సబ్ ఫీచర్

ఆదుకోవాల్సింది ప్రభుత్వాలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వృత్తిపరంగా భూమితల్లిని నమ్ముకున్న రైతాంగానికి కాలానుగుణంగా సహనం వారికి అలవడిన సహజ గుణం. ముఖ్యంగా రాయలసీమ రైతులకు వేచి చూడడం అదను సదనులో వర్షం పడుతుందని ఆకాశంవైపు మోరలెత్తి చూస్తూ సీమపై కరమబ్బులు కమ్మి పిల్లతెమ్మెరలు వీచడంతో వాన తప్పకుండా కురుస్తుందని ఆశగా ఎదురుచూడడం వారికి సంవత్సరాల తరబడి ఆశగా ఎదురుచూసే క్రమం ఆనవాయితీగా మారింది. నేలపై చినుకు చినకక కర్షకుడి ఆశ తీరక, ప్రకృతి వైపరీత్యంగా రాయలసీమలో కరువు దరువులు ఈనాటివి కావు. ఒక్క రాయలసీమనే కాదు ఉభయ తెలుగు రాష్ట్రాలలో వర్షాభావ పరిస్థితులతో గతకడానికి రైతులకు మెతుకే కరువైందనే నగ్నసత్యం విస్మరించరానిది.
ఈ ఏడు దక్షిణాది రాష్ట్రాలు చాలావరకు మునకలువేసి వాగులు, వంకలు, ఉప్పొంగిపోయిన నదుల వరదలకు ముంపునకు గురై అతలాకుతలమైన జన జీవనం, ఆస్థి, ప్రాణనష్టం విస్మరించరాని విషయమేమి కాదు. జలప్రళయానికి నిర్వాసితులు కకావికలమై కట్టుబట్టలతో పొట్టలలో ఆకలి నమిలేస్తున్నా బ్రతుకుజీవుడా అనుకొంటూ పునరావాస కేంద్రాలలో అనుభవించిన దుర్భర జీవితాలను తలచుకొంటే వళ్ళంతా కంపరమెత్తుతోంది. జల విలయంలో ఇన్ని రాష్ట్రాలు ముంపుకుగురై విలవిలలాడుతున్న వైనం ఒక పార్శమైతే వానలు కురియని వెరపుతో రాయలసీమ, తదితర వర్షాభావ ప్రాంతాలలో నీటికరువుతో దాహంతీరక, నీరు సాగక సాగు కష్టాలతో సేద్యం చేదెక్కింది. అలాటి ప్రాంతాలలో భూగర్భ జలాలైనా వెలికితీసి వినియోగించుకోవాలని ఆశపడి గొట్టపు బావులు త్రవ్వించడానికి కుతూహలపడ్డారు. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి లక్షలతో అప్పులుచేసి బోరుబావులు వేయించారు. బోరుబావుల జల నీటిమట్టం గణనీయంగా పడిపోవడంతో జలం రాకపోగా మరింత ఆశా, పట్టుదలతో బోరువెంట బోర్లు త్రవ్వించి నీటి చెలమ పొడగట్టని విషమ పరిస్థితులలో రైతులు చతికిలపడి గత్యంతరం కానరాక దైద్వీభావంలో పడిపోయి తానూ తన కుటుంబం ఎదిగి ఉన్నతస్థితికి రాలేమని మనోవ్యథ మనసునిండా నింపారిపోయి ప్రాణత్యాగం చేసుకోవాలనే మనో నిశ్చితికి వస్తుంటారు.
ప్రభుత్వాలు రైతుల ఆత్మహత్యల ఆంతర్యం, నివారణోపాయాలకు గల కారణాలను వెలికితీసేందుకు నిష్ణాతులైన వ్యవసాయ శాస్తవ్రేత్తలతో, సేద్య రంగంలో విశేషానుభవంగల విశే్లషణాత్మకమైన సూచనలు, సలహాలిచ్చే రైతులతో కమిటీలువేయడం వలన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కర్షక జీవితాలు వ్యవసాయ రంగంలో సేద్యపు సాగుకు అడ్డంకిగా నిలిచిన అవరోధాలు బట్టబయలౌతాయి.
దేశవ్యాపితంగా ఒకే రకమైన భూములు, వాటి సారవంతం ఒకే విధంగా ఉండనేరవు. ఆయా ప్రాంతాలలో వివిధ రకాలైన పంటల ఉత్పత్తి గణనీయంగా వచ్చే వీలుంటుంది. కనుక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సేద్యపు ఉత్పత్తుల మద్దత్త్ధురల విషయంలో ఒకే విధానాన్ని అవలంభించకుండా ఆయా ప్రాంతాలకు అనుకూలించే మద్దత్తు ధరలను ప్రకటించాలి. సేద్యరంగం సాగుకు సన్న చిన్న మధ్య తరగతి రైతులకు, కౌలుదారులకు పెట్టుబడే మూలాంశం. ఆర్థిక రంగంలో బ్యాంకులు రైతులకు రుణాలు మంజూరుచేయడంలో కాలవ్యవధి దాటకుండా, బ్యాంకు విధానాలను సరళీకరించి బ్యాంకుల చుట్టూ తిప్పుకోకుండా రుణాల మంజూరీలో రైతుల పరపతిని, ప్రజాప్రతినిధుల సిఫారసులతో ప్రమేయంలేకుండా ఉత్సాహం చూపి పంటల ఉత్పత్తిని సాధించగల రైతుల పట్ల వివక్షత చూపకుండా రుణాలను సకాలంలో సక్రమంగా అందించే విలక్షణ కర్తవ్యాన్ని బ్యాంకర్లు నిర్వహిస్తే పంట ఉత్పత్తులను అమ్మగానే రైతులు నిక్కచ్చిగా నికార్సుగా పంట రుణాలు వడ్డీతోపాటు చెల్లించేందుకు ఏమాత్రం వెనుదీయరు. రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించే పరిస్థితికి అవకాశం లేకుండా నూటికి నూరు శాతం బ్యాంకుల ద్వారానే పంట రుణాలను అందించే వెసులుబాటుకు వెలుగుబాట వేయాలి.
