సబ్ ఫీచర్

చికిత్సలేని నెలసరి వ్యాధి!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్ర్తిలలో కనీసం పదిశాతం మందికి ఉండే ఎండోమెట్రియాసిస్ గురించి ఇప్పటికీ పెద్దగా పరిశోధనలు జరగలేదు. డాక్టర్లకు కూడా దీని గురించి అవగాహన తక్కువే. ఇది వచ్చినప్పుడు చాలామంది పనిచేసుకోలేనంత నొప్పితో బాధపడుతూ ఉంటారు. అయినా నేటికీ దీనికి సరైన చికిత్స లేదు. ఈ వ్యాధి నెలసరితో సంబంధం ఉన్న ఒక రుగ్మత. గర్భకోశం లోపల మాత్రమే ఉండాల్సిన కణజాలంతో కూడిన పలుచని పొర ఇతర అవయవాలలో కూడా ఏర్పడడమే ఈ రుగ్మతకు కారణం. ఫెలోపియన్ ట్యూబ్స్, కటి భాగం, పెద్ద పేగులు, చిన్న పేగులు, యోని.. మొదలైన ప్రదేశాల్లో ఎక్కడైనా ఈ పొర ఏర్పడవచ్చు. అరుదుగా ఊపిరితిత్తుల్లో, కళ్ళల్లో, వెనె్నముకలో, మెదడులో కూడా ఏర్పడవచ్చు. ఇప్పటివరకూ ఇది కనబడని ఒకే ఒకచోటు ప్లీహం. ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు విపరీతమైన నొప్పి, అలసట, నెలసరి సమయంలో తీవ్ర రక్తస్రావం.
ఎండోమెట్రియాసిస్ నొప్పుల కారణంగా కేంద్ర నాడీ వ్యవస్థలో మార్పులు జరగవచ్చు. భవిష్యత్తులో నొప్పికి స్పందించడంలో తేడాలు రావచ్చు. శరీరంలో బలహీనమై సులభంగా ఇతర రకాల నొప్పులు కలిగించే స్థితిలోకి వెళ్లిపోవచ్చు. చాలామందికి ఈ వ్యాధి వచ్చినప్పుడు రోగచిహ్నాలు ఏమీ లేకుండానే విపరీతమైన నొప్పి మొదలవుతుంది. కొందరికి రోగ చిహ్నాలతో పాటు నొప్పి రావచ్చు. కానీ ఫలానా కారణం వల్ల నొప్పి వస్తుందని చెప్పడానికి ఉండదు. మొదట నొప్పి కటి భాగంలో మొదలవుతుంది. అసలే ఎవరికీ అర్థం కాకుండా ఉందనుకునే ఈ జబ్బు ఆడవాళ్ళకు సంబంధించింది కావడం, పైగా రుతుస్రావానికి సంబంధించి కావడం వల్ల మరింత గూఢమైన వ్యాధిగా మారిపోయింది.
మొదటగా..
ఎండోమెట్రియాసిస్ రోగ నిర్ధారణ జరిగాక కూడా రోగ లక్షణాలకు చికిత్స చేయడం అంత తేలికేమీ కాదు. అందులోనూ అవగాహనా లేమి చాలానే ఉంది. కొందరు వైద్యులు ఎండోమెట్రియాసిస్‌ను ఇప్పటికీ గర్భం దాల్చడమే దీనికి మంచి పరిష్కారమని సూచిస్తుంటారు. నిజానికి ఈ రుగ్మత పిల్లలు పుట్టకపోయే ప్రమాదం ఉన్నప్పుడు, గర్భం దాల్చడం పరిష్కారం కాదు. గర్భం దాల్చడం వల్ల ఎండోమెట్రియాసిస్ బాధలు కొన్ని తగ్గవచ్చేమో కానీ అది ఆ తొమ్మిది నెలల కాలం వరకే.. తర్వాత మామూలే.. ఎండోమెట్రియాసిస్ వ్యాధి కారకాలైన గాయాలు గర్భసంచిలో కాదు గర్భసంచి బయట కూడా ఉంటాయి. కాబట్టి గర్భసంచి తీసేయడం దీనికి పరిష్కారం కానే కాదు. పైగా మళ్ళీ వచ్చే అవకాశం కూడా ఉంది. ఎండోమెట్రియాసిస్‌కు కారణమైన గాయాల పెరుగుదలను నియంత్రించేంది ఈస్ట్రోజన్ కాబట్టి డాక్టర్లు మొదట ఇచ్చేది హార్మోన్ చికిత్సే. దీనివల్ల నొప్పి తగ్గుతుంది కానీ అది శాశ్వత పరిష్కారం మాత్రం కాదు. పైగా దాని దుష్ఫలితాలు దానికీ ఉంటాయి. 