సబ్ ఫీచర్

అంగన్‌వాడీల్లో అవస్థలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలకు కొన్ని నెలలుగా కొన్ని కేంద్రాలకు కందిపప్పు సరఫరా నిలిచిపోయి అనేక అవస్థలు పడుతున్నారు. గర్భిణి, బాలింతలతో పాటు అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకు సంపూర్ణ పౌష్టికాహారం కోసం రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అనేక పథకాల్ని అమలుపరిచి ఈ పథకాల కింద కందిపప్పు, ఆకుకూరలు, కోడిగుడ్డుతోపాటు ఇతర సామగ్రితో మధ్యాహ్న భోజనం అందించాల్సి వుంటుంది. కందిపప్పు సమయానికి అందక పోవడంతో, కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకకడంతో మధ్యాహ్న భోజనం నాణ్యత పూర్తిగా కొరవడింది. పప్పుకు బదులు అదనంగా కూరగాయలు వండినా అదనపు బిల్లులు చెల్లించబోమని చెప్పినందున ఉన్నవాటితోనే భోజనం పెడుతున్నారు.
కందిపప్పు నిలిచిపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేయడంలేదు. మార్కెట్‌లో కందిపప్పు ధర పెరగడంతో కుంటి సాకులు చెబుతూ ఇప్పటివరకు సరఫరా చేయకుండా ప్రభుత్వం జాప్యం చేస్తోంది. ఒప్పందం ప్రకారం అప్పగించిన ఏజన్సీలు నాణ్యతలేని పప్పులు సరఫరా చేయడం, అనుకున్న సమయానికి అందివ్వడంలేదని వాపోతున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు గతంలో సరఫరా చేసిన మాదిరిగానే కిలో ప్యాకెట్‌లోనే పప్పు సరఫరా చేయాలనే నిబంధన వుండగా మార్కెట్‌లో కందిపప్పు ధర పెరగడంతో కిలో పాకెట్ల ప్రకారం కందిపప్పు సరఫరా చేయలేమని 40 కిలోల సంచుల్లో సరఫరా చేస్తామని ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలు మెలికపెడుతున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేయాల్సిన సంస్థలు ఒప్పందం ప్రకారం కందిపప్పును సరఫరా చేయకుండా ఒప్పందాల్ని ఉల్లంఘించి మార్కెట్‌లో ధరలు ఎక్కువగా పెరిగాయని అందుకే సరఫరా చేయడం కష్టంగా మారిందని చేతులెత్తేస్తున్నారు.
ఇదిలావుండగా ఈ వ్యవహారం అంతా ఇలా నడుస్తుండగా పౌష్టికాహార లోపంతో ఎంతోమంది పిల్లలు, బాలింతలు ఈ కేంద్రాలకు వచ్చి ఇక్కడ లభించే ఆహారంతో కాస్తోకూస్తో ఆరోగ్యంగా వుండేవారు. ప్రస్తుతం పౌష్టికాహారం లభ్యం కాకపోవడంతో కేంద్రాలకు రోజురోజుకీ బాలింతలు పిల్లల సంఖ్య తగ్గిపోతోంది. అన్ని కేంద్రాలకు సరిపోయే విధంగా పక్కా ప్రణాళిక ప్రకారం సరైన సరుకులు అందేవిధంగా చూడాల్సిన అవసరం వుంది. ప్రతి ఏటా ఎంతోమంది పిల్లలు గర్భిణులు పౌష్టికాహార లోపంతో చనిపోతున్నారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం అందరికీ ఆమోదయోగ్యమైనా అప్పుడప్పుడు ఇలా జరిగేసరికి పిల్లలు, బాలింతలు అనేక అవస్థలు పడుతున్నారు. ఇకనైనా అంగన్‌వాడీ కేంద్రాలకు సరైన సమయానికి సరుకులు పంపించి పౌష్టికాహార లోపం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది.

-గుండు రమణయ్య