సబ్ ఫీచర్

మెనోపాజ్‌కు విరుగుడు మొక్కజొన్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెనోపాజ్ అనేది మహిళల్లో సంభవించే సహజ పరిణామం. నాలుగు పదులు వయసు దాటిందంటే దీనిబారిన పడకుండా ఉండలేరు. ఈ సందర్భంగా హార్మోన్ల విడుదలలో జరిగే హెచ్చుతగ్గుల వల్ల శారీరకంగా అనేక మార్పులు రావటంతో పాటు శారీరక బాధలు కూడా మొదలవుతాయి. ఎముకలు పెలుసుబారతాయి. యుక్తవయసులోనూ ఎముకల పటుత్వం కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దీని కోసం రోజూ తీసుకునే ఆహారంతో పాటు అదనపు ఆహారంగా మొక్కజొన్న పొత్తులు తీసుకుంటే ఎంతో మేలు చేస్తుందంటున్నాయి తాజా అధ్యయనాలు. మొక్క
జొన్న పొత్తుల్లో ఉండే ఫైబర్ వల్ల ఎముకులకు సమృద్ధిగా కాల్షియం అందుతుందని పోర్డ్యు యూనివర్శిటీ ప్రొఫెసర్ కొనె్న వీవర్ అంటున్నారు. పోస్ట్ మెనోపాజ్ దశలో ఉన్న 14 మంది మహిళల్లో ఎముకలకు కాల్షియం 41సిఎ పెరిగినట్లు గుర్తించారు. తొలుత జీరో గ్రాము నుంచి ప్రారంభించి 10 గ్రాములు, 20 గ్రాములు చొప్పున అరుగదల లేని కార్బోహైడ్రేట్స్ అందించినప్పటికీ మొక్కజొన్న పొత్తులు తినటం వల్ల కాల్షియం ధారణలో 10 గ్రాములు తిన్నవారిలో 4.8శాతం, 20 గ్రాములు తిన్నవారిలో 7శాతం ఉన్నట్లు గుర్తించారు. కాబట్టి పోస్ట్ మెనోపాజ్ దశలో మహిళలు ఎముకలు దెబ్బతినకుండా ఉండాలంటే మొక్కజొన్న పొత్తులే శరణ్యమని వీవర్ తెలియజేస్తున్నారు. అలాగే 31మంది అమ్మాయిలపై కూడా ప్రయోగం చేశారు. వీరికి కూడా జీరో గ్రాముతో మొదలుపెట్టి 10, 20 గ్రాముల చొప్పున ప్రతిరోజూ మొక్కజొన్న పొత్తులు తినమని ఇచ్చారు. మూడు వారాల తరువాత పరిశీలిస్తే 12శాతం కాల్షియం పెరిగినట్లు గుర్తించారు. ఎముకలకు 1.8శాతం కాల్షియం అందుతున్నట్లు గ్రహించారు. కాబట్టి ఏ వయసులో వారికైనా ఎముకలు పటుత్వంగా ఉండాలంటే రోజూ తీసుకునే ఆహారంతో పాటు అదనపు ఆహారంగా మొక్కజొన్న పొత్తులు తినండి.