2016లో డెన్మార్క్‌లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం గర్భనిరోధక హార్మోన్లు తీసుకునే స్ర్తిలు ఆ తర్వాత మానసిక కుంగుబాటుకు చికిత్స తీసుకోవాల్సిన అగత్యం ఏర్పడుతోందట. ఎండోమెట్రియాసిస్‌కి ఇచ్చే మందుల్లో గర్భనిరోధక మాత్రలే ప్రధానంగా ఉంటాయి. డాక్టర్లు చెప్పిన మరో పరిష్కారం ఏంటంటే.. మెడికల్ మెనోపాజ్. దీనిద్వారా నెలసర్లు ఆగిపోయేలా చేస్తారు. కానీ అది ఎండోమెట్రియాసిస్‌ను శాశ్వతంగా నయం చేయదు. పైగా ఈ మెడికల్ మెనోపాజ్ వల్ల వచ్చే ఇబ్బందులు ఎన్నో.. ఈ చికిత్స వల్ల ఎముకల సాంద్రత దెబ్బతింటుంది. ముఖ్యంగా యువతుల్లో దీని దుష్ఫలితాల్లో ఒకటి ప్రమాదవశాత్తు పూర్తి మెనోపాజ్ సంభవించే అవకాశం. ఇది చాలా అరుదుగా జరుగుతుంది.
ఎండోమెట్రియాసిస్ ఒక్కటే కాదు మరెన్నో అనారోగ్యాలపై జరగాల్సిన పరిశోధన జరగని మాట నిజమే అయినా, ఆ అనారోగ్యాలు వేటికీ చాలినన్ని నిధుల కేటాయింపు జరగడం లేదనే మాట కూడా నిజమే అయినా వాటిలో చాలా వాటికంటే ఇది చాలా విస్తృతమైన వ్యాధి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 17.6 కోట్లమంది స్ర్తిలు ఈ వ్యాధితో బాధపడుతున్నారని అంచనా. ఒక్క అమెరికా సంయుక్త రాష్ట్రాలలోనే పునరుత్పత్తి వయస్సులో ఉన్న ప్రతి పదిమంది స్ర్తిలలో ఒకరికి ఈ రుగ్మత ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అయినా దీని పరిశోధనకు ఏటా ఆరు మిలియన్ల డాలర్లు మాత్రమే కేటాయిస్తున్నారు. నిద్రపై పరిశోధనలకు అంతకంటే యాభై రెట్లు ఎక్కువ నిధులు ఇస్తున్నారంటే వాళ్ల ప్రాధాన్యంలో మహిళా సమస్య ఎక్కడ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎండోమెట్రియాసిస్ వల్ల వచ్చే కష్టం నొప్పి ఒక్కటే కాదు. పది దేశాల్లో జరిపిన పరిశోధనల ప్రకారం ఎండోమెట్రియాసిస్ వల్ల దానితో బాధపడే ప్రతి రోగి ఏడాదికి సగటున 8, 600 పౌండ్లు ఆరోగ్యంపై ఖర్చు పెట్టాల్సి వస్తోంది. అంటే రోజుకు 23. 45 అంటే ఒక్కొక్కరు కొన్ని రకాల మందులు వాడాల్సి వస్తోంది. అంతేకాదు దీనివల్ల పిల్లలు పుట్టకుండా పోయే ప్రమాదం ఉంది. ఇతర రకాల సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. వ్యాధికి కాకుండా వ్యాధి లక్షణాలకు మాత్రమే చికిత్స ఇస్తారు కాబట్టి నొప్పి నివారణ మాత్రలు వేసుకోవడం ప్రస్తుతం దీనికి మరొక పరిష్కారంగా ఉంది. ఏది ఏమైనా ఎండోమెట్రియాసిస్ నొప్పితో బాధపడే స్ర్తిలకు చాలా సమస్యలు.