సబ్ ఫీచర్

గ్రామ స్వరాజ్యంతో దేశ సౌభాగ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశంలో ప్రతి ఒక్కరి గుండెలో తరతరాలకు నిలిచిపోయే మహావ్యక్తి పూజ్య బాపూజీ. 150 ఏళ్ల క్రితం జన్మించిన బాపూజీ భారత స్వా తంత్య్ర పోరాటంలో పాల్గొన్న తీరు, ఎంచుకొన్న మా ర్గాన్ని నేటికీ ప్రపంచ దేశాలన్నీ ప్రశంసిస్తుంటాయి. మహాత్ముని ఊహల్లో, ఆశయాలలో పల్లెలు గూర్చి, వాటి ఔన్నత్యం గూర్చి చాలా గొప్పగా చెప్పబడింది. పల్లెలు బాగుండాలని, సౌభాగ్యవంతంగా వుండాలని ఆయన కలలు కనేవారు. ‘ది ఫ్యూచర్ ఆఫ్ ఇండియా లైస్, ఇన్ ఇట్స్ విలేజెస్’ అని ఆయన ప్రగాఢ విశ్వాసం. గ్రామ స్వరాజ్యం ఇందుకు తోడ్పడుతుందన్నది ఆయన భావన. పల్లెలే భారతావనికి పట్టుగొమ్మలు అని పేర్కొనేవారు. మరి ఈనాడు గ్రామాల్లో ఆయన ఆశయాలు ప్రతిఫలిస్తున్నాయా? సుఖసంతోషాలతో ఈనాటి పల్లెలున్నాయా?
గాంధీజీ మరో స్వప్నం- సంపూర్ణ మద్య నిషేధం. మద్యాన్ని సేవించడం సమాజానికి ప్రమాదకరమని, దాన్ని ‘సోషల్ ఈవిల్’ అని అభివర్ణించారు. మద్యం తాగడం ఆత్మహత్యా సదృశమని, మత్తుకు బానిసలైనవారు వావివరసలు మరచిపోతారని, వారి అవయవాలు అధీనం తప్పుతాయని, దీనికి విరుగుడుగా మద్యనిషేధం అనివార్యమని పేర్కొన్నారు. మద్యం వల్ల కలిగే చెడు పరిణామాలను మనం నేడు కళ్ళముందే చూస్తున్నాం. ఇటీవల ఓ సంఘటన గురించి విన్నాం. ఓ మేనమామ తాగిన మత్తులో అక్క రూ. 5వేలు ఇవ్వలేదని, మేనకోడలయిన 5 ఏళ్ల పసిపాపను నేలకేసి కొట్టి చంపిన ఘటన. వృద్ధురాలని కూడా చూడకుండా తాగుడుకు బానిసైన ఓ మనవడు డబ్బుల కోసం ఆమె చెవి దుద్దుల్ని పెరుక్కొని వెళ్ళడం. ఇలా అనునిత్యం ఎక్కడో ఓచోట ఇలాంటి అకృత్యాలు జరుగుతున్నాయి. భార్యను చంపుతున్న భర్తలు, అమ్మను చంపుతున్న కొడుకులు, తండ్రిని కూడా కొట్టి చంపుతున్న కొడుకులు. మద్యం సేవిస్తే మనిషి మృగంగా మారుతున్నాడు. ఇలాంటి దుస్సంఘటనలు ఊహించే గాంధీజీ దేశమంతా మద్య నిషేధాన్ని అమలుపరచాలని ఉద్ఘాటించారు. దురదృష్టం మన దేశంలో అన్ని రాష్ట్రాలకు అధిక రాబడి ఇస్తున్నది మద్యం అమ్మకాల ద్వారానే. ఈ రాబడి ఏటా పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో మద్యం అమ్మకాల ద్వారా 2014-15లో 3,839 కోట్ల రూపాయలు రాబడి రాగా, 2017-18కు 5,789 కోట్లకు పెరగడం గమనార్హం. గాంధీజీ ఆశించిన సంపూర్ణ మద్య నిషేధం ఎప్పుడు వస్తుందో? దేశమంతటా మద్యాన్ని ఎప్పుడు నిషేధిస్తారో? ఈ రుగ్మత నుండి మనుషులు ఎప్పుడు బయటపడతారో?