వ్యవసాయ రంగ పరిశోధకులు, శాస్తవ్రేత్తలు రైతాంగానికి ఆధునిక వ్యవసాయ ఉత్పత్తులు పరిఢవిల్లడానికి క్షేత్రస్థాయిలో అవగాహనలకు ప్రాధాన్యతనివ్వాలి.
భూమి దున్నడంనుండి దమ్ముచేయడం, మేలిమిరకాలైన విత్తనాల్ని సమకూర్చుకోవాల్సి విధానాలను, విత్తశుద్ధి, కలుపు నివారణ, చీడపీడలు పైరును ఆశ్రయించినపుడు చేయదగిన నివారణా చర్యలను, అందుకు వినియోగించే ఆధునిక యంత్ర పరికరాలు రైతులకు అందుబాటులో తీసుకువచ్చే అవసరాలను వ్యవసాయశాఖ సహకారంతో వినియోగించుకొనే విధానాన్ని అలవర్చాలి. నేడు గ్రామసీమల్లో యువత అంతోఇంతో చదువరులే కనుక వారంతా శాస్ర్తియ విజ్ఞానంపట్ల ఆసక్తి చూపి ఏయే సమయాల్లో పైరుపంటల చూపాల్సిన విధానాలను అమలుచేసి ఉత్పత్తికి ఊతమివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏయే కాలావధులలో ఏయే పంటల ఉత్పత్తి లాభాసాటి ధరలు పలుకుతాయో కొంత ముందస్తుగా అంచనాలువేసి, నష్టపోవని ఆర్థిక పరిస్థితికి చేరువకావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వ్యవసాయోత్పత్తులకు ఊతమిచ్చే రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందుల ధరలను తగ్గించడం, వీలైనంత సబ్సిడీలతో అమ్మకాలు సాగించే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలి. సాగు వ్యయం, కూలీల వేతనాలు, ఇంటిల్లిపాది శ్రమ, ఇత్యాది కర్షకుని కష్టాలు, లాభసాటిగా రైతాంగం పుంజుకొనేలా ఆయా ప్రాంతాలను, రాష్ట్రాలను ప్రాతిపదికన మద్దత్త్ధురలను ప్రకటించాలే తప్ప గంపగుత్త మద్దతు ధరలు సేద్యానికి సేదతీర్చబోవు. ఆహార ధాన్యోత్పత్తులకు ధరలు మందగించిన తరుణంలో వాటిని నిల్వచేయడానికి సామాన్య గోదాములు, శీతల గోదాములు అవసరాలను గుర్తించి విస్తృతంగా గోదాముల నిర్మాణాలు, గ్రేడింగ్ ఏర్పాటు కేంద్రాలను విస్తరించాలి. పరిసర వాతావరణ ప్రభావంతో కుళ్ళిపోయే పండ్లుకు ఆసరా నిమిత్తం ప్రత్యేక ఏర్పాట్లుతో ఏసీలు ఏర్పాటుచేయడమే కాకుండా పండ్లు, టొమేటా తదితరాలకు ధరలు పూర్తిగా పడిపోయినప్పుడు ప్రభుత్వమే ముందుకు వచ్చి, అలాంటివాటిని కొనుగోలుచేసి రైతు కష్టానికి స్వస్థత చేకూర్చాల్సి ఆనవాయితీగా కొనసాగించాలి.
ప్రభుత్వ మార్కెట్ యార్డులలో దళార్, కమీషన్ ఏజెంట్ల వ్యవస్థను రూపుమాపాలి
రైతుమార్కెట్లకు ఎన్నో వ్యయప్రయాసలుకోర్చి తీసుకువచ్చిన పంటలకు మధ్యదళారులు వికృత ధనాశను రూపుమాపి, వారి ప్రమేయాన్ని పూర్తిగా రూపుమాపాలి. కమీషన్ ఏజంట్ల దాష్టీకాన్ని పక్కకు తప్పించాలి. ముఖ్యంగా వ్యవసాయ రంగంకూడా ఒక ప్రతిష్టవంతమైన పారిశ్రామిక రంగంగా గుర్తించి రైతుకు స్వతంత్రప్రతిపత్తిని కల్పించాలి. తన ఉత్పత్తిని తాను ఐచ్చికంగా అమ్ముకొనే పరిస్థితిని కల్పించాలి.
ప్రకృతి వైపరీత్యాల్ని అడ్డుకోలేంకానీ ప్రత్యామ్నాయాల వెంట పరుగులు తీయాలి. పంట రుణాలను చెల్లిస్తామని హామీలు, ప్రకటనలకంటే ప్రకృతి వైపరీత్యాలకు నష్టపరిహారాన్ని సకాలంలో అందజేసి రైతు తుష్టికి, పుష్టికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకొని దేశ, రాష్ట్రాల జాతీయ ఆహార భద్రతకు కృషిచేయాలి. రైతాంగ ఈతిబాధల్ని పూసగుచ్చే రైతాంగ విశే్లషకుల సలహాలు, సూచనల్ని ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకొని మేలిమి విధానాలకు శ్రీకారం చుట్టాలి.

దాసరి కృష్ణారెడ్డి.. 9885326493