సబ్ ఫీచర్

స్వతంత్ర ఆలోచనలను పెంచే హోంవర్క్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకనాడు నేను తరగతి గదినుంచి వచ్చేవరకే ఒక ఆవిడ వచ్చి మా పిల్లవానికి ఒక హోంవర్క్ ఇచ్చారు. మాక్సిమా, మినిమాతోపాటు ఆల్‌జీబ్రా ఉంది. సంఖ్యాశాస్త్రం ఉన్నది. ఈ మూడింటిని కలిపి హోంవర్క్ ఇస్తే ఎంతో కష్టం కదా అని ప్రశ్నించింది. ఐఐటి లోపల ఒక ప్రశ్న ఒకే చాప్టర్‌కు సంబంధించింది ఉండదు. సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ అలవాటు చేయటంకోసమే ఆ ప్రశ్న ఇచ్చాను అన్నాను. ఆవిడ వెళ్లిపోయింది. నాకు సంతోషమైంది.
విద్యార్థే కాదు ఒక తల్లి గణితంలో వున్న వివిధ అంశాలను ప్రస్తావిస్తున్నదంటే తరగతి గదిని మనం కుటుంబంలోకి చర్చకు పెట్టినట్లు కదా! హోంవర్క్ అనేది ఒక వంతెన. పిల్లల శ్రేయస్సుకోరే రెండు వ్యవస్థలను కలుపుతుంది. ఒకటి తరగతి గది రెండవది కుటుంబం. విద్యార్థికి మనం ఇచ్చిన హోంవర్క్ సామూహిక ప్రక్రియ కాదు. తరగతి గది సామూహిక ప్రక్రియ. హోంవర్క్ అనేది వ్యక్తిగతమైన ప్రక్రియ. విద్యార్థి ఇంట్లో కూర్చొని ఎవరి సహాయంలేకుండా ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటున్నాడంటే స్వతంత్రంగా తనకుతాను ఎంతో నేర్చుకుంటున్నాడు. నేర్చుకోవటం (లెర్నింగ్) వ్యక్తిగత విషయం. తరగతి గది సామూహిక అంశం. ప్రతిభను పరీక్షించటం వ్యక్తికి సంబంధించింది. హోంవర్క్ అనేది ఒక సామూహిక ప్రక్రియను వ్యక్తిగత ప్రతిభకు సున్నిత్వాన్ని కలిగించే దానికి ఉపయోగపడుతుంది. అది విద్యార్థి వయసుబట్టే ఆధారపడి ఉంటుంది. అదే మిడిల్ స్కూల్ విద్యార్థి అయితే ప్రాక్టీస్‌కోసం ఇస్తాం. అదే 9, 10 తరగతుల విద్యార్థి అయితే తరగతి గదిలో జరిగిన చదువును పునర్విమర్శించుకునేందుకు (రివైజ్) అవకాశం ఇస్తాం. అదే 11, 12వ తరగతి విద్యార్థి అయితే సవాళ్లను ఎదుర్కొనటానికై అవకాశం కల్పిస్తాం.
హోంవర్కు యొక్క లక్ష్యం వయసును బట్టి ఆధారపడి ఉంటుంది. విద్యను రకరకాలుగా ఉపాధ్యాయుడు బోధిస్తాడు. ఒక వయసులోపల చూసి నేర్చుకుంటాడు. మరొక వయసులో మనసులో మననం చేసి నేర్చుకుంటాడు. మరొక వయస్సయితే స్వతహాగా ఆలోచించి నేర్చుకుంటాడు. దానే్న సాధన అంటాం. విద్యను అభ్యసింపచేయటం ఉపాధ్యాయుడు నిర్ణయించుకున్న లక్ష్యాన్నిబట్టి ఉంటుంది. ఉపాధ్యాయుడు హోంవర్క్ ఇస్తున్నప్పుడే తన లక్ష్యాన్ని నిర్ణయించుకుంటాడు. ఎవరికిస్తున్నాను? ఎందుకిస్తున్నాను? నిర్ణయించుకుంటాడు. అది తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. ఒక స్థాయిలో జ్ఞాననేత్రాన్ని తెరిపించాలి. అది కాల్పనిక శక్తిని పురికొల్పుతుంది. విద్యార్థిని తరగతి గదిలో చదువుకున్న అంశాలలో ముంచుతారు. హోంవర్క్ అనేది బోధనను ఒక స్థలంనుంచి మరొక స్థలానికి బదలాయించటం కాదు. ఉపాధ్యాయుడు రకరకాల టెక్నిక్స్‌ను ఉపయోగిస్తాడు. ఏ టెక్నిక్ ఏ లక్ష్యంకోసం ఉన్నదో అది తెల్సిఉండాలి. విద్యా విషయాలపై నిర్ణయాలు జరుగుతున్నప్పుడు పాలకులు ఉపాధ్యాయులను సంప్రదించాలి. తరగతి గది సున్నితమైన క్షేత్రం. అందుకే ఉపాధ్యాయునికి విద్యాపరమైన స్వేచ్ఛ ఇవ్వబడింది. తరగతి గదిలో ఉపాధ్యాయుని స్వేచ్ఛను గౌరవిస్తే ప్రమాణాలు పెరుగుతాయి.
దురదృష్టవశాత్తు నేడు ఉపాధ్యాయుడు ర్యాంకుల చట్రంలో ఇరుక్కుపోయాడు. దీని ఫలితం విద్యార్థిపైన కూడ పూర్తిస్థాయలో పడు తోంది. విద్యార్థి అభ్యసనను పక్కన బెట్టి మార్కుల కోసం వెంపర్లాడే పరిస్థితిని నేటి విద్యావిధానం కల్పించింది. ఫలితంగా విషయావగాహన ఉన్నా లేకపోయనా, మార్కులు ఎలా సంపాదించాలనే అంశంపైనే దృష్టి కేంద్రీకరించడం జరుగుతోంది. దీని ఫలితం విద్యార్థి భవిష్యత్తుపై పడుతోంది. మార్కెట్‌లో పోటీపడలేక, వచ్చిన మార్కుల వల్ల ప్రయోజ నం లేక విద్య నిరర్ధకమవుతోంది. ఈ పరిస్థితి మారాలి.

- చుక్కా రామయ్య