సబ్ ఫీచర్

తగ్గిపోతున్న ఆహారోత్పత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆహారం లేకుండా ఏ ప్రాణి, ఏ మనిషి జీవించడం అసంభవం. కానీ, కొన్ని జీవులు ప్రకృతి మీద ఆధారపడి ఉంటాయి. మొక్కలకు జీవనాధారం నీళ్ళు. వర్షాలు కురిస్తేనే మొక్కలు నీటిని పీల్చుకొని పెరుగుతాయి. కొన్ని జంతువులు అంటే గేదెలు, ఆవులు, మేకలు, గొర్రెలు మొదలైనవి ఆ చెట్ల ఆకులను, గడ్డిని తిని బతుకుతాయి. క్రూరమృగాలు అడవుల్లో బలహీనమైన దుప్పులు, మేకలు వంటి జంతువులను తిని జీవిస్తాయి. జంతువులు వాటికి అవసరమైన ఆహారం ఎలా ఉన్నా తిని మనుగడ సాగిస్తాయి. అదే మనుషుల విషయానికొస్తే ఏది ఉంటే అది తిని మనిషి బతకలేడు. తాము తీసుకునే ఆహారంలో విటమిన్లు, ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు, మాంసకృత్తులు మొదలైనవి ఉండాలి. అవి తింటేనే మనిషి వయస్సుకు తగినట్లు బరువుగా, ఆరోగ్యంగా ఉంటాడు.
ఆధునిక కాలంలో అందరికీ పోషక విలువలు ఉన్న ఆహారం దొరకటం లేదు. ఉన్నదాంతోనే కొందరు కడుపునింపుకుంటున్నారు. ఒక్కపూట కూడా తినడానికి తిండి లేని వారెందరో సమాజంలో ఉన్నారు. రెండు పూటలా తినేంత స్థోమత ఉన్నప్పటికీ పోషక విలువలు కలిగిన పదార్థాలు తీసుకునే అవకాశం లేదు. ఏదో కడుపు నింపుకోవడం కాకుండా, ఆ తిండి తాము పనిచేసుకునేంత శక్తి ఇచ్చేదిగా ఉండాలి. ఇక రోడ్లమీద హోటళ్లలో, వీధుల్లో బిచ్చమెత్తుకుని తినేవారి పరిస్థితి అగమ్యగోచరం. దయతలచి రాత్రి మిగిలిపోయిన ఆహార పదార్థాలు ఎవరయినా ఇస్తే, అవి పాచిపోయినా ఎలా వున్నప్పటికీ గత్యంతరం లేక తినాల్సిందే. అలాంటి ఆహారంలో పోషక పదార్థాల మాట దేవుడెరుగు.. వాటివల్ల రోగాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి.
ధనవంతుడికి తిందామంటే సమయం ఉండదు. బీదవాడికి తిందామంటే ఆహారం దొరకదు. శిశువునుండి వృద్ధుల వరకూ ఏ వయసులో ఎలాంటి ఆహారం తీసుకోవాలో అలా తీసుకోని పక్షంలో శారీరక ఎదుగుదల, మానసిక ఎదుగుదల ఆగిపోతుంది. దీంతో వారి జీవితాలు దుర్భరమవుతాయి. గర్భిణులు సరైన పోషకాహారం తీసుకోనందున వారికి పుట్టే పిల్లలు అవయవ లోపంతో, నిస్సత్తువగా, పీలగా కన్పిస్తారు. ప్రపంచంలో సగటున ప్రతి మనిషికి ఏడాదికి 333 కిలోల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అవుతున్నాయి. కానీ ప్రపంచమంతా ఇవి సమానంగా లభించడం లేదు. భారతదేశంలో తలసరి ఆహార ధాన్యాల ఉత్పత్తి ఏడాదికి 204 కిలోలు కాగా, విత్తనాల కోసం నిల్వ ఉంచినప్పుడు కొంతవరకు అవి పాడైపోవచ్చు. అలాంటి వాటిని తీసివేయగా, మనిషికి లభించేవి సగటున 184 కిలోలు. ఖరీదయిన ఆహార పదార్థాలను కొనుక్కొని తినే స్థోమత లేనటువంటి బీదవారు, బడుగులు ప్రధానంగా బియ్యం, గోధుమలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. వారికి అవసరమయిన కేలరీల శక్తి అందించగల ధాన్యపు గింజల్ని కొనుక్కోలేని పేదలు దేశంలో మూడింట ఒకవంతు ఉన్నట్లు సర్వేల్లో తేలింది.
ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఎఓ)లో 150 దేశాలు సభ్యదేశాలుగా ఉన్నాయి. 1979నుండి ప్రతి సంవత్సరం అక్టోబర్ 16వ తేదీన ‘ప్రపంచ ఆహార దినోత్సవం’ (వరల్డ్ ఫుడ్ డే) జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి తీర్మానం చేసింది. 1981 నుంచి ప్రతి సంవత్సరం ఆహారం పోషక విలువలు, ఆహారం పర్యావరణం, ఆహార భద్రత లాంటి ఒక్కొక్క అంశాన్ని తీసుకొని ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 2003వ సంవత్సరానికి ‘ఆకలికి వ్యితిరేకంగా అంతర్జాతీయ కూటమి’ (ఇంటర్నేషనల్ అలయెన్స్ అగెనెస్ట్ హంగర్) అనే అంశాన్ని ఐక్యరాజ్య సమితి గ్రహించింది.
కొన్ని పర్యావరణ విపత్తుల కారణంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గిపోయింది. రోజురోజుకు జనాభా కోట్లలో పెరిగిపోతోంది. పెరుగుతున్న జనాభాకు తగినట్లుగా ఆహారోత్పత్తి జరగటం లేదు. సగటు ఆహారోత్పత్తి తగ్గిపోయింది. అందువల్ల ప్రతి మనిషికీ పోషక విలువలు కలిగినటు ఆహార పదార్థాలు సమృద్ధిగా దొరకటం లేదు. నూటికి 60 నుండి 70 శాతం ప్రజలు సరి అయిన పోషక విలువలు లేని ఆహారానే్న తీసుకుంటున్నారు. పోషకాహారం లోపాల వల్ల నూటికి 20నుండి 30 శాతం ప్రజలు వివిధ రోగాల బారిన పడి మరణిస్తున్నారు. నాణ్యమైన ఆహారం అందరికీ అందినపుడే మానవాళి ఆరోగ్యకరంగా ఉంటుంది. ఆహారోత్పత్తులను అవసరాల మేరకు పెంచడం, తక్కువ ధరలకు వాటిని బడుగువర్గాలకు అందుబాటులో ఉంచడం ప్రభుత్వాల కర్తవ్యం.

-శ్రీనివాస్ పర్వతాల 94906 25431