సబ్ ఫీచర్

ఇది ప్లాస్టిక్ యుగం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనం ‘శిలాజ ఇంధనం’ అనే పేరు వింటూ ఉంటాం. ‘్ఫసిల్ ఫ్యూ యెల్’ అని వ్యవహరించే ఈ ఇంధనం భూమి లోపల కొన్ని వందల లేదా వేల అడుగుల కింద ఉన్న శిలాజాల నుండి లభిస్తుంది. భూగోళంపై పెరిగిపోతున్న ప్లాస్టిక్ కాలుష్యాన్ని గురించి హెచ్చరిక చేస్తూ పర్యావరణ శాస్తవ్రేత్తలు ఈ ప్లాస్టిక్ కాలుష్యం శిలాజ స్థాయికి చేరుకుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 1945నుంచి భూగోళంపై ఇప్పటిదాకా ప్లాస్టిక్ వ్యర్థాలు భూగర్భంలో ఆ స్థాయి వరకు చేరుకున్నాయన్నమాట.
భూగర్భాన్ని అధ్యయనం చేసే శాస్తవ్రేత్తలు భూమి లోపలి భాగాన్ని పొరలుగా విశే్లషిస్తారు. మానవ జీవన పరిణామక్రమాన్ని అధ్యయనం చేసే శాస్తవ్రేత్తలు నాగరికత పరిణామాన్ని రాతియుగమనీ, లోహయుగమనీ యుగాలుగా విభజిస్తారు. ఈ శాస్తవ్రేత్తలు ప్రస్తుతం ‘ప్లాస్టిక్ యుగం’ నడుస్తున్నదని, భూగర్భాన్ని ప్లాస్టిక్ పొరలుగా విశే్లషించాల్సిన పరిస్థితి వచ్చిందని అంటున్నారు. భూమి లోపల అట్టడుగు స్థాయి వరకూ పొరలు పొరలుగా ప్లాస్టిక్ వ్యర్థాలు ఏ విధంగా పేరుకుపోయాయో అర్థం చేసుకోవచ్చు. యూనివర్సిటీ ఆఫ్ కేలిఫోర్నియా (సాన్‌డిగో)లోని ‘స్కిప్సు ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ’కి చెందిన జెన్నీఫర్ బ్రాండన్ సారథ్యంలో కేలిఫోర్నియా సముద్రం అట్టడుగున ఉన్న మడ్డిని సేకరించి 1834నుండి చోటుచేసుకుంటున్న మార్పులను తెలుసుకునేందుకు పరీక్షలు జరిపారు. ఈ పరీక్షలలో తేలిందేమిటంటే గత 70 ఏళ్ళుగా సముద్రాలలో అత్యధికంగా ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుంటున్నాయట. ప్రపంచవ్యాప్తంగా 1960 నుండి 2010 వరకు ఎంత ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతోందో, ఎన్ని ప్లాస్టిక్ వ్యర్థకణాలు సముద్ర గర్భంలో పేరుకుంటున్నాయో- ప్రతి పదేళ్లకు సేకరించిన వివరాలు ఇలా ఉన్నాయి.
సంవత్సరం ప్లాస్టిక్ ఉత్పత్తి ప్లాస్టిక్ వ్యర్థకణాలు
(లక్షల టన్నులలో) (10 చదరపు సెం.మీ.లకి లక్షలలో)
1960 3 40
1970 4 70
1980 7 90
1990 9 140
2000 21 270
2010 26 340
సముద్రంలో పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలలో ఎక్కువ భాగం ప్లాస్టిక్ ఫైబర్ వ్యర్థాలే. సింథటిక్ వస్త్రాలను ఉతికినప్పుడు వెలువడే ఈ ఫైబర్ వ్యర్థాలు మురికి నీటి ద్వారా సముద్రంలో కలుస్తాయి. ‘ప్లాస్టిక్ వాడకం పట్ల మనలో పిచ్చి ఎంతగా ముదిరిందంటే ప్లాస్టిక్ వ్యర్థాలు ఇప్పుడు భూమి అట్టడుగు పొరలకు వ్యాపించాయి. సముద్రంలో ఈ వ్యర్థాలు అక్కడ సంచరించే జీవాల అస్తిత్వానికి ముప్పుతెస్తున్నాయి’- అని జెన్నీఫర్ బ్రాండన్ అంటారు.