ఇక, ఆంధ్రప్రదేశ్‌లో ఈనెల 1, 2 తేదీల్లో పండుగ వాతావరణం చూశాం. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంచెలంచెలుగా సంపూర్ణ మద్య నిషేధం వైపు అడుగులేయడం శుభపరిణామం. అక్టోబర్ 1నుండి నూతన మద్యం విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రభుత్వపరంగా మద్యం అమ్మకాలు ఆరంభించారు. రాష్ట్రంలో ఉన్న 4380 మద్యం షాపుల్ని 3,500కి తగ్గించారు. అమ్మకం వేళల్ని కూడా ఉదయం 11నుండి రాత్రి 8.గం.కు పరిమితం చేశారు. మహాత్మా గాంధీ ఆశయం కొద్దిరోజుల్లోనే నెరవేరితే అంతా సంతోషించదగ్గ పరిణామమే. 6వేల కోట్ల రూపాయల రాబడిలో 16% తగ్గినా మద్య నియంత్రణకు జగన్ సంసిద్ధులయ్యారు. ఫలితాలు ఎలా వున్నా గాంధీజీ కలల సాకారానికి ఇదొక శ్రీకారం. దశలవారీగా మద్యపాన నిషేధానికి ఏపీ ముఖ్యమంత్రి ఉపక్రమించడం సాహసోపేత నిర్ణయం.
1995లో ఎన్టీ రామారావు ఎన్నికల్లో నెగ్గిన తర్వాత ఆడపడచులకు వరంగా ‘సంపూర్ణ మద్య నిషేధం’ ప్రకటించారు. చంద్రబాబు నా యుడు ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన తర్వాత నిషేధానికి దశలవారీగా తూట్లు పెడుతూ చివరికి నిషేధం ఎత్తివేశారు. ఇది బాధతో తీసుకున్న నిర్ణయం అం టూ చంద్రబాబు అప్పట్లో కరపత్రాలు పంచారు. ఇలా సంపూర్ణ మద్య నిషేధంలో వైఫల్యాలు ఎదురైనా, తాను మహిళలకు ఇచ్చిన హామీమేరకు జగన్ అడుగు వేయడం సాహసమే. అవాంతరాలు ఎదురైనా ఈ అడుగులు ఆగకూడదని మహిళలు కోరుకుంటున్నారు. మద్య నిషేధం ఆచరణలో అమలైతే ఆంధ్రప్రదేశ్ యావత్ దేశానికే ఆదర్శప్రాయం అవుతుంది. ఎక్సైజ్ శాఖ అధికారులు దీన్ని ఒక యజ్ఞంలా చూడాలి. ఎక్కడా తప్పటడుగువేయరాదు. వారి సంపూర్ణ సహకారం, ప్రజల తోడ్పాటు లేనిదే ఈ మహత్తర కార్యక్రమం విజయవంతం కాదు.
అక్టోబర్ 2న నవ్యాంధ్రప్రదేశ్ సరికొత్త శకానికి నాంది పలికింది. గ్రామసీమలు స్వచ్ఛంగా వుండాలని, అందుకు గ్రామ స్వరాజ్యమే ఏకైక మార్గం అని గాంధీజీ అభిలషించాడు. ఆ అభిలాషకు జీవం పోస్తూ గాంధీజీ 150వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాలను ప్రారంభించారు. ‘ఈ ప్రపంచంలో నీవు చూడాలనుకొన్న మార్పు నీతోనే ఆరంభం కావాలి’ అని గాంధీజీ చెప్పిన మాటలకు అనుగుణంగా గ్రామీణ ప్రాంతాల్లో విప్లవాత్మక వ్యవస్థకు జగన్ నాంది పలికారు. ఇది భారతదేశ చరిత్రలోనే ఓ అద్భుత ఘట్టానికి శ్రీకారం. గ్రామ సచివాలయాలు విజయవంతమైతే ఆ ఫలితాలు చరిత్రలో శాశ్వతంగా మిగిలిపోతాయి. మహాత్మాగాంధీకి నిజమైన నివాళి కాగలదు. గ్రామ సచివాలయాల ఆలోచన ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడికి కలగకపోవడం దురదృష్టకరం.
