సబ్ ఫీచర్

హార్మోన్ల మాత్రలు వాడుతున్నారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెళ్లికి అదే మంచి ముహూర్తం. పైగా అందరికీ చాలా అనువుగా ఉంది. వచ్చిన సమస్య ఏంటంటే ఆ రోజులో అమ్మాయికి అడ్డంకి ఉంది. అందుకని మాత్రో, సూదో ఇచ్చి అమ్మాయికి అడ్డంకి తొలగేలా లేదా ముందుకు వచ్చేలా చేయండి అంటూ డాక్టర్ల దగ్గరికి, మందుల షాపుల చుట్టూ తిరుగుతుంటారు కొంతమంది అమ్మలు. పెళ్లి ముహూర్తాలనే కాదు దక్షిణ దేశ యాత్రలని, తప్పకుండా వెళ్లాల్సిన ఫంక్షన్ అని.. ఇలా చాలాసార్లు, చాలా రకాలుగా బహిష్టును దూరం జరపాలనో లేదా దగ్గరకు జరపాలనో కోరుకుంటున్నారు నేటి మహిళలు. ఈ మాత్రలన్నీ శరీరంలోని హార్మోనుల స్థాయిలను మార్చేస్తాయి. ఫలితంగా శారీరకంగా చాలా మార్పులువస్తాయి. కాబట్టి ఇవేవీ మంచి పద్ధతులు కావు. నిజానికి ఈ హార్మోన్ మాత్రలన్నీ స్ర్తిల కోసం ఉద్దేశించినవే.. వీటిలో కూడా రకరకాలున్నాయి. ప్రొజెస్టిరాన్ మాత్రలు, ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్.. రెండూ కలిసిన కంబైన్డ్ ఓసీ పిల్స్ ఇలా రకరకాలు.. వీటిలో ప్రొజెస్టిరాన్ పిల్స్‌ను కొంతకాలం బహిష్టు ఆపడానికి వాడతారు. ‘మినీ పిల్’ అనేది గర్భ నిరోధానికి వాడతారు. రెండూ కలిసిన కంబైన్డ్ పిల్‌ను ప్రధానంగా గర్భనిరోధానికి వాడతారు.
నేడు మహిళలను ప్రధానంగా వేధించే సమస్యలు రెండు. ఒకటి బహిష్టు వల్ల ఇబ్బంది. రెండోది అవాంఛిత గర్భం. ఈ రెంటినీ నిరోధించగలిగితే వారు వారి వారి రంగాల్లో సమర్థంగా పనిచేయగలుగుతారు అనే ఆలోచనతోనే ఈ హార్మోన్ పిల్స్‌ను తయారుచేశారు.
* బహిష్టుని కొంతకాలం రాకుండా ఆపడానికి..
* గర్భ నిరోధానికి..
* నెలసరి సక్రమంగా రానప్పుడు, సరిగ్గా వచ్చేట్లు చేయడానికి..
* పీరియడ్స్‌లో అధిక రక్తస్రావాన్ని అరికట్టేందుకు..
* పాలీసిస్టిక్ ఓవరీ డిసీజ్‌లో..
* ప్రీమెనుస్ట్రువల్ సిండ్రోమ్‌లో..
* ఎండోమెట్రియోసిస్ అనే వ్యాధి చికిత్సలకు హార్మోన్ల మాత్రలను వాడతారు.
బహిష్టును ఆపడానికి వాడే ప్రొజెస్టిరాన్ ఉన్న పిల్ ఐదు మిల్లీగ్రాముల డోసులో రోజుకి మూడుసార్లు, పీరియడ్ రావడానికి మూడురోజుల ముందు నుంచీ ప్రారంభించి పదిరోజుల పాటు వాడవచ్చు. అంతకుమించి వాడకూడదు. మాత్రలు ఆపిన మర్నాటి నుంచి పదిరోజుల్లోపు పీరియడ్ వస్తుంది. పీరియడ్ ముందొచ్చేట్టు చేయమని చాలామంది అడుగుతూ ఉంటారు. దేనికైనా వాడేవి అవే మాత్రలు. ఎప్పుడాపితే అప్పుడు ఒక వారం, పదిరోజుల్లో ఎప్పుడైనా రావచ్చు. కచ్చితంగా చెప్పలేం కాబట్టి అడ్డం అనుకున్న రోజుకి మూడు రోజుల ముందు నుంచీ మాత్రలు వాడి పీరియడ్స్ వాయిదా వేసుకోవడమే సరైన పద్ధతి. ఇంకొంతమంది రోజుకో టాబ్లెట్ చాలదా.. ఇదివరకు అలా వాడాం అంటుంటారు. ఇది కూడా సరికాదు. రోజుకు రెండు లేక మూడు మాత్రలు డాక్టరు సలహాలపై వాడటమే కరెక్టు. ఎందుకంటే వీటివల్ల లివర్ సమస్యలు, గుండె సమస్యలు, బీపీ, షుగర్, కిడ్నీ వ్యాధులున్నవారు, రక్తం గడ్డకట్టే జబ్బులున్నవారు ఈ మాత్రలు వాడకూడదు. ముఖ్యంగా పాలిచ్చే తల్లులు ఈ మాత్రలను అసలు వాడకూడదు. వాడితే పాలు తగ్గిపోతాయి.
