సబ్ ఫీచర్

రెండో భాషతో మెదడుకు పదును

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగుతోపాటు ఇంగ్లీషులో మాట్లాడటం ఈ తరం విద్యార్థులకు మామూలే. రెండు భాషల్లో మాట్లాడడంవల్ల మెదడు ఎంతో ఉత్తేజితమవుతుంది. కొత్త భాషను నేర్చుకోవటం, ఆ భాషలో మాట్లాడడం మెదడుకు మంచి మేత. కొత్త భాషలోని పద సంపదను అర్థం చేసుకోవటంవల్ల మెదడు పదునెక్కుతుంది. భాషకు, సంస్కృతికి మెదడుకు మధ్య మంచి లంకె వుంది. తరగతి గదిలో కొత్త భాషను నేర్చుకోవటం, బట్టీపట్టే విధంగా వుంటే మెదడు వికసించింది. ఎప్పుడైతే కొత్త భాషను మాట్లాడడం మొదలవుతుందో అప్పుడు మెదడు ఆహ్లాదకరంగా మారి విస్తరిస్తుంది.
కొత్త విషయాలు విన్నప్పుడు మెదడు చురుకుగా మారుతుంది. భాషపై పరిశోధన చేసి శాస్తవ్రేత్తలు రెండు అంతకంటే ఎక్కువ భాషలు నేర్చుకున్న చిన్నలు, పెద్దలపై ఆధునిక శాస్తవ్రేత్తలు అధ్యయనం చేశారు. ఇది 154తో రెండు భాషలపై జరిగింది. ‘సైమన్ టాస్క్’ సిద్ధాంతం వృద్ధులలో పెద్దగా పనిచేయడంలేదు. పదేళ్లనుంచి కళాశాలకు వచ్చేవరకు ఈ రెండు భాషల మేధో సిద్ధాంతం నిరూపితమైంది. మెదడుకు ఎప్పుడూ పని ఇస్తూ వుండాలి. అలా చేస్తే మెదడు సామర్థ్యం పెరుగుతుంది. మనం మెదడు సామర్థ్యాన్ని తక్కువగా వాడుకుంటున్నాం. ఐన్‌స్టీన్ వంటి మహాశాస్తవ్రేత్త మెదడు శక్తిని పది శాతం మాత్రమే వాడుకున్నాడు. మనం చాలా తక్కువగా మెదడు శక్తిని వాడుకుంటున్నాం.
ఒక భాషకు పరిమితం కాకుండా మరో భాషను నేర్చుకోవడం అనేక విధాలుగా ఉపయోగకరం. అందుకే చైనీయులు ఇంగ్లీషును నేర్చుకోడం ప్రారంభించారు. భారతీయులకు తమ మాతృభాషతోపాటు ఇంగ్లీష్ నేర్చుకోవడం పెద్ద ప్రయోజనకారి అయ్యింది.
మన తెలుగువారివరకు రెండు భాషలు ఇటీవలికాలంలో మామూలు అయ్యాయి. ఇంట్లో తెలుగు, ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. పాఠశాలల్లో రెండు భాషల్లోనూ మాట్లాడుతున్నారు. ఇంట్లో మాట్లాడే భాషకు అదనంగా మరో భాషను నేర్చుకోవడం వల్ల మెదడు ఎక్కువగా పనిచేస్తుంది. ఇది భాషకు సంబంధించిన మెదడు శక్తినే కాకుండా ఇతర సామర్థ్యాలను పెంచుతుంది. రెండో భాషను నేర్చుకోవడంవల్ల మెదడు ఎంతో ఉత్తేజితమై ఇతర నిర్ణయాలు తీసుకోవడానికి కూడా దోహదం చేస్తుంది. మానసిక కేంద్రీకరణ, అవసరమైనపుడు ఇతర విషయాలపై దృష్టి మళ్లించడానికి ఇది దోహదపడుతుంది. ముఖ్యంగా వాహనాన్ని నడిపే సమయంలో స్పృహను పెంచుతుంది. ఇన్ని ఉపయోగాలు మెదడు నుంచి వచ్చినా మెదడు శక్తి ఇంకా 95 శాతం ఉపయోగించుకోకుండా వుంది. రెండు అంతకంటే ఎక్కువ భాషలను తరచూ మాట్లాడేవారిలో పరిశీలన శక్తి అధికం.
బహుళ భాషలు వున్న వాతావారణంలో పెరిగిన పిల్లలకు, ఇతర పిల్లలకు మధ్య తేడాను ఇటలీలోని ఇంటర్నేషనల్ స్కూల్ ఫర్ అడ్వాన్స్‌డ్ స్టడీస్‌కు చెందిన ఆగ్నేస్ కొఆక్స్ అధ్యయనం చేశాడు. బహుభాషలు మాట్లాడేవారు అల్జీమర్ (జ్ఞాపకశక్తి లోపం) వ్యాధి బారిన పడే అవకాశం తక్కువని, వృద్ధాప్యం కూడా అంత త్వరగా రాదని కాలిఫోర్నియా సాన్‌డికో యూనివర్సిటీకి చెందిన న్యూరోసైకాలజిస్ట్ తామర్ గోలన్ నాయకత్వంలోని శాస్తవ్రేత్తల బృందం తేల్చి చెప్పింది.
భారతదేశంలో అనేక భాషలున్నాయి. చాలామంది విద్యార్థులు తమ మాతృభాషతోపాటు మరో భాషను నేర్చుకుంటున్నారు. అందువల్ల విద్యలో, వృత్తిలో రాణించగలుగుతున్నారు.
రెండు భాషల వల్ల మెదడు శక్తి పెరుగుతుందన్న విషయాన్ని శాస్తవ్రేత్తలు 20వ శతాబ్దంలోనే కనుగొన్నారు. రెండు భాషలు తెలిసినా ఒకే భాషనే వాడుతున్నా మెదడు శక్తి రెండు భాషల్లో పనిచేస్తుంది. ఒక భాష బదులు ఒక్కోసారి రెండో భాష రావడం అసహజంగా వున్నప్పటికీ ఆ వైవిధ్యం మెదడు మరింత చురుకుగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది.

- మున్నీ