సబ్ ఫీచర్

సందడిని తెచ్చే ముగ్గులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముగ్గు లేదా రంగవల్లి అనేది ఇంటి వాకిలి మరియు ఇంటి లోపలా అందంగా అలంకరించు ప్రాచీన కాలంనుండి వస్తున్న భారతీయ సంప్రదాయం. ఇవి ముగ్గుపిండితో వేస్తారు. ఇంటిముందు పేడ నీటితో కళ్లాపి జల్లి తడిగా ఉండగానే ఈ పిండితో ముగ్గులు వేస్తారు. గచ్చులు వేసిన ఇంటి వెలుపలి, లోపలి భాగాల్లో ముగ్గురాళ్ళతో గాని సుద్ద ముక్కలతోగాని తడి చేసిన తర్వాత వేస్తారు.
ఆధునిక కాలంలో ఇంటి లోపలి ముగ్గులు కొందరు పెయింట్‌తో వేస్తున్నారు. ఇవి రోజూ వేసుకోనవసరం లేకుండా కొంతకాలం చెరిగిపోకుండా ఉంటాయి. కొన్ని రకాల పింగాణీ పలకలకు ముగ్గు డిజైన్లు శాశ్వతంగా ఉండేటట్లు గదులలో మధ్యన మరియు అంచుల వెంబడి వేసుకుంటారు.
సంక్రాంతి పండుగ వస్తుంది అంటేనే సందడి. కోళ్ళ పందాలు, హరిదాసు కథలు, తెల్లవారు జామున అందమైన రంగవల్లులు, పేడ కళ్ళాపులు జల్లిన ఇంటి ముంగిళ్ళు.. అబ్బో ఒకటా రెండా పండుగకి ముందు వచ్చే సందడి అంతా ఇంటి ముంగిట్లో వేసే ముగ్గుల్లోనే ఉంటుంది అంటే అతిశయోక్తి కాదు. ధనుర్మాసం వచ్చిదంటే చాలు, ఆంధ్ర, తెలంగాణలో ముగ్గులతో ఇళ్లనీ దర్శనమిస్తాయి. అసలు ముగ్గులకు నేపథ్యం ఏమిటో తెలుసుకుందాం.
‘్థజండ్ సోల్స్- విమెన్, రిచువల్ అండ్ ఎకాలనీ ఇన్ ఇండియా, ఆన్ ఎక్స్‌ఫ్లోరేషనన్ ఆఫ్ ది కోలం అనే పుస్తక రచయిత విజయ నాగరాజన్ తన పుస్తకంలో ముగ్గులు, వాటి చరిత్ర, మహిళల జీవితంలో వాటి ప్రాధాన్యతలను విస్తృతంగా చర్చించారు.
ముగ్గు ఎప్పుడు ఎలా పుట్టింది అనడానికి స్పష్టమైన ఆధారాలు ఏమీ లేవని అంటూ, వేదాలలో సూర్య ఆరాధన కోసం రకరకాల చిత్రాలు చిత్రీకరించినట్లు ఆధారాలు ఉన్నాయని నాగరాజన్ తెలిపారు. తమిళ సంస్కృతిలో తొలిసారిగా ముగ్గు గురించి మధ్యయుగానికి చెందిన ఆండాళ్ అనే కవయిత్రి ప్రస్తావించారని తెలుస్తుంది. డిసెంబర్-జనవరి నెలలని తమిళనాడులో ‘మార్గాహి’ అంటారని, శీతాకాలం ప్రవేశంతో, పూజకి, ఆధ్యాత్మికతకు ఈ కాలం నెలవుగా వుండటం వలన ఈ సమయంలో ముగ్గులు వేయడం ఒక సంప్రదాయంగా స్థిరపడింది. విశ్వంలో వుండే శక్తులను, భూమాతని, దేవతలను ఆరాధించేందుకు ఇదొక మార్గం. ముగ్గులు వేయడంవలన లెక్కలపట్ల అవగాహన పెరగడమే కాకుండా తర్కబద్దంగా ఆలోచించడం జరుగుతుంది.
సాంప్రదాయ ముగ్గులు
మామూలు పిండితో కళ్ళాపి చల్లిన నేలపై పెట్టేవి. ఇవి ప్రతిరోజూ పొద్దునే్న పెడతారు. చిన్న సంప్రదాయాన్ని అనుసరించి ముంగిట్లో మహాలక్ష్మి నడయాడునన్న నమ్మకంతో వేయు ముగ్గులు.
