సబ్ ఫీచర్

మడమ తిప్పని మహానేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలోనే కాదు భారతదేశంలోనే దివంగత నేత డా. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పరిపాలన ఒక వి నూత్న ఒరవడిని ప్రజల పట్ల ప్రభుత్వానికి, పాలకులకు వుండదగిన కర్తవ్యం పట్ల సరికొత్త మార్గ దర్శనం చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిస్సత్తువుగా వున్న సమయంలో 2003లో ప్రతిపక్ష నాయకుడిగా 1475 కిలోమీటర్ల మేరకు మండుటెండలో జరిపిన చారిత్రాత్మకమైన ప్రజాప్రస్థానం పాదయాత్ర రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది.
రాష్ట్రంలో బాగా వెనుకబడిన ప్రాంతాలను సం దర్శించి ఆయా ప్రాంతాలలోని ప్రజల సమస్యల ను తెలుసుకోవడం ద్వారా ఆ తరువాత తాను అధికారంలోకి వచ్చిన సమయంలో అత్యంత ప్రజారంజకంగా పరిపాలన జరపడానికి అవకాశం ఏర్పడింది. రాజకీయంగా రాజశేఖర్‌రెడ్డిపైన, ఆ యన ప్రభుత్వంపైన ఆయన ప్రారంభించిన పథకాల మీద ఎవ్వరు ఎన్ని విమర్శలైనా చేయవచ్చు. అయితే పేర్లు మార్చి డిజైన్లు మార్చి వాటినే తిరిగి అమలు చేయక వారికి తప్పడంలేదు.
ప్రభుత్వాల పనితీరుకు నేడు ప్రజలు రాజశేఖరరెడ్డి పాలనను ఓ ప్రామాణికంగా తీసుకుని సరిపోల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆపదలో వున్న ప్రజలపట్ల ఆయన చూపిన ప్రదర్శించిన ఆదుర్దా, వారిని ఆదుకోవాలని చూపిన పట్టుదల, వారి జీవితాలలో వెలుగులు నింపాలని పడిన తపన మరే నాయకుడితో పోల్చలేము.
1949 జూలై 8న పులివెందులలో జన్మించిన రాజశేఖరరెడ్డి అతి పిన్నవయసులోనే 29 సంవత్సరాలకు 1978లో శాసనసభకు ఎన్నికయ్యారు. ఆ తరువాత రెండేళ్లకే మంత్రి పదవి చేపట్టారు. తన రాజకీయ ప్రయాణంలో ఒక్కసారి కూడా ఓటమి ఎరుగని రాష్ట్రంలో అతి కొద్దిమంది నాయకులలో ఆయన ఒకరు. నాలుగుసార్లు కడప నుండి లోక్‌సభకు, పులివెందులనుండి అసెంబ్లీకి ఐదుసార్లు ఎన్నికయ్యారు. పదేళ్లపాటు అధికారానికి దూరం గా వున్న కాంగ్రెస్ పార్టీని 2004లో అధికారంలోకి తీసుకురావడమే కాకుండా కేంద్రంలో తిరిగి కాం గ్రెస్ ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర వహించారు.
2004 మే 14నుండి 2009 సెప్టెంబర్ 2న నల్లమల అటవీ ప్రాంతంలో హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందేవరకు ముఖ్యమంత్రిగా కొనసాగిన వైఎస్ రాజశేఖరరెడ్డి అన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు అభివృద్ధి, సంక్షేమ రంగాలపట్ల అనుసరించాల్సిన ప్రాధాన్యం గురించి సరికొత్త ఆదర్శాన్ని నెలకొల్పారు. నేడు దాదాపు అన్ని ప్రభుత్వాలు అన్ని రంగాలలో ఆయనను ఒక రోల్ మోడల్‌గా తీసుకుంటున్నాయ. అప్పటివరకు ప్రభుత్వం ఏ సంక్షేమ పథకం చేపట్టినా మొక్కుబడిగా కొద్దిమందికి, అదీ సొంత పార్టీకి, వర్గానికి చెందిన వారికి మాత్రమే లబ్ధి చేకూర్చే విధంగా అరకొర నిధులు కేటాయిస్తుండేవారు. అయితే వైఎస్‌ఆర్ ఏపథకం చేపట్టినా పార్టీలకతీతంగా వివక్షత లేకుండా అవసరమైనవారికి ఆ పథకం ద్వారా ప్రయోజనం చేకూర్చే విధంగా చూడడం ఆయనలోని ప్రత్యేకత. అంతకు ముందు పెన్షన్ అందుకుంటున్న వా రు మృతి చెందితేనే కొత్తగా మరి కొంతమందికి వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేసేవారు. కానీ ఆయ న పాలనలో అర్హులైన అందరికీ పెన్షన్ అందే ఏ ర్పాటు చేసారు. పేదలకు ఆరోగ్య శ్రీ ద్వారా కార్పొ రేట్ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఉచిత అంబులెన్స్ సేవలను దేశంలోనే మొట్టమొదట కల్పించిన ఘనత ఆయనదే.
డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీ పథకం ద్వారా ఆర్థిక సహాయం కల్పించి చిన్న చిన్న వ్యాపారాలు వృత్తుల ద్వారా మహిళల సాధికారతకు అవకాశం కల్పించారు. అదేవిధంగా తర, తమ బేధం లేకుం డా పేదలందరికీ ఒక గూడు కల్పించడం కోసం ఎక్కడా లేని విధంగా భారీ స్థాయిలో ఇందిరమ్మ గృహాల నిర్మాణం చేపట్టారు. పేద, అణగారిన వర్గాలకు, విద్యార్థులకు సైతం నాణ్యతతో కూడిన విద్యను పొందే విధంగా ఆయన ప్రవేశపెట్టిన ఫీజ్ రీయింబర్స్‌మెంట్ పథకం అద్భుత ఫలితాలను ఇచ్చింది. ఇటువంటి పథకం దేశంలో మరెక్కడా లేకపోవడం గమనార్హం. డా.మన్మోహన్‌సింగ్ ప్రభు త్వం చేపట్టిన జాతీయ ఉపాధి హామీ పథకం పెద్ద ఎత్తున అమలు చేసింది మన రాష్ట్రంలోనే కావడం గమనార్హం. 2008లో దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభు త్వం రైతు రుణమాఫీ అమలు చేసే విధంగా ప్రభావితం చేయడంలో వైఎస్ కృషి ఎంతో వుంది. 2009 ఎన్నికలలో కొత్తగా ఎటువంటి వాగ్దానాలు చేయకుండా, హామీలు ఇవ్వకుండా కేవలం తన ప్రభుత్వ పనితీరు చూసి ఓటువేయమని ప్రజలను రాజశేఖరరెడ్డి కోరారు. అభివృద్ధి, సంక్షేమం, విశ్వసనీయతలకు ప్రతీకగా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి, ఆయనకు బ్రహ్మరధం పట్టి తిరిగి ఎన్నుకున్నారు. బద్ధ వైరుధ్యాలు కల టిఆర్‌ఎస్, టిడిపి, ఉభయ కమ్యూనిస్టులు మహాకూటమిగా ఏర్పడి మరో పక్క చిరంజీవి ప్రారంభించిన ప్రజారాజ్యం పార్టీ గట్టి పోటీ ఇచ్చే ప్రయత్నం చేసినా ప్రజలు కాంగ్రెస్, వైఎస్ వెంటే నిలిచారు.
ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడం కోసం దేశంలో మరే ప్రభుత్వం చేపట్టలేనన్ని కార్యక్రమాలను చేపట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే రైతులకు ఉచిత విద్యుత్ అందచేస్తూ ఉత్తర్వులపై సంతకం చేసా రు. దానితో మెట్ట ప్రాంతాలలోని రైతులకు వెసులుబాటు కలిగింది. ముఖ్యంగా వెనుకబడిన తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలలో కొత్త వెలుగులు నింపే ప్రయత్నం జరిగింది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం నాలుగు ప్రాంతీ య అభివృద్ధి మండలులను ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలో లక్ష ఎకరాలకు అదనంగా సాగునీటి సదుపాయం కల్పించడం కోసం రాజశేఖరరెడ్డి ప్రారంభించిన జలయజ్ఞం చారిత్రాత్మకమైనది. దీన్ని నాడు విమర్శించిన వారే ఇప్పుడు ఆయా పథకాలకు పేర్లుమార్చి ఖ్యాతి పొందే ప్రయత్నం చేయడం గమనార్హం. సముద్రంలోకి వృధాగా పో తున్న నీటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా రాష్ట్రంలో వృధాగా ఉన్న భూములను అన్నింటినీ సాగులోకి తీసుకురావడం కోసం దేశ చరిత్రలోనే అంతకు ముందెవ్వరు చేయనటువంటి ఒక బృహత్తర ప్రయత్నాన్ని చేపట్టారు.
రాష్ట్రంలో సాగు వసతికి వౌలిక సదుపాయాలను పెంపొందించే జలయజ్ఞ కార్యక్రమానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. జలయజ్ఞం కింద 32 భారీ, 17 మధ్య తరహా సాగునీటి పథకాలను రు రూ. 65 వేల కోట్లతో నిర్మించి 71 లక్షల ఎకరాలకు అదనంగా సాగునీటి వసతి కల్పించడంతో పాటు 21.32 లక్షల ఎకరాలకు సాగునీటి వసతిని స్థిరీకరించే విధంగా ప్రణాళికలను రూపొందించారు. ముఖ్యంగా లోతుగా ప్రవహించే గోదావరి నదినుండి ఎత్తిపోతల ద్వారా నీటిని తీసుకువచ్చి నిల్వచేసే విధంగా పథకాలు తయారుచేసారు. ఈ పథకాలు సాగునీటి సదుపాయంతోపాటు 1.20 కోట్ల మందికి తాగునీటి వసతిని కల్పించి 1700 మెగా వాట్ల విద్యుత్ ఉత్పాదనకు సైతం పథకాలు తయారుచేసారు. రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయ డం కోసం గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తరలించాలనే ఉద్దేశంతో బాబు జగ్జీవన్‌రాం సుజల స్రవంతి పథకానికి రూపకల్పన చేసారు.
దేశ చరిత్రలోనే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా కేవలం ఐదు సంవత్సరాల నాలుగు నెల ల పరిపాలనలోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన ఘనత కేవలం వైఎస్‌కే దక్కుతుంది. ఆ యన అధికారంలో వున్నప్పుడు కానీ, లేనప్పుడు కానీ నిత్యం ప్రజల సంక్షేమం కోసమే తుది శ్వాస విడిచేవరకు తపించారు. ఆయన 31 సంవత్సరాల ప్రజాప్రతినిధి జీవితం రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి చేసిన కృషి రాష్ట్ర చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. స్వచ్ఛమైన మనస్సుతో రాష్ట్ర అభివృద్ధికోసం ఆయన ప్రారంభించిన సంక్షేమ పథకాలు, ప్రతి పొలానికి కనీసం ఒక పంటకైనా నీటి సౌకర్యం కల్పించడం కోసం ప్రారంభించిన జలయజ్ఞం కార్యక్రమం పూర్తయినప్పుడే ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్టు అవుతుంది.

-కొణతాల రామకృష్ణ