‘మనం పాఠశాలల్లో చదువుకునేటప్పుడు రాతియుగం గురించి, లోహ యుగం గురించీ విన్నాం. కానీ ఇప్పుడు ప్లాస్టిక్ యుగం నడుస్తోంది. భవిష్యత్తులో చరిత్రకారులు మనల్ని ప్లాస్టిక్ యుగానికి చెందినవారిగా పేర్కొంటారు’అని జెన్నీఫర్ ఆందోళన వ్యక్తం చేసారు. ‘బ్లూప్లానెట్’ టీవీ సిరీస్‌ల ద్వారా ప్రసిద్ధిపొందిన సర్ డేవిడ్ అటెంబరో- ‘మితిమీరిన ప్లాస్టిక్ కాలుష్యం భవిష్యత్తులో ప్రపంచ మానవాళిని నిస్సహాయ స్థితిలోకి నెట్టివేస్తుంది. ఇప్పుడు కనుక ‘క్లైమేట్ ఎమర్జెన్సీ’ని ప్రకటించి సత్వర చర్యలు చేపట్టకపోతే మనమంతా బానిసత్వం కన్నా దయనీయమైన స్థితిలోకి వెళ్ళిపోతాం’ అని ఆయన చెబుతున్నారు. ‘సముద్రపు అట్టడుగున మడ్డిలో పేరుకొంటున్న మైక్రోప్లాస్టిక్ వ్యర్థాల సంఖ్య ప్రతి పదిహేనేళ్లకు రెట్టింపు అవుతోంది. వీటిలో మూడింట రెండువంతులు మైక్రో ప్లాస్టిక్ ఫైబర్ పదార్థాలే. మిగిలిన వ్యర్థాలలో రకరకాల ప్లాస్టిక్ ముక్కలు, ప్లాస్టిక్ ఫిల్ములు ఉంటున్నాయి అని ‘సైన్స్ అడ్వానె్సస్’ పత్రికలో జెన్నీఫర్ బ్రండన్ పేర్కొన్నారు. ‘సింథటిక్ వస్త్రాలను ఒకసారి ఉతికితే ఏడు లక్షల మైక్రోప్లాస్టిక్ ఫైబర్ వ్యర్థాలు వెలువడతాయి. వీటి గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండానే మురికినీటితోపాటు సముద్రంలోకి వదిలేస్తున్నారు. వ్యర్థజలాలను ఎలాంటి వడపోతలేకుండా వదిలేయడంవల్ల సాగర జలాల పర్యావరణం పెద్దఎత్తున దెబ్బతింటోంది’బ్రాండన్ అంటారు. ఏటా డంప్ చేస్తున్న లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రం అట్టడుగున మొదలుకుని పర్వత శిఖరాల వరకు ఎక్కడబడితే అక్కడ కుప్పలుగా పేరుకుపోతున్నాయి. ఈ వ్యర్థాల నుండి వెలువడిన మైక్రోఫైబర్ పదార్థాలు దక్షిణధ్రువం నుండి ఉత్తరధ్రువం వరకు గాలితోపాటు సర్వత్రా వ్యాపిస్తున్నాయి.
ప్లాస్టిక్ వ్యర్థాలవల్ల కలిగే దుష్ఫరిణామాల గురించి ఇప్పటివరకు జరిగిన పరిశోధన చాలా స్వల్పమైనదే. ఈ వ్యర్థాల కారణంగా ఎన్నో సాగరజీవాలు ప్రాణాలు కోల్పోతున్నాయి. ఏటా కనీసం 50వేల మైక్రోప్లాస్టిక్ పదార్థాలు ఆహారం, మంచినీళ్ళ ద్వారా మనుషుల శరీరంలోకి చేరుకుంటున్నాయి. ఇలా శరీరంలో చేరుకుంటున్న మైక్రోప్లాస్టిక్ వ్యర్థాలు మన శరీరాన్ని విషపూరితం చేస్తూ మన ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావం చూపుతుందో ఊహించడం కష్టమే. మైక్రోప్లాస్టిక్ వ్యర్థాలు మన రక్తనాళాల్లోకి చొచ్చుకుపోతున్నాయి.

-ప్రొ. దుగ్గిరాల రాజకిశోర్ 80082 64690