సబ్ ఫీచర్

భలే.. భలే.. తివాచీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహాభారతంలో మయసభ గుర్తుందా.. ఉండీ లేనట్లు, లేనిది ఉన్నట్లు చేసి దుర్యోధనుడి కోపానికి పాత్రురాలు అవుతుంది ద్రౌపది. అలాగే బేతాళ కథలు, పురాణ కథలు వినే ఉంటారు. వాటిల్లో రాజులు, రాజకుమారులతో పాటు మంత్రగాళ్లు, పేదరాశి పెద్దమ్మలూ సుపరిచితమే.. బెడ్‌రూమ్‌లో గుహలు, సుడిగుండాలు.., హాల్లో గొర్రెల మందలు, లోయలు.., దేవుని గదిలో దేవాలయం.. ఇవన్నీ తివాచీ మహిమలే.. ఇంట్లోని వారికి, ఇంటికి వచ్చేవారినీ ఆశ్చర్యంలో ముంచెత్తే సరికొత్త గృహాలంకరణ. ఈ ఆధునిక తివాచీలు మనుషుల్ని కూడా మాయ చేసేస్తున్నాయి. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు భ్రమ కల్పిస్తున్నాయి. అయితే ఇక్కడి చెప్పుకోవాల్సింది మాత్రం త్రీడీ కళ గురించి. త్రీడైమన్షన్‌లో చిత్రించిన బొమ్మల్ని ఈ తివాచీల మీద ముద్రిస్తున్నారు. గోడలకు అతికించే వాల్‌పేపర్లు అలంకరించే వస్తువులు, ఫ్లోరింగు, సీలింగులను దాటి ఇప్పుడు తివాచీని సైతం త్రీడీ కళతో కళకళలాడించేస్తున్నారు నేటి గృహాలంకరణ డిజైనర్లు. ఇప్పుడు కొత్తగా త్రీడీ కళనూ తివాచీల్లో చొప్పించేస్తున్నారు. లేనిది ఉన్నట్లుగా భ్రమింపచేయడమే త్రీడీ కళలోని గొప్పదనం. ఈ కళ ద్వారా గోతులు, లోయలు, అగాధాలు, ప్రకృతి అందాలు, జలపాతాలు, సముద్రాలు, జంతువులు, బొమ్మలు.. ఇలా ఎన్నో రకాల దృశ్యాలను సహజాతి సహజంగా చిత్రించేస్తున్నారు. అయితే త్రీడీ కళలో ఆప్టికల్ ఇల్యూజన్‌కు గురిచేసే రేఖాగణిత డిజైన్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే.. గీతలు, చతురస్రాలు, చదరాలు, ఘనాలు, వృత్తాలు.. ఇలా రేఖాగణిత ఆకారాలను విభిన్న డిజైన్లలో గీయడం వల్ల రంగుల్లో వ్యత్యాసం చూపించడం ద్వారా కంటిచూపును ఒకలాంటి భ్రమను గురిచేస్తారు కళాకారులు. కేవలం కొన్ని వంకర గీతల ద్వారానే ఎత్తుపల్లాలు సృష్టిస్తారు. ఆ డిజైన్లను ఇప్పుడు కార్పెట్ల తయారీలోనూ వాడేస్తూ మాయ చేసేస్తున్నారు. కళ్ల ముందు ఉన్నది నిజం కాదని తెలిసినా నిజమే సుమా అని నమ్మేంత అద్భుతమైన డిజైన్లతో ఈ త్రీడీ కార్పెట్లు రూపుదిద్దుకుంటున్నాయి. కేవలం త్రీడీ కళలో చిత్రించినవే కాదు, ఎంతో సహజంగా అనిపించే దృశ్యాలను సైతం.. అంటే బొరియలో నుంచి వస్తున్న జంతువునీ, సాగరగర్భంలోని మత్స్యకన్యని, అడవుల అందాల్నీ, గులకరాళ్ల సౌందర్యాన్ని.. అన్నింటినీ ఈ డిజిటల్ ఫొటో ప్రింటింగ్ ద్వారా ఇంట్లోకి తీసుకొచ్చేస్తున్నారు. వాటిపై మనల్ని నడిపిస్తూ మాయ చేసేస్తున్నారు.
ఒకప్పుడు తివాచీ అనేది విలాసవంతమైన గృహాల్లో, ప్రార్థనా స్థలాల్లో మాత్రమే కనిపించేది. కాలం మారింది. నేడు గృహాలంకరణలోనూ తివాచీ భాగంగా మారింది. చలిదేశాల్లో నేల చల్లదనం నుంచి పాదాలను కాపాడుకునేందుకు, గరుకు నేలలు గుచ్చుకోకుండా నేలపై నేరుగా కూర్చునేందుకు, అలంకరణలో భాగంగానూ.. ఇలా తివాచీలను ఒక్కోచోట ఒక్కోలా వాడుతున్నారు. ముఖ్యంగా ఇస్లాం సంస్కృతిలో తివాచీ తప్పనిసరి. ప్రార్థన చేసే చోట ఎవరి అడుగుల శబ్దాలు వినిపించకుండా ఉండేందుకు వీటిని పరుస్తుంటారు. అపార్ట్‌మెంట్ల సంస్కృతి పెరగడంతో పిల్లలు ఆడుకున్నా, గట్టిగా ఎగిరినా కింద ఫ్లోర్‌లో వినిపించకుండా ఉండేందుకు ఈ కార్పెట్ల వాడకం మరింత పెరిగింది. అదీగాక అద్భుతమైన ఎంబ్రాయిడరీలతో చేసిన ఖరీదైన తివాచీలతో పాటు కాటన్, పాలీప్రొపిలీన్, నైలాన్.. వంటి కృత్రిమ దారాలతో చేసిన రకరకాల కార్పెట్లు తక్కువ ధరలకే మార్కెట్లో దొరుకుతున్నాయి. అంతా మాయ.. త్రీడీ కళకళలాడినంతకాలం ఇలాంటి మాయలు, భ్రమలు ఎన్నో..

-సన్నిధి