సబ్ ఫీచర్

సౌభాగ్య ప్రదాయిని అట్లతద్ది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అట్లతద్దె ఆడపిల్లల పండుగ. ఇది ప్రతి సంవత్సరం ఆశ్వయుజ బహుళ తదియ నాడు వస్తుంది. అంటే ఆశ్వయుజ పౌర్ణమి తర్వాత మూడో రోజు వస్తుంది. ఈ పండుగను పెళ్ళి కాని ఆడపిల్లల నుండి, పెళ్లి అయిన స్ర్తిల దాకా అందరూ కలిసి చేసుకునే పండుగ. ఈ పండుగను ‘చంద్రోదయ ఉమా వ్రతం’ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ రోజున చంద్ర కళలో గౌరీదేవిని ఆరాధిస్తారు. చంద్రోదయం అయ్యాక పూజను ముగిస్తారు. మరి ఈ ‘అట్లతద్దె’ పండుగను ఎవరు, ఎందుకు, ఎలా జరుపుకుంటారో చూద్దాం. ఈ పండుగను ఆరేళ్ల వయసు నుండి వివాహం అయిన ముతె్తైదువుల వరకు భక్తిశ్రద్ధలతో కొన్ని నియమాలు పాటించి చేసుకుంటారు. పెద్దలు పుణ్యం కొద్దీ పురుషుడు అంటారు. అందుకే కనె్నపిల్లలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం ఆచరిస్తారు. కనె్నపిల్లలు అనురాగంతో చూసుకునే అందమైన భర్త కోసం ఈ వ్రతం ఆచరిస్తే, ముతె్తైదువులు తమ సౌభాగ్యాల కోసం చేస్తారు. ఈ అట్లతద్దె పండుగను ఎలా జరుపుకుంటారో చూద్దాం.
అట్లతద్దె ముందు రోజు సాయంకాలం ఈ వ్రతం ఆచరించే ఆడవారంతా చేతులకి, కాళ్ళకి అందంగా గోరింటాకు పెట్టుకుంటారు. ఒకటి, మూడు, ఐదు, తొమ్మిది, పదకొండు.. ఇలా బేసి సంఖ్యలో ముతె్తైదువులను పేరంటానికి పిలుస్తారు. పిలిచేటప్పుడు సున్నిపిండి, కుంకుడుకాయలు, గోరింటాకు ముద్ద, పసుపు, కుంకుమ ఇస్తారు. తదియనాడు కనె్నపిల్లలు, ముతె్తైదువులు తెలవారక ముందే లేచి, తలారా స్నానం చేసి, రాత్రే వండి ఉంచుకున్న అన్నం, ముద్దపప్పు, గోంగూర పచ్చడి, పెరుగుతో తింటారు. దీనే్న సద్ది అంటారు. ఎందుకంటే వీటన్నింటినీ ముందు రోజు రాత్రే వండుతారు కాబట్టి.. తరువాత అందరూ ఒక ఖాళీ ప్రదేశంలో కలుసుకుని ఆటపాటలతో గడుపుతారు. చూడ ముచ్చట గొలిపే ఉప్పరు గుప్ప, చెమ్మచెక్క, తొక్కుడు బిళ్ళ వంటి ఆటలు, పాటలు పాడుకుంటూ ఆడుకుంటారు. ‘అట్లతద్దోయ్.. ఆరట్లోయ్.. ముద్దపప్పోయ్.. మూడట్లోయ్..’ అంటూ పాడుకుంటూ ఉయ్యాలలు ఊగుతారు. ఆ పూటంతా ఉపవాసం ఉండి సాయంకాలం పూజకి అన్నీ సిద్ధం చేసుకుంటారు. పసుపు గణపతిని, పసుపు గౌరీదేవిని పెట్టుకుని షోడశోపచార పూజలు చేస్తారు. మినపట్లు వేసుకుంటారు. పదకొండు అట్లు, బియ్యప్పిండితో దీపం చేసి, జ్యోతిని వెలిగిస్తారు. పదకొండు ముళ్ళతో తోరాలు అమ్మవారికి, తమకి పేరంటాళ్లకు తయారుచేస్తారు. గణపతికి, గౌరీదేవికి రకరకాల వంటకాలు చేసి నివేదన చేస్తారు. ఈ రోజు అమ్మవారికి నివేదనలో పదకొండు రకాల కూరగాయలతో పులుసు, పాలతాలికలు తప్పనిసరిగా చేస్తారు.
