సబ్ ఫీచర్

విద్యారంగానికి అరకొర నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయడం దారుణం. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు, వసతి సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం తగినంతగా నిధులు కేటాయిస్తుందని ఎదురుచూసిన విద్యార్థులకు నిరాశే మిగిలింది. కాగా, 1954లో బిజీ ఖేర్ కమిటీ విద్యారంగం అభివృద్ధికి ప్రభుత్వాలు బడ్జెట్‌లో కనీసం పది శాతం నిధులను కేటాయించాలని సూచించింది. ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా వ్యవసాయం, పారిశ్రామిక రంగాలతోపాటు విద్యారంగం కూడా ఎంతో కీలకం. నాణ్యమైన విద్యను అందించినపుడే సమాజం అన్ని విధాలా పురోగతి సాధిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా ఈ ప్రాంతంలో విద్యారంగంపై పాలకులు శీతకన్ను వేస్తున్నారనడానికి గత అయిదేళ్లలో జరిగిన బడ్జెట్ కేటాయింపులే నిదర్శనం.
2014-15 బడ్జెట్‌లో విద్యారంగానికి 10.88 శాతం నిధులు కేటాయిస్తే 2019-20లో అది 6.71 శాతానికి దిగజారడం గమనార్హం. గత బడ్జెట్‌లో రూ. 13,253 కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది రూ. 12,220 కోట్లను కేటాయించారు. రానురానూ కేటాయింపుల్లో కోత విధించడం విద్యారంగ నిపుణులను ఆందోళనకు గురిచేస్తోంది. తాజా బడ్జెట్‌లో 119 వెనుకబడిన తరగతుల గురుకుల పాఠశాలల అభివృద్ధికి తీసుకోబోయే చర్యల గురించి పేర్కొన్నారే తప్ప- మండల పరిషత్, జిల్లా పరిషత్ పాఠశాలల అభివృద్ధికి చొరవ చూపడం లేదు. అనేక గ్రామాల్లో శిథిలావస్థలో ఉన్న తరగతి గదుల్లోనే చదువులు కొనసాగుతున్నాయి. నిధులు లేవన్న సాకుతో బడి భవనాలకు మరమ్మతులు చేపట్టడం లేదు. కొన్ని చోట్ల మధ్యాహ్న భోజన పథకాన్ని నిలిపివేశారు. హేతుబద్ధీకరణ పేరుతో కొన్ని పాఠశాలలను తొలగిస్తున్నారు. తరగతి గదులు లేక చాలా చోట్ల ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు షిఫ్ట్ పద్ధతిలో తరగతులను నిర్వహిస్తున్నారు. కళాశాల విద్యార్థులందరికీ మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామన్న ప్రభుత్వం హామీ నెరవేరలేదు. ప్రభుత్వ కళాశాలల్లో తగిన వసతులు లేనందున విద్యార్థులు ప్రైవేట్ విద్యాసంస్థలను ఆశ్రయించే పరిస్థితి ఉంది. యూనివర్సిటీలకు కేటాయించే నిధులు అధ్యాపకుల, సిబ్బంది జీతాలకే సరిపడని పరిస్థితి నెలకొన్నది. విద్యార్థులు పది నుంచి పదిహేను వేల రూపాయల వరకూ హాస్టళ్లలో భోజన వసతి కోసం డిపాజిట్ చేసి చదువుకొంటున్నారు. నిధులు లేక వర్సిటీల్లో కొత్త హాస్టల్ భవనాల నిర్మాణం జాడే లేదు. శిథిలమైన భవనాల్లోనే విద్యార్థులు ఉంటున్నారు. యూనివర్సిటీలు గత ఐదేళ్లలో అభివృద్ధి చెందకపోవడానికి తగినంతగా నిధులు కేటాయించక పోవడమే కారణం. ఉపకార వేతనాలు సరైన సమయానికి అందడం లేదు. దాదాపు ఇరవైమూడు వందల కోట్ల రూపాయలను ఫీజు రియింబర్స్‌మెంట్ కింద ప్రభుత్వం బకాయి పడింది. దీంతో అనేక ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు సర్ట్ఫికెట్లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. ఆ మొత్తాన్ని విద్యార్థులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొంతమంది విద్యార్థులు తమ చదువులను మధ్యలోనే ఆపివేస్తున్నారు.
తెలంగాణలో విద్యారంగం తీరు చూస్తుంటే దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత తక్కువ మొత్తాన్ని కేటాయించలేదని తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తామని తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. అందుకు భిన్నంగా ఫీజుల మోత కొనసాగుతోంది. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు ఎక్కువగా వసూలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్లక్ష్యం చేస్తూ, హడావుడిగా ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును తీసుకొచ్చారు. రానురానూ ప్రభుత్వం ఆర్థిక భారాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. విద్యారంగం పూర్తిగా అభివృద్ధి చెందాలంటే బడ్జెట్‌లో రూ. 30 వేల కోట్ల దాకా నిధులను కేటాయించాల్సి ఉంది. ప్రణాళికేతర పద్దుల నుండి నిధులను కేటాయించి విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలి. చాలీచాలని నిధులతో విద్యారంగం అభివృద్ధిచెందుతుందని ఆశిస్తే అది ఆశాభంగమే అవుతుంది.

-చింత ఎల్లస్వామి