గర్భనిరోదక మాత్రలు
వీటినే ‘పిల్’ అని కూడా పిలుస్తారు. 1960ల నుంచీ వీటిని గర్భం రాకుండా నివారించడానికి నోటి మాత్రలుగా ప్రపంచవ్యాప్తంగా వంద మిలియన్ల పైబడి వాడుతున్నారంటే వీటి అవసరం ఎంతుందో గమనించవచ్చు. 15-44 సంవత్సరాల మధ్య వయసువారికి వీటి అవసరం చాలా ఎక్కువ. అన్ని దేశాల్లో వీటి వినియోగం ఎక్కువే అయినా ఆశ్చర్యకరంగా జపాన్‌లో కేవలం మూడు శాతం జనాభా మాత్రమే వీటిని వాడుతున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌వారి అత్యవసర మందుల జాబితాలో ఈ ఓసీ పిల్స్ చోటు చేసుకున్నాయంటే వాటి అవసరం ఎంతుందో అర్థం చేసుకోవచ్చు. వీటి వాడకం విద్యార్థినులు, ఉద్యోగినులు జీవితంలో విప్లవాత్మకమైన మార్పు తీసుకువచ్చింది. వారు మరింత సమర్థంగా వారి వారి రంగాల్లో కృషి చేయడానికి తోడ్పడింది.
కంబైన్డ్ పిల్ ప్రస్తుతం అందుబాటులో ఉన్న గర్భనిరోధక సాధనాలన్నింటిలో అత్యంత సమర్థమైనది. మహిళ మెదడులోని హైపోథాలమస్ నుంచి పిట్యూటరీ గ్రంథుల నుంచి వెలువడే హార్మోన్లు అండాశయం మీద ప్రభావం చూపి, అండం ఎదిగి, అండాశయం నుంచి విడుదల అవుతుంది. అలా విడుదలైనప్పుడు అండాశయం నుంచి ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ అనే హార్మోన్లు కూడా విడుదలై గర్భాశయంలో పొరలు పెరగడానికి తిరిగి పిట్యూటరీ, హైపోథలామస్ నుంచి వచ్చే హార్మోన్ల స్థాయి నియంత్రించడానికి కూడా పనిచేస్తాయి. దీనే్న ‘హైపోథలామో పిట్యూటరీ ఒవేరియన్ యాక్సిస్’ అంటారు. ఇదంతా సక్రమంగా జరిగితేనే అండం విడుదలై, వీర్యకణంతో కలిసి గర్భం వస్తుంది. ఈ గొలుసుకట్టులో ఎక్కడైనా అంతరాయం ఏర్పడితే అండం విడుదల ఆగిపోతుంది. ఈ సూత్రంపై ఆధారపడి ఓసీ పిల్స్ పనిచేస్తాయి. ఈ పిల్స్‌లో ఉన్న ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్‌లు మెదడుపై పనిచేసి అండం ఎదుగుదలకి, విడుదలకు అవసరమైన హార్మోన్లు(ఎల్‌హెచ్, ఎఫ్‌ఎస్‌హెచ్) రాకుండా ఆపుతాయి. దీంతో అండం విడుదల ఆగిపోతుంది. అండం లేదు కాబట్టి గర్భం రాదు.. ఇదీ పిల్స్ పనిచేసేవిధానం. అంతేకాదు, గర్భాశయ ద్వారం దగ్గర చిక్కటి మ్యూకస్ పొరను తయారుచేసి వీర్యకణాన్ని నిరోధించి గర్భం రాకుండా చేస్తాయి. ఇంకా గర్భాశయం లోపలి గోడ పలుచగా మారడం వల్ల ఒకవేళ పిండం ఏర్పడ్డా గర్భాశయంలో సరిగ్గా అతుక్కోలేక బయటకు వచ్చేస్తుంది.
సరిగ్గా వాడితే పిల్స్ మిగతా విధానాలకంటే అత్యంత సమర్థమైనవి. 99 శాతం విశ్వసనీయమైనవి. వీటిని తేలికగా నోటిమాత్రల్లా తీసుకోవచ్చు. ఇవి ఏరకంగానూ కలయికకు అడ్డంరావు. పైగా మాత్రలు ఆపిన వెంటనే పునరుత్పత్తి శక్తి పునరుద్ధరణ జరుగుతుంది. మునుపు పిల్స్‌ను వాడటం వల్ల తలనొప్పి, వికారం, వాంతులు, చిరాకు, డిప్రెషన్, ఉద్వేగం, ఆందోళన, బరువు పెరగడం వంటివి ఉండేవి. ఇప్పుడు ఈ సైడ్ ఎఫెక్టులను దాదాపు తగ్గించగలిగారు.