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు అవసరమా అని ఆమె ప్రశ్నిస్తున్నారు.