సబ్ ఫీచర్

ఉగ్రవాదులపై మెత్తదనం ఎందుకో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొన్ని పరిస్థితుల్లో మనకు సంతోషం ఉండదు, కోపం ఉంటుంది. అందువలన ఎవరైనా నిరపరాదుల ప్రాణాలను బలిగొంటే అది సరైనదే అనడానికి అది పెద్ద కారణం కాజాలదు. న్యాయప్రియులున్న సమాజం నుంచి అటువంటి చర్య సరైనది కాదనే జవాబు వస్తుంది. కాని కాంగ్రెసు వరిష్ట నేత, రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ్‌సింగ్ అలా అనుకోడు. ఫ్రాన్స్‌లో పది మంది పత్రికా విలేఖరులను, ఇద్దరు పోలీసులను ఉగ్రవాదులు హత్య చేయడం అతని దృష్టిలో సరైనదే, ఉగ్రవాదులకు విరుద్ధంగా ప్రపంచంలో జరుగుతున్న కఠిన చర్యలకు అది సహజమైన ప్రతిచర్యగానే అతను భావిస్తున్నాడు. గత మూడు దశాబ్దాలుగా ఉగ్రవాదులు అడ్డు అదుపు లేకుండా నిరపరాదులను పొట్టన పెట్టుకుంటున్న దేశంలోని ఒక రాజకీయ నాయకుడు వారి బీభత్సకర చర్యలు సరైనవే అంటూ వారి తరఫున మాట్లాడడం చూస్తే కాంగ్రెస్ చెడు మనస్తత్వానికి గురైందని అనుకోవడంలో ఎలాంటి పొరపాటు లేదు.
అమెరికా, న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ టవర్ మీద ఉగ్రవాదులు జరిపిన దాడికి ప్రతి చర్యగానే యావత్ప్రపంచంలోనూ ఉగ్రవాద నిరోధ నిరసనలు జరిగాయని మణిశంకర్ అయ్యర్ సాహెబ్ మాటల ఆధారంగా అనుకోవాలా? అయితే ఉగ్రవాదులు అమెరికాలో సృష్టించిన ఆ విధ్వంసం దేనికి ప్రతిచర్యో అయ్యరు మహాశయుడు స్పష్టం చేయలేదు. వాస్తవానికి అయ్యర్ తన వక్తవ్యాలలో ముస్లింలనందరినీ చేరుస్తున్నాడు. ముస్లింలు అత్యాచారాలకు గురవుతున్నారు కాబట్టే వాటికి ఇవి ప్రతీకార చర్యలంటూ సమర్థిస్తున్నాడు. ఆ విధంగా ముస్లింలను సమర్థించాలనుకునే తలంపుతోనే ఉగ్రవాదులను కూడా సమర్ధించడంలో అతను వెనుకాడడం లేదు. అతని ఈ తర్కంతో బహుశా ముస్లింలు కూడా సమ్మతించరు. అతని ఉగ్రవాద సమర్థింపు అభిప్రాయాన్ని కాంగ్రెసు పార్టీ అభిప్రాయమని భావించాలా? కాంగ్రెసు పార్టీని దాని సీనియర్ నేతలను వేరువేరుగా పరిగణించలేము. అయితే మణిశంకర్ అభిప్రాయం అతని వ్యక్తిగతమైనది. అది పార్టీ అభిప్రాయం కాదని పార్టీ కొట్టివేసింది. అయ్యర్ గాంధీ పరివారానికి అత్యంత సన్నిహితుడు. రాహుల్‌గాంధీని అధ్యక్షుడిగా చేయాలంటూ అతను అనని రోజులు లేవు. అతని అభిప్రాయంతో పార్టీకి సంబంధం లేదు అని పార్టీ అంటే అది సమంజసమైన జవాబు కాగలదా? ఇది ఇలావుండగా కాంగ్రెసేతర ఇతర సెక్యులర్ పార్టీ నాయకులు అయ్యరును నిందించక, సమర్థించక వౌనముద్ర వహించారు. వారు అయ్యరును సమర్థించాలి లేదా అతని వక్తవ్యాన్ని ఖండించాలి, వారి వౌనం మరింత నిర్ఘాంతపరుస్తోంది. భారతీయ జనతాపార్టీ సభ్యులు చేసే అతి చిన్న వక్తవ్యాలను రభస చేసి దుమారం లేపి పార్లమెంటును కూడా స్తంభింప జేస్తున్నారు. మరి అయ్యర్ వక్తవ్యానికి స్పందించరేం? గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ ఘోర పరాజయం పాలైంది. దానికి కారణం విశే్లషించడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ రక్షణ మంత్రి ఏ.కె.