సబ్ ఫీచర్

పెరుగుతున్న పప్పుధాన్యాల కొరత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అధిక శాతం దేశ ప్రజల్ని పోషకాహార లేమి బాధిస్తోంది. ప్రతిరోజు తగినన్ని ప్రోటీన్లు, ఇతర సూక్ష్మ పోషకాలు శరీరానికి అందకపోవడమే ముఖ్యకారణమని చెప్పవచ్చు. తెలుగునాట కందిపప్పు, బెంగాల్‌లో మినపప్పు, గుజరాత్‌లో శనగపప్పు విరివిగా వాడతారు. పప్పులు చౌకగా ప్రోటీన్‌ని అందించే దినుసులు. కానీ వాటి ధరలు సామాన్యునికి అందనంత పైకి ఎగిసిపోయాయి. గత రెండు సంవత్సరాల్లో మరీ విపరీతమయ్యాయి. 1960లోనే హరిత విప్లవ బీజాలుపడ్డాయి. ఆహార పంటల స్వయం సమృద్ధి సాధనే దీని ప్రధానలక్ష్యం. కానీ వరి, గోధుమల చుట్టూనే ఈ విప్లవం తిరిగింది. వాటి అధిక దిగుబడికి సంబంధిత సాంకేతిక అభివృద్ధికి, విధాన అమలుకు పరిమితమైంది. వరి, గోధుమలకు కనీస మద్దతు ధర చెల్లించి రైతులనుండి కొనుగోలు చేయడంవలన ఈ పంటల దిగుబడులు గణనీయంగా పెరిగాయి. సగటు ఆహార ధాన్యాల లభ్యత పెరిగింది. 70లలో 145 కేజీల సగటు లభ్యత వుండేది. ఇప్పుడది 150 కేజీలైంది. దేశప్రజల ఆహారంలో వరి, గోధుమలకు సరిసమానమైన ప్రాధాన్యత కలవి పప్పులు. కానీ వీటి ఉత్పత్తి జనాభా పెరుగుదలకు అనుగుణంగా పెరగలేదు. వీటి సగటు ఉత్పాదకత క్రమంగా తగ్గిపోవడం ఆందోళనకరం. అరవైలలో పప్పుల సగటు లభ్యత 18.5 కేజీలు ప్రస్తుతం 15 కెజీలకు పడిపోయాయి. పప్పు దినుసులను దిగుమతి చేసుకుంటున్నప్పటికీ ఇవి ప్రజల అవసరాలకు చాలడంలేదు. ఈ లోటు ప్రజలను పోషకాహార లేమికి గురి చేస్తున్నది. తప్పనిసరిగా రోజూ అందాల్సిన కనీస పోషకాహారం చాలామందికి దొరకని పరిస్థితి ఏర్పడింది. గతంలో గ్రామాల్లో రోజుకు 2153 కేలరీలు తీసుకొనగా ఇప్పుడది 2099 కేలరీలకు దిగజారింది. పట్టణాల్లోను ఇదే పరిస్థితి. కాలంతోపాటు ప్రజల ఆహార అలవాట్లలో మార్పులు వచ్చాయి. కాయగూరలు, పళ్లు, కోడిగుడ్లు, మాంసం, పాలు, నూనె, పంచదారల వాడకం పెరిగింది. దేశంలో ఎన్నో రకాల ఆహారపు అలవాట్లు వున్నాయి. మాంసాహారులు తక్కువ కానప్పటికీ ప్రతిరోజు అది తప్పనిసరి కాదు. వారంలో ఎక్కువ రోజులు కూరగాయలు, పప్పులతో కూడిన వరి, గోధుమలనే తింటారు. పప్పుల వినియోగం ఎక్కువే. ఆకు కూరలతోను, కూరగాయలతోను విడిగాను,స్వీట్స్ హాట్స్ రూపంలో పప్పులు వాడతారు. పప్పులు ప్రోటీన్లు అందిస్తాయి. శరీర నిర్మాణానికి, కష్టపడి పని చేయడానికి ప్రోటీన్లు వుండాల్సిందే. పప్పు ద్వారా కనీసం 20 శాతం ప్రోటీను లభిస్తుంది. పప్పులో 60 శాతం పిండి పదార్ధం వుంటుంది. ఇనుము, కాల్షియం, ఫాస్పరస్ ఖనిజ లవణాలు తగుమోతాదులో అందుతాయి. గడిచిన కొన్ని దశాబ్దాల్లో పప్పుల వినియోగాన్ని పరిశీలిస్తే వాటి వినియోగం ఏమాత్రం తగ్గలేదు. పప్పులను సరసమైన ధరలకు అందించగలిగితే వాటి వినియోగం ఇంకా పెరిగే వీలుంది. రోజూ ఒకరికి 60 గ్రాముల పప్పుని అందుబాటులోకి తేగలిగితే 100 కేలరీలు అంది పోషకాహార నిపుణులు సిఫార్సుచేసిన 2200 కేలరీలు లభించి జాతి బలపడుతుంది. నిజమైన సమస్య వీటిని అందరికీ అందుబాటులోకి తేవడమే. ప్రస్తుత దేశ అవసరాల్లోని 20 శాతం పప్పులను పలు దేశాలనుండి దిగుమతి చేసుకుంటున్నాం. అభివృద్ధి చెందిన దేశాలన్నింటా పప్పు వినియోగం రోజురోజుకు పెరుగుతుండడంతో అంతర్జాతీయ విపణిలో ఇవి దొరకడలేదు. భారత్ 2 కోట్ల టన్నుల పప్పు ధాన్యాలను పండిస్తోంది. అంతకన్నా ఎక్కువగా స్థానిక వినియోగం వుంది.
కంది, పెసర, మినుము, ఉలవలు తదితర పప్పు జాతి పంటలకు ఉత్పాదక ప్రోత్సాహకాలను రైతులకు అందిస్తే అనేక లాభాలు చేకూరతాయి. వ్యవసాయ భూమిలో 30 శాతం వరకు సారహీనంగా మారాయని వ్యవసాయ శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. పెసర, మినుము గడ్డి జాతి రకాలు. ఈ జాతికి చెందిన పప్పు ధాన్యాలను పండించితే నేలకు సహజంగా నైట్రోజన్ అంది భూసారం పెరుగుతుంది. వ్యవసాయంలో నీటి ఆదా కూడా జరుగుతుంది. ప్రజలకు తక్కువ ఖరీదైన, ఇష్టమైన పోషకాహారం దొరుకుతుంది. పంట మార్పిడి విధానం, అధిక దిగుబడిని ఇచ్చే వంగడాల అభివృద్ధి, సాంకేతిక అభివృద్ధి, శిక్షణ, గిట్టుబాటైన మద్దతు ధర రైతులకు అందిస్తే పప్పు ధాన్యాల రంగంలో స్వయం సమృద్ధత సాధ్యం.

-వి.వరదరాజు