సబ్ ఫీచర్

ఆన్‌లైన్ కొనుగోళ్లు విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరుగాలం కష్టించి పండించిన పంటకు డబ్బులు చెల్లించటంతో తెలుగు రాష్ట్రాల (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) పాలకులు వైఫల్యం చెందారు. ‘అమ్మబోతే అడవి’, ‘కొనబోతే కొరవి’వలే తయారైంది అన్నదాతల పరిస్థితి. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు అన్ని పార్టీలు రైతుల ఓట్లతో గెలిచి రైతులను మోసం చేస్తున్నారు. బ్రతికి ఉండగా సహాయంచేయని పాలకులు, ప్రభుత్వాలు రైతులు చచ్చినంక ఇన్ని లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తాం అంటూ మభ్యపెడుతున్నారు. మద్దతు ధర ఇస్తాం అంటారు. రెండు రోజుల్లోనే రైతుల చేతికి డబ్బులు ఇస్తాం అని ప్రచారం చేస్తారు. తెలంగాణాలో ప్రతిచోట ధాన్యం కొనుగోలు కేంద్రాలను సింగిల్ విండో సొసైటీల ఆధ్వర్యంలో ఏర్పాటుచేశారు. ఆరుగాలం శ్రమ చేతికి వచ్చాక కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే తమ అవసరాలు తీరుతాయని ఆశపడ్డ అన్నదాతలకు నిరాశే ఎదురైంది. తెలంగాణాలోని 10 జిల్లాల్లో ఐకేపి, ప్రాథమిక సహకార పరపతి సంఘం (సింగిల్ విండో) గిరిజన సహకార సంఘాల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను రెండు లేదా మూడు గ్రామాలకు ఒకటి చొప్పున గత ఏడాది డిసెంబర్‌లో ఏర్పాటుచేశారు.
రైతులనుంచి ధాన్యం కొనుగోలు చేసిన రెండు రోజుల్లోనే డబ్బులు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. మ్యాన్యువల్‌గా చేస్తే డబ్బులు త్వరగా అందవని భావించి అమల్లోకి తెచ్చిన ‘ఆన్‌లైన్’ వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. ధాన్యం సేకరణను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ చేయాలన్న ఉద్దేశంతో కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు ట్యాబ్‌లు ఇచ్చారు. ఐతే ట్యాబ్‌లు ఎలా వినియోగించాలో సాంకేతిక సమస్యలను ఎలా అధిగమించాలో ప్రభుత్వం తెలియపర్చలేదు. ట్యాబ్‌లు ఇచ్చారు. కాని అవి వివరాల నమోదుచేసే సమయంలో మొరాయించటంలో శిక్షణ లేని నిర్వాహకులు తలలు పట్టుకున్నారు. తెలంగాణాలో చాలా జిల్లాల్లో ప్రభుత్వం ఇచ్చిన ట్యాబ్‌లు సక్రమంగా పనిచేయలేదు. ట్యాబ్‌లు ఇవ్వని సహకార కేంద్రాల్లో రోజువారి వివరాలు జిల్లా కేంద్రానికి ‘ఆఫ్‌లైన్’ద్వారా పంపిస్తున్నారు. దీనివల్ల రైతులకు డబ్బులు చెల్లింపులో తీవ్రమైన జాప్యం జరుగుతోంది. ధాన్యం విక్రయించిన రైతులకు బ్యాంక్ అకౌంట్ లేకపోవటంతో జాప్యం ఎక్కువగా ఉంటున్నది. రైతులకు డబ్బులు 2 రోజుల్లోనే అందకపోవటానికి కారణాలు అనేకం. జిల్లా సహకార జిల్లా పౌర సరఫరాల శాఖల అధికారులు జిల్లా కలెక్టర్లు ప్రతిరోజు ధాన్యం కొనుగోలు కేంద్రాలతో ఫోన్ల ద్వారా సమీక్ష జరిపితే కొనుగోలు కేంద్రాల సమస్యలు పరిష్కారం అయ్యేవి. కానీ ప్రతిరోజు ఏ కొనుగోలు కేంద్రం వివరాలు ఆన్‌లైన్‌లో వచ్చాయి. ఏవి రాలేదు? ఎందుకు రాలేదు? అనే విషయాలు అధికారులు మానిటరింగ్ చేయటం మానేశారు. రైతుల ఖాతానెంబర్లు సక్రమంగా ఇవ్వకపోవటం, సకాలంలో ఇవ్వకపోవటం, రన్నింగ్ ఖాతానెంబర్లు ఇవ్వకపోవటంవల్ల ‘లేట్’గా డబ్బులు చెల్లిస్తున్నామని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు.
వాతావరణ పరిస్థితులవల్ల, ఉరుముల, మెరుపులవల్ల రైతుల ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు చేతులెత్తేస్తున్నారు. రైతులు ధాన్యం అమ్మిన వెంటనే పంటకు అప్పుఇచ్చిన వాళ్ళు వెంటపడుతున్నారు. 48గంటల్లో ‘ఆన్‌లైన్’సిస్టం ద్వారా ఖాతాలోనే జమచేస్తామనే ప్రకటనకు స్పందించి ప్రతిరోజు బ్యాంక్‌ల చుట్టూ రైతులు తిరుగుతున్నారు. 15-25రోజుల్లో గడిస్తేగాని ఆన్‌లైన్ డబ్బులు పడటం లేదు. ప్రభుత్వం ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అమ్మటంవల్ల అనేక నష్టాలు, కష్టాలు ఉన్నాయి. ధాన్యం ఎండబెట్టటానికి కిరాయికి పరదాలు తేవటం వల్ల రైతులకు నష్టం వాటిల్లుతున్నది. ఓ పైసా తక్కువ ఇచ్చినప్పటికీ దళారులు స్పాట్‌పేమెంట్ చేస్తున్నారు. మందీమార్బలం ట్యాబ్‌లు కల్గిన ప్రభుత్వాలు మాత్రమే ధాన్యం అమ్మిన 48గంటల్లో డబ్బులు చెల్లించటంలేదు. ప్రభుత్వం రైతుల ఆర్థిక అవసరాలనుతీర్చి వారికి అమృత హస్తం అందించటానికి ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ పథకం కాస్తా ఆఫ్‌లైన్‌గా మారింది. పథకంమీద పాలకులకు చిత్తశుద్ధి లేకపోవటంవల్ల సర్కారు కొనుగోలు కేంద్రంకన్నా దళారులకు అమ్మటం మేలు అని రైతులు భావిస్తున్నారు.

- రావుల రాజేశం