ఆంధ్రప్రదేశ్‌లో 3600 కి.మీ. పైబడి పాదయాత్ర చేసిన వైఎస్ జగన్ జనం అవసరాలను సమగ్రంగా అధ్యయనం చేయగలిగారు. అధికారం కోసమో, ఓట్ల కోసమో పాదయాత్ర చేసిన వారైతే ప్రజల కష్టాల గూర్చి ఏం తెలుస్తాయి? జగన్ పథకాల రూపకల్పనలో జనం మనసుల్లోని ఆందోళన స్పష్టంగా దాగివుంది. అందులో భాగంగానే గ్రామ సచివాలయాలకు రూపకల్పన చేశారు. గ్రామీణులు మొన్నటి వరకు చిన్న చిన్న పనులకు సైతం ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ బాధలు పడేవారు. రేషన్ కార్డు, బర్త్ సర్ట్ఫికెట్, నేటివిటీ సర్ట్ఫికెట్, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధృవపత్రం...ఇవన్నీ చిన్నపాటి సమస్యలే. ఆర్థికంగా ముడిపడినవి కూడా కావు. రేషన్ ఎప్పుడొస్తుం దో, ఎప్పుడిస్తారో కూడా చెప్పేవారు కాదు. తమ చుట్టు పేదల్ని తిప్పుకోవడం వారికో ఆనందం. ఈ దురాగతాలకు పాతరవేస్తూ, ప్ర జల కన్నీళ్ళకు ఆనకట్టలు కడుతూ 2000 జనాభా కల్గిన వారందరికి ఒక గ్రామ సచివాలయాన్ని ప్రారంభించడం ముదావహం.
ప్రతి 50 మందికి ఒక వాలంటీరును నియమించారు. దేశ స్వాతంత్య్ర అనంతరం నిజంగా ప్రభుత్వమే ప్రజల ముంగిటకొస్తున్న అపురూప ఘటన ఇది. రాష్టమ్రంతటా 1,34,918 ఉద్యోగాలు కల్పించారు. వాలంటీర్లతో కలిపి 4 లక్షల ఉద్యోగాలు భర్తీచేశారు. అక్టోబర్ 2న కాకినాడ రూరల్ మండలం కరపలో ఈ కార్యక్రమాన్ని జగన్ ఆరంభించారు. క్రమక్రమంగా ఈ ఫలితాల్ని ప్రజలందరూ చూస్తారు. ప్రతి ఇంటికి ఈ ఫలాలు అందుతాయి. మైళ్లకొద్దీ దూరం కాకుండా 100 అడుగుల దూరం నడిస్తేనే మన సమస్యలు పరిష్కారం అవుతాయని అంటున్నారు. బాపూజీ కలల స్వప్నాన్ని ఆయన 150వ జన్మదినం రోజున జగన్ ఆవిష్కరించినట్లుగా వుంది. పాలకుండలో విషం చుక్క కలిపేందుకు కొన్ని దుష్టశక్తులు ఎప్పుడూ పొంచి వుంటాయి. తదనుగుణంగా ప్రభుత్వం ఎల్లవేళలా అప్రమత్తంగా వుండాలి. నిరంతరం పర్యవేక్షణకు నిబద్ధత కలిగిన అధికారులను నియమించాలి.
