సబ్ ఫీచర్

చారిత్రక ఆధారాలతో ‘తెలుగుప్రశస్తి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘తెలుగు భాష వెలుగు చరిత తెలియగరారే..’ అంటూ ‘ఆంధ్రుల ఖ్యాతిని ఆదిగ పలికెను ముదముగ నాట్యశాస్తమ్రున భరతుడు..’ అంటూ వివిధ భాషావేత్తలు తెలుగును కొనియాడిన విధానాన్ని నృత్యంలో అభినయిస్తారు. ప్రముఖ నాట్యాచారిణి కోకా విజయలక్ష్మి రూపొందించిన అపూర్వ నృత్య నాటకం ‘తెలుగు ప్రశస్తి’. తెలుగు భాషా లిపి వివరిస్తూ కాలానుగుణంగా లభించిన శాసనాలు, నాణేలు ఆధారంగా నృత్య నాటికకు రూపకల్పన చేశామని కోకా విజయలక్ష్మి పేర్కొన్నారు. క్రీ.పూ. 3వ శతాబ్దంలోని కాలమాన పరిస్థితులు క్రీ.పూ.8వ శతాబ్దం వరకు జరిగిన పరిపాలన, ప్రజల జీవన విధానాలు ఈ నృత్య నాటికలో చోటుచేసుకున్నాయి. ఆ కాలంలో జానపద సాహిత్యానికి వున్న ప్రాధాన్యతను ‘జనపదమే జానపదమై..’ అంటూ సాగే గీతంలో చిన్న పిల్లల పాటలతో నృత్యంగా ప్రదర్శిస్తామని ఆమె పేర్కొన్నారు. ఈ నృత్య నాటకంలో తిక్కన, నన్నయ్య కవిత్వాన్ని గుర్తుచేస్తూ కాలానుగుణంగా జరిగిన మార్పులను పొందుపరిచారు. చోళరాజుల తరువాత తెలుగు నేలను పరిపాలించిన వారిలో ముఖ్యమైన రాజులు కాకతీయులు. కాకతీయుల పరిపాలనా విధానాన్ని, ఆ నాటి శిల్ప కళా వైభవాన్ని సాహిత్యపరంగా మరల్చి తెలుగు నాట్య కళావైభవాన్ని ప్రదర్శిస్తూ కాకతీయుల కళా వైశిష్ట్యాన్ని సాహిత్యంలో కూర్చి గతంగా ఆలపిస్తుంటే కళాకారులు నృత్యం చేస్తారు. ఆ తరువాత తెలుగు సాహిత్యానికి బ్రహ్మరథం పట్టిన శ్రీకృష్ణదేవరాయలను గుర్తుచేస్తూ రాయల కాలాన్ని స్వర్ణయుగంగా ప్రశంసించడానికి కారణమైన ముఖ్యమైన సన్నివేశాలను వేదికపై ప్రదర్శిస్తారు. తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేసిన కవులను గుర్తుచేస్తూ తెలుగు సాహిత్య వైభవాన్ని నాటకీయంగా నృత్యంలో ప్రదర్శిస్తారు. కాలానుగుణంగా తెలుగు భాషను కాపాడుకోవడానికి అనేక మార్పులు జరిగాయి. మూడు వేల సంవత్సరాల తెలుగు భాషా చరిత్రను ఆధారాలతో రూపకల్పన చేస్తూ సందర్భానుసారంగా అవసరమైన సెట్టింగ్‌లతో నాటకాన్ని ప్రదర్శిస్తారు. ‘తెలుగు ప్రశస్తి’ నృత్య నాటకానికి కోకా విజయలక్ష్మి నృత్య దర్శకత్వం వహించారు. ఈ నృత్య నాటకం నూతన శకానికి నాంది. ప్రముఖ పాత్రికేయుడు ఎ.బి.కె. ప్రసాద్ కథాగమనంతో సాహిత్యపరమైన సలహాలతో నృత్య నాటకాన్ని రూపొందించానని ఆమె పేర్కొన్నారు. ప్రాచీన భాష హోదా అంటే ఏమిటో తెలుపుతూ తెలుగు భాషకు ఆ హోదా ఏ ఆధారాలతో వచ్చిందో కూడా ఈ నృత్య నాటకంలో ప్రదర్శిస్తున్నానని చెప్పారు. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంలో రవీంద్రభారతిలోను, ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లోను ప్రదర్శించి ఉగాది పురస్కారంతోపాటు నంది అవార్డును కూడా కైవసం చేసుకుంది. ‘ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి తెలుగు భారతిని’ అనే నినాదంతో తెలుగు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచం నలుమూలలా చాటాలని మలేసి తెలుగు సంఘం నిర్వహించిన 150 సం.ల మలేసియా తెలుగుదనం కార్యక్రమాన్ని మలేసియా, కౌలాలంపూర్ ఏర్పాటుచేసినపుడు తన ప్రతిభను ప్రదర్శించానని, సింగపూర్‌లలో తెలుగు సమాజం నిర్వహించిన ‘విజయభేరి’ కార్యక్రమంలో నృత్యం చేసానని కోకావిజయలక్ష్మి తెలిపారు. కానె్వంట్ చదువులతో తెలుగు భాషను మర్చిపోతున్నారని, ఇంట్లో కూడా తల్లిదండ్రులు తమ పిల్లలతో ఇంగ్లీషు మాట్లాడుతూ తెలుగు భాష మర్చిపోయేలా ప్రవర్తిస్తున్నారని అటువంటివారందరికీ తెలుగు సంస్కృతి సంప్రదాయాలను తెలిపే విధంగా, సామాన్యుడికి ప్రాచీన కాలంలోని శాసనాల విషయాలు తెలియచెయ్యాలనే సంకల్పంతో లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ తెలుగు ప్రశస్తి నృత్య నాటకం ద్వారా పాల్కురికి సోమనాథుడు, విశ్వనాథ సత్యనారాయణ తదితర కవుల సాహిత్యాన్ని, వారి గొప్పతనాన్ని ప్రచారం చెయ్యడంలో తానూ ఒక సమిధిను అవుతున్నానని కోకా విజయలక్ష్మి పేర్కొన్నారు.

- బ్రహ్మశ్రీ కురువాడ మురళీధర్ శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరీ శంకరమఠం