సబ్ ఫీచర్

‘ఆధ్యాత్మిక హిందువుల’ వౌనం దేనికి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్‌లో ఈమధ్య జరిగిన లోక్‌సభ ఎన్నికల ప్రచార సభలో తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస పార్టీ అధినేత కేసీఆర్ కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. ఆయన స్పష్టంగా కొన్ని విషయాలు తేల్చేశారు. భాజపా వారిది ‘రాజకీయ హిందుత్వం’ అయితే, తమది ‘నిజమైన హిందుత్వం’ అని ఆయన చెప్పుకున్నారు. అలాగే రామజన్మభూమి వివాదంపై నిర్ణయం పీఠాధిపతులదే కాని, దాని పరిష్కారం రాజకీయ పార్టీల పని కాదన్నారు. అంతేకాదు. వారు డూప్లికేట్ హిందువులనీ, తాము ఆధ్యాత్మిక హిందువులమనీ తేల్చేశారు.
మొత్తానికి రామజన్మభూమి వివాదం 1950 నుంచీ వివిధ వివాదాల రీత్యా, న్యాయస్థానాల ముందుకొచ్చింది. అలహాబాద్ హైకోర్టు దశను దాటి సుప్రీం కోర్టు ముందుకెళ్లింది. ఆ దశలో ఎన్నికలు రావటంతో కేసీఆర్ నుంచి ఆసక్తికరమైన వ్యాఖ్యలు బయటికొచ్చాయి.
ఈ సందర్భంగా కొన్ని సందేహాలు... నిజంగా తాను ఆధ్యాత్మిక హిందువుఅయితే, ఈ సమస్యకు పరిష్కారం పీఠాధిపతులదే అని నమ్మితే, కేసీఆర్ వెంటనే పీఠాధిపతులను కలిసి, దీనిని పరిష్కరించండని ఎందుకు విజ్ఞప్తి చేయలేదు? ఆయన తనకున్న అంగబలం, అర్థబలంతో ఈపాటికి అనేకసార్లు పీఠాధిపతులను కలిసి ఉండవలసిందే. మరెందుకు అలా జరగలేదు? ఎందుకీ ఆధ్యాత్మిక హిందూ నాయకులు అలసత్వం వహించారో అర్థం కావడం లేదు.
అంటే- రేపటి ఎన్నికల్లో డూప్లికేటు హిందువులు, ఆధ్యాత్మిక హిందువుల లెక్క తేలుతుందా? ఈ వాదానికి మనమేమనాలో తేల్చవలసిన సమయం వచ్చిందా? .. ఆలోచించండి. కేసీఆర్ ఉద్ఘాటనలన్నీ అన్ని పత్రికలలో పతాక శీర్షికలలోనే వచ్చాయి సుమా!
‘ప్రజాస్వామ్యంలో పాలకపక్ష-ప్రతిపక్షాల మధ్య వైరం సహజమే. వారిని వీరు, వీరిని వారూ ప్రతి అంశంలో విరోధించటం మామూలే. ప్రతిపార్టీకీ అధికార దాహం, పదవీలాలస స్వాభావికమే. కాని ప్రస్తుతం జరుగనున్న ఎన్నికల నేపథ్యంలో గత కొన్ని నెలల నుండీ అనేక విపక్షాలు ఏకమై చేస్తున్న రభస చూస్తుంటే- నేడు కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వాన్ని మళ్లీ రానీయకూడదనే పట్టుదల వారిలో తీవ్రస్థాయిలో ఉన్నాయి.
కొద్దికాలం వరకూ మోదీ ప్రభుత్వ పక్షాన నిలిచిన ఓ రాష్ట్ర నేత కేవలం వ్యక్తిగత స్వార్థకారణాలతో- తన అవినీతి బైటపడుతుందేమోనన్న భీతితో, మద్దతు ఉపసంహరించుకున్న విషయం విదితమే.
నిజానికి ప్రస్తుతం దేశ పాలనను నిర్వహిస్తున్న ప్రభుత్వం గాని, నాయకుడు గాని- నిష్పక్షపాతంగా, సరళంగా పరిశీలిస్తే- పారదర్శకంగా, నీతియుతంగా సమగ్ర దేశాభివృద్ధికి పాటుపడ్డారని అనేక తార్కాణాలతో కూడా స్పష్టవౌతుంది. ఈ విషయాలను ఇంకా విశదీకరించాలి. శత్రుదేశాల నుండి దేశానికి ఏ భయమూ లేని భద్రత, ఉగ్రవాద-తీవ్రవాద కార్యకలాపాలు ఏ ఒక్కటీ జరగని శాంతి, ఏ ఒక్క మతానికీ కొమ్ముకాయకుండా, సమగ్ర దేశ ప్రజాసంక్షేమం, ఆర్థికాభ్యుదయం స్వచ్ఛతకై ముందడుగు, సుస్థిరత, విదేశీ సంబంధాల మెరుగుదల, అంతర్జాతీయంగా దేశఖ్యాతి, బలమైన దౌత్యనీతి, వ్యవసాయ రంగానికి దన్ను, దేశ సంస్కృతి అభ్యున్నతి- వీటికోసం అహరహం శ్రమించే నాయకుని, గత నాలుగున్నర ఏళ్లనుండి మనదేశం పొందగలిగింది.’
కేవలం దేశాభ్యుదయం, పరిపాలనా బాధ్యత తప్ప, మళ్లీ పదవి కోసం కుతంత్రాలు పన్నటం, లేనిపోని తాయిలాలు, ఆకర్షణలు ప్రకటించటం వంటి క్షుద్ర రాజకీయాలు లేని గొప్ప వ్యక్తిత్వాన్ని దేశనాయకత్వంగా ఇన్నాళ్లూ పొందగలిగాం. కాని అవినీతిని మరిగి, క్షుద్ర రాజకీయాలకు అలవాటై పాలనను కుటుంబాల గుత్త్ధాపత్యంగా చేసుకుని, స్వీయ కులాభివృద్ధికి కృషిచేస్తున్న నేతలందరూ కుమ్మక్కై, కూటములుగా మారారు..
‘రాజ్యాంగంపై, దేశంపై అవగాహన లేని సామాన్య ప్రజలు అధికంగా ఉన్న ఈ దేశంలో, దశాబ్దాల అవినీతితో కుళ్లిపోయిన నాయకత్వం అలవాటై, నిజమైన అభ్యుదయాన్ని గుర్తించలేని అజ్ఞానం నెలకొని ఉంది..
‘ఈ కూటములు మార్పిడి మతాల మద్దతు కోసం వీర విన్యాసాలకు ఉపక్రమిస్తున్నాయి కూడా. ఈ అసుర శక్తుల మోహరింపులో, నిజాలపై నీడలు, సత్యాలపై ఆవరణలు కమ్ముకుంటున్నాయి. ఈ నేపథ్యంలో దేశ ధర్మాల అభ్యుదయానికి మూలమైన సత్‌ప్రభుత్వ పాలన పునఃప్రతిష్టింపబడాలని దేశాభ్యుదయం కాంక్షించే ప్రతి పౌరుడూ నిర్ణయించుకోవాలి. ఆ విధంగా భారతీయుల బుద్ధులను ఆ పరమేశ్వరుడు ప్రేరేపించాలని ప్రార్ధిద్దాము. రాజకీయ నాయకులు కానివారు, దేశాభ్యుదయానికి తీవ్రంగా కృషిచేస్తున్న ఇతర ప్రముఖుల అభిప్రాయాలను కూడా తెలుసుకోవటానికే ఈ తాపత్రయం..

-చాణుక్య