రంగుల ముగ్గులు
కొన్ని విశేష సందర్భాలలో రంగులను ఉపయోగించి వేయు ముగ్గులు. పోటీలకు, కొత్త సంవత్సర ముగ్గులను తీర్చిదిద్దేందుకు, ఇంట్లో శుభకార్యాలకు ఇలాంటివి వేస్తుంటారు.
పండుగ ముగ్గులు
సాధారణంగా ముగ్గులతోనే పండగలకు కళ వస్తుంటుంది. సంక్రాంతి సందర్భంలో పెట్టే ముగ్గులు దీనికి ఉదాహరణ. కార్తీకమాసం మొదలుకొని సంక్రాంతి పూర్తి అయ్యేవరకూ ముగ్గులతో ముంగిళ్ళను నింపుతూ ఉంటారు. సంక్రాంతి ముగ్గులను పూల రేకులతో, గొబ్బెమ్మలతోను అలంకరిస్తారు.
చుక్కల ముగ్గు
ముగ్గు పెట్టడానికి ముందు చుక్కలను పెట్టి, ఆ చుక్కలను కలుపుతూ పెట్టే ముగ్గు. చుక్కల సంఖ్యను బట్టి ఆ ముగ్గులను వివరిస్తారు.
రథం ముగ్గు
సంక్రాంతి సందర్భంగా ఇంటిముందు వేసే రంగుల ముగ్గులు వేసే పరంపరలో చివరి రోజున రథం ముగ్గును వేస్తారు. ఆ రథం ముగ్గుకు ఒక గీతను ముగ్గుతోనే కలుపుతూ పక్కింటివారి ఇంటిముందున్న రథం ముగ్గుకు కలుపుతారు. ఆ పక్కవారు కూడా తమ రథం ముగ్గుని తమ పక్క ముగ్గుతో కలుతారు.
ముఖ్య ఉద్దేశ్యం
సంక్రాంతి పండుగలో మూడు రోజులు ముగ్గు వేసే పండుగ, రంగవల్లుల పోటీలు ప్రతి ఊరిలో జరుగుతాయి. దీనివలన నలుగురు ఒకచోట చేరుతారు. సహృదయత, స్నేహశీలత అలవాటుపడుతుంది. అదే సమయంలో మహిళల్లో గల సృజనాత్మకనే కాకుండా లెక్కలు, గణితబద్ధంగానూ తార్కింగానూ ఆలోచించడం నేర్పిస్తుంది.
రవీంద్రనాథ్ ఠాగోర్ 1919లో రాసిన ‘బంగ్లర్ బత్ర’ అనే పుస్తకంలో పత్రం, పూజ విధానాలలో ‘అల్పన’ (ముగ్గు) గురించి ప్రస్తావించారు. లక్ష్మీకాంత్ ఝా అరిషన్ ‘మిథిల జానపద సంస్కృతి గురించి రాసిన రచనలలో రంగోలి ప్రస్తావన తెచ్చారు. ‘లాంగ్వేజ్ ఆఫ్ సింబల్స్’ అనే పుస్తకంలో గీత నారాయణన్, అర్చన శాస్ర్తీ దక్షిణ భారతంలో వున్న అనేక గుర్తులు, చిత్రాల చరిత్రని వివరించారు.
అలాగే హిందువుల వివాహాలు, పండుగలు, ఇంకా అనేక ముఖ్య మత సంబంధమైన కార్యక్రమాలలో ముగ్గులు వేయడం ఒక భాగం.
నాగరికత కొత్త పుంతలు వేస్తున్నా, కొత్తకొత్తవెన్నో కనుక్కుంటున్నా ఇంకా సంప్రదాయాన్ని వదలకపోవడం విశేషంగా పేర్కొనవచ్చు. ధనుర్మాసం నుంచి సంక్రాంతి అయ్యేదాకా వుండే ఈ ముగ్గులు సమూహాలను కలిపి ఉంచే గొప్ప వాహకం. ఇలాగే పది కాలాలపాటు అందరినీ కలుపుతూ ప్రజలు సంతోషదాయకంగా ఉంలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.

- పుష్యమీ సాగర్ 90103 50317