అట్లతద్దెకు కారణం
త్రిలోక సంచారి అయిన గౌరీదేవి నారదుని ప్రోద్భలంతో శివుని పతిగా పొందగోరి, ఆ తొలుతగా చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్లతద్ది. స్ర్తిలు సౌభాగ్యం కోసం చేసుకునే వ్రతమది. చంద్రారాధన ప్రధానమైన పూజ, చంద్రకళల్లో కొలువై ఉన్న శక్తి అనుగ్రహం చేత స్ర్తి సౌభాగ్యం పెరుగుతుంది. కుటుంబంలో సుఖశాంతులు వర్దిల్లుతాయని శాస్త్ర వచనం. ఈ పండుగలో అమ్మవారికి అట్లు నైవేద్యంగా పెట్టడంలో ఒక అంతరార్థముంది. నవగ్రహాలలోని కుజుడుకి అట్లంటే మహాప్రీతి. అట్లను ఆయనకు నైవేద్యంగా పెడితే కుజ దోష పరిహారమై సంసార సుఖంలో ఎటువంటి అడ్డంకులు రావని నమ్మకం. రజోదయానికి కారకుడు కనుక రుతుచక్రం సరిగా ఉంచి, రుతు సమస్యలు రానివ్వకుండా కాపాడుతాడు. అందువల్ల గర్భధారణలో ఎటువంటి సమస్యలు ఉండవు. మినుమల పిండి, బియ్యప్పిండి కలిపి అట్లను తయారుచేస్తారు. మినుములు రాహువునకు, బియ్యము చంద్రునకు సంబంధించిన ధాన్యాలు. గర్భదోషాలు తొలగిపోవాలంటే ఈ అట్లనే వాయనంగా ఇవ్వాలి.
వ్రత కథ
పూర్వం ఒక రాజుకు కావేరి అనే అందమైన కూతురు ఉండేది. ఆమె స్నేహితులతో కలిసి అట్లతద్ది నోమును ఎంతో భక్తితో ఆచరించింది. అందరికీ అందమైన భర్తలు లభించారు. కావేరికి మాత్రం కురూపులు, వృద్ధులైన పెళ్లి కుమారులు తారసిల్లేవారు. కావేరి ఎంతో కలత చెంది అడవికి వెళ్లి, తీవ్రంగా తపస్సు చేసింది. పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యారు. వారికి తన బాధ చెప్పుకుంది. అప్పుడు వ్రతంలో ఆమె చేసిన దోషం వల్ల అలా జరిగిందని ఆది దంపతులు వివరించారు. ఆమె నోము నోచే సమయంలో ఉపవాసం వల్ల నీరసించి పోయింది. ఆమె అన్నలు అది తెలిసి గడ్డితో మంటపెట్టి అది అద్దంలో చూపించి చంద్రుడని భ్రమింపజేపి ఉపవాసాన్ని విరమింపజేశారట. ఫలితంగా ఆమెకు సరైన వరుడు దొరకలేదు. ఈ వ్రతాన్ని జాగ్రత్తగా మరొకసారి ఆచరించమని చెప్పి అంతర్థానమయ్యారు పార్వతీ పరమేశ్వరులు. కావేరి మళ్లీ శ్రద్ధ్భాక్తులతో వ్రతమాచరించింది. ఫలితంగా అందమైన, శౌర్య పరాక్రమాలు కలిగినవాడు భర్తగా లభించాడు. ఈ కథను చదువుకుని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ ముగిస్తారు.
అట్లతద్దిలో పార్వతీ పరమేశ్వరుల్ని పూజించటానికి కారణం అర్ధనారీశ్వరత్వం. సాక్షాత్తు భగవంతుడే రెండు వీడి ప్రకృతి పురుషుడిగా మారాడనీ, ఆ అర్ధనారీశ్వరంలో నుంచి సమస్త సృష్టి జరిగిందని ఇతిహాసాలు చెబుతున్నాయి. అన్యమతాల్లోనూ ఇదే పద్ధతిలో ఉపవాసం ఉండి, చంద్రోదయ తరువాత ఉపవాసాన్ని విరమించడం మనం చూడవచ్చు. మతాలు వేరైనా అభిమతం ఒక్కటే అని తెలియజెప్పే ఈ అట్లతద్ది నోము మతసామరస్యానికి పెద్ద పీట వేస్తుంది.