ఆంథోనీ అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది కాంగ్రెస్ హైకమాండ్. హిందూ విరోధిగా పార్టీని ప్రజలు భావించడం కూడా ఓటమికి ఒక కారణం అని కమిటీ చెప్పింది. ఈ ధోరణిని మార్చుకోవాలని హితవు చెప్పిందాకమిటి. మణిశంకర్ అయ్యర్ వంటి నాయకుల హిందూ విరోధ వ్యాక్యలు పార్టీకి సహాయం చేస్తాయా అన్నది ఒక ప్రశ్న. ప్రస్తుతం ఉన్నవి ద్విదళ రాజకీయాలు ఎంతమాత్రం కావు. అయినప్పటికీ ఆలోచనలు రెండు విభిన్న ధ్రువాల వంటివి. భారతీయ జనతాపార్టీ దానిని సమర్థించే వారిది ఒక పోకడ అయితే కుహనా సెక్యులరిస్టులది మరొక పోకడ. ఎట్టి పరిస్థితులలోనూ ఈ రెండు గ్రూపులు ఒకరి మాటను వేరొకరు సమ్మతించలేరు. ఇటువంటి వైమనస్యం రాజకీయాలలో ఇంతకుముందు ఉండేది కాదు. తప్పుడు ఆలోచనలను వీరు కళ్ళుమూసుకుని సమర్థించే స్థితికి దిగజారిపోయారు. మణిశంకర్ అభిప్రాయాల మీద తమ అభిప్రాయాన్ని స్పష్టంగా ఈ సెక్యులరిస్టులు చెప్పక పోవడానికి ముఖ్య కారణం భారతీయ జనతాపార్టీ మీద ప్రత్యక్ష విరోధమే! రాజకీయాల్లో సహనం నానాటికి క్షీణించిపోతోంది. ఉగ్రవాదాన్ని ఒక సంప్రదాయంతో పూర్తిగా జోడించి చూస్తున్నారు. ఒక పక్షంవారు ఒక సంప్రదాయాన్ని నిందిస్తే రెండో పక్షం మరో సంప్రదాయాన్ని లక్ష్యం చేస్తోంది. కలసికట్టుగా ఉగ్రవాదాన్ని దేశంలో అరికట్టాలన్న అభిప్రాయం ఎవరికీ లేదు.
ఒకరినొకరు నిందించుకోవడం, తమ వైరి పక్షంవారి లొసుగులను విమర్శించడం రాజకీయాల్లో సహజ ప్రక్రియ. అయితే విరోధి పక్షాన్ని దూషించే ముందు సహనం పాఠించాలి, పార్లమెంటు సంప్రదాయాలను అతిక్రమించరాదు, లక్ష్మణరేఖను దాటరాదు. ఒకనాడు ఈ సంప్రదాయాలు బలంగా నుండేవి. ఇప్పుడు సామాన్యమైన ఆ హద్దులు చెరిగిపోయాయి. ఒకరిని వేరొకరు లక్ష్యపెట్టడం లేదు. వెనుకటి రాజకీయాలతో పోలిస్తే నేడు పోటీ బాగా పెరిగిపోయింది. వేరొకరికోసం ఎలాంటి అవకాశం విడిచిపెట్టకూడదు అనుకుంటున్నారు. రాజకీయ పక్షాల సిద్ధాంతాలు వేరుకావచ్చు, పనిచేసే విధానం వేరు కావచ్చు, సమస్యలను పరిష్కరించే పద్ధతులూ వేరుకావచ్చు.
కాని రాష్ట్రీయ హితవు పార్టీ లేదా ప్రభుత్వ విధానంతో మార్చివేయలేము. కాని నేడున్న స్థితిలో రాజకీయ నాయకుల నడతలో రాష్ట్రీయ హితవుకన్నా పార్టీ హితమే ప్రధానంగా పరిగణిస్తున్నారేమోనని అనిపిస్తోంది. ఉగ్రవాదులతో పోరాడడం ఒక పార్టీ లేదా ప్రభుత్వం పనే కాదు. ఈ పోరాటంలో దేశవాసులందరూ సంయుక్తంగా పాలుపంచుకోవాలి. ఉగ్రవాదుల దుస్సాహస చర్యలను వెనకేసుకురావడం వారిని సమర్థించడంతో సమానం. ఈ ప్రవృత్తి ఉగ్రవాదంకన్నా భయంకరమైనది, అపాయకరమైనది. ఇది కాంగ్రెస్ విరుద్ధం (వెర్సెస్)గా భారతీయ జనతాపార్టీ లేదా ప్రభుత్వ విరుద్ధంగా ప్రతిపక్షాలకు సంబంధించిన విషయం కాదు. ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం. ఉగ్రవాదుల ప్రతి చర్యలు సరియైనవేనని వారిని సమర్ధించిన కారణంగా కాంగ్రెస్ పార్టీ కోలుకొని తన పూర్వ వైభవాన్ని అందుకోలేదు. తన పూర్వ వైభవాన్ని తిరిగి చేజిక్కించుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ తన నీతి రీతులను సవరించుకోవాలి. ఇంతగా పార్టీ పతనమవడానికి గల కారణాలను అనే్వషించాలి. ఉగ్రవాదుల పట్ల కాంగ్రెస్ పార్టీ మెత్తదనాన్ని ఎందుకు చూపిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ఇది ఆలోచించవలసిన తరుణం కాదా?

- గుమ్మా ప్రసాదరావు