సబ్ ఫీచర్

ఓటు హక్కును కాపాడుకుందాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాణి కడుపులో నుండి రాజు పుట్టే సంస్కృతి నుండి ఓట్ల డబ్బాల నుంచి రాజు పుట్టే సంస్కృతికి తెరలేపిన ఓటు హక్కు, ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది రాయి. ప్రజలు నిర్మించుకున్న వ్యవస్థ మార్పుకై సమర్థవంతమైన వ్యక్తికి నాయకునిగా నిలబెట్టడానికి తమ అభిప్రాయాన్ని ఓటు హక్కు అనే ఆయుధం ఉపయోగిస్తూ ఎన్నికల్లో గెలిపించి చట్టసభల్లోకి పంపడం జరుగుతుంది. అనగా ఒక వ్యవస్థ నిర్మించడానికైన, కూల