సబ్ ఫీచర్

కలకంఠి కంట కన్నీరొలికితే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేతిలోంచి అన్నయ్య లాక్కున్న పెన్సిల్ కోసం చిన్నారి కంటతడి.. అక్కడి పెద్దలకు ‘ఏడిచి సాధిస్తుందని’ చెప్పుకోవడానికి...
తోటి విద్యార్థులే సభ్యత మరచి ర్యాగింగ్, టీజింగ్ పేరిట చిత్రహింసలు పెడుతుంటే ఉమ గుండె చెరువు.. ఆ నలుగురు నవ్వుకోవటానికి...
బాసు అయినదానికి కానిదానికి తిట్టిపోస్తుంటే రమ ఆఫీసు ఫైళ్ళలో తల పెట్టుకుని కన్నీరు చిమ్మిస్తూంటే సహోద్యోగుల సూటిపోటి మాటలకి...
ఇలా ప్రతిరోజూ ఏదో ఒక సందర్భంలో పడతులు కన్నీరు పెడుతూనే ఉన్నారు. పైగా సమాజంలో స్ర్తిలు చీటికి మాటికీ ఆవేశం కట్టలు తెంచుకుని ఏడుస్తూనే ఉంటారని అవమానాలు పడుతూనే ఉంటారు. నిజానికి ఆడవాళ్ళు గొల్లున విలపించడం మన సంస్కృతి, సంప్రదాయమేమీ కాదు. అలాగని చిన్న కష్టానికి ‘బేర్’మని ఏడ్చేసే పురుష పుంగవులు సైతం లేకపోలేదు.
నవ్వినా కన్నీళ్ళే వస్తాయి, ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి. ఊ అంటే కన్నీరు ఆ అంటే కన్నీరు. ఆడవాళ్ళు మాత్రమే నెత్తిమీద ఎప్పుడూ గంగాదేవిని ప్రతిష్ఠించుకుని సిద్ధంగా ఉంటారనుకోవడం కేవలం అపోహ.
కాని మనం పెట్టే కన్నీటికి విలువ ఉంది. మన ఏడుపు ఎదుటివారికి ఆనందాన్ని పంచి ఇస్తుందని తెలిసినపుడు మనం ఎందుకు ఏడవాలి? కన్నీళ్ళతో ఎంతో భారమైన హృదయాలు కూడా తేలిక పడతాయి. భోరున విలపించే వాళ్ళ గుండె దూదిపింజలా గాలిలోకి ఎగురుతుంది. మనలో అంతర్లీనంగా ఉన్న పలు మానసిక రోగాలూ నయమవుతాయి.
మనసు గాయాన్ని అధిగమించాల్సి వచ్చినపుడు అనవసరంగా సమస్యను భూతద్దంలో పెట్టి చూసి ఏడుస్తూ కూర్చుంటే కన్నీరులో అన్నీ రహదారులు కనుమరుగయిపోతాయి. కలత చెందే హృదయాన్ని చూసి మనస్ఫూర్తిగా ఓదార్చే వారున్నపుడు ఏడుపునకు అర్థం ఉంటుంది. కానీ అందరిముందూ ఏడిచి అభాసుపాలు కాకూడదు. ఎదుటివారి సానుభూతి ఆశిస్తూ వారికి చికాకు పుట్టించకూడదు. సున్నిత మనస్కులు సైతం గుండె నిబ్బరం చేసుకుని ప్రతీ సమస్యకు పరిష్కారం ఉంటుందని, ఏడుపు ఒకటే మార్గం కాదని తెగువ చూపాలి.
వాదనలో ఓడిపోతున్నా, సమస్యలు తీరకున్నా చివరకు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నా రోజుల తరబడి కుంగిపోవడం చూస్తే నిజంగా సహచరులను కోల్పోయి గుండె ముక్క చక్కలుగా రోదిస్తున్నవారుకూడా ఎగతాళి పాలవుతారు.
బుల్లితెరలో పుంఖానుపుంఖాలుగా వచ్చి పడుతున్న ధారావాహిల్లో చాలామటుకు ముక్కు చీదుకునే అంశాలే ప్రధానంగా ఉంటున్నాయి. ‘ఏడవడానికే పుట్టిందా..!’ అనుకునేలా ఏడుపుగొట్టు సన్నివేశాలు విపరీతమయ్యాయి.
నవ్వులాగే ఏడుపు కూడా ఆరోగ్యానికి మేలు చేకూరుస్తుంది. అలాగని ఏడుపుని అలవాటుగా మార్చుకోకూడదు. అనవసరంగా కన్నీరును కారనిస్తే, అవహేళనలవల్ల సున్నితంగా ఉండేవారు కూడా కరడుగట్టిపోతారు. అపుడు ఇక ఏడుపే ఉండదు. నిత్య జీవితంలో అతి సహజమైన ఆశ నిరాశల మధ్య ఊగిసలాటలోనూ మొహం మీద గల చిరునవ్వును చెరగనివ్వద్దు సుమీ!

- హర్షిత ముసునూరి