గ్రామ సచివాలయాలు ఆ ప్రాంత ప్రజలకు చాలా ఉపయోగకరం. అందరి సమస్యల్ని శీఘ్రంగా పరిష్కారానికి ఇందులో పనిచేసే 11 మంది కృషి చేయాలి. తమ పరిధిలోని ప్రజాసమస్యల్ని 74 గంటల లోగానే పరిష్కరించాలి. పెద్ద సమస్యల్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించాలి. ఇందులో కూడా వైఫల్యాలు కనిపిస్తే ఈ విప్లవాత్మక ప్రజాప్రయోజన కార్యక్రమానికి గండిపడడం ఖాయం. ఏ పార్టీలు కూడా ఇందులో చొరబడే ప్రయత్నం చేయరాదు. గ్రామ సచివాలయాల విధానాన్ని బాగా రూపొందించినా మరో ప్రయోజనం లోపించినట్లు కన్పిస్తున్నది. గ్రామీణుల్ని ఆర్థికంగా బలపడేందుకు కూడా కొత్త అజెండా జోడించాలి. ఆధునిక సేద్య పద్ధతులు, వ్యవసాయ ఉత్పత్తులకు తగిన మార్కెటింగ్, గిట్టుబాటు ధరలపై గ్రామీణులకు పూర్తిగా అవగాహన కల్పించాలి. దళారుల బారినపడకుండా చూడాలి. ఆర్థిక ఇబ్బందులకు బ్యాంకులు రుణాల్ని ఇచ్చేలా చూడాలి. పచ్చదనం-పరిశుభ్రం గూర్చి కూడా ప్రజలకు అవగాహన కల్పించాలి. పల్లెలు పోటీపడేలా ప్రోత్సహించాలి.
దేశంలో ఆదర్శ గ్రామాల గురించి ఆరా తీస్తే మనకు 15 గ్రామాలు కన్పిస్తాయి. బిహార్‌లో ధరణి, మహరాష్టల్రో పేవిహార్, హివేర్‌బజార్, తమిళనాడులోని వొడన్‌తురై, నాగాలండ్‌లో చిజామి, తెలంగాణలో గంగదేవిపల్లి, రామచంద్రాపురం, కర్ణాటకలో కోక్ రెబెల్లూర్, నాగాలాండ్‌లో కొనోమ, గుజరాత్‌లోని పున్‌సరి, మేఘాలయలోని మాన్‌లిన్నోంగ్, రాజస్థాన్‌లోని పిప్లంట్రి, కేరళలోని ఎరావి పేరూర్, మధ్యప్రదేశ్‌లోని ఛగువార్, అస్సాంలోని షిక ధమాక ఆదర్శ గ్రామాలు. ఈ ఆదర్శగ్రామాల్ని పరిశీలిస్తే ఒక్కో గ్రామం ఒక్కో రంగంలో ప్రత్యేకత సంతరించుకొంది. కొన్ని గ్రామాల్లో సోలార్ విద్యుత్తును ఉత్పత్తిచేసి తమ జీవితాల్ని మార్చుకోగలిగారు. కొన్ని గ్రామాలు నీటిని పొదుపుగా వాడుకొని అందుకనుగుణమైన పంటలను పండిస్తున్నాయి. గ్రామాల్లో సాంఘిక, ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఆదర్శ గ్రామాలయ్యాయి. గ్రీన్ విలేజి కానె్సప్ట్‌తో కొన్ని గ్రామాలు, స్వచ్ఛ భారత్ కానె్సప్ట్‌లతో కొన్ని గ్రామాలు, డిజిటల్ ఇండియా కానె్సప్ట్‌తో కొన్ని గ్రామాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. గ్రామ సచివాలయాలు ఇలాంటి గ్రామాల్ని అధ్యయనంచేసి గ్రామాభివృద్ధితోపాటు, ఆర్థిక స్వావలంబన కూడా జరిగేలా గ్రామాల్ని రూపుదిద్దాలి. అప్పుడే గాంధీజీగారి గ్రామ స్వరాజ్యం ఆశయం సిద్ధిస్తుంది. ‘మన జన్మభూమి బంగారు భూమి... పాడి పంటలతో పసిడి రాశులతో తళతళలాడే భూమి’ పాట నిజం కావాలి.

-డా. విజయకుమార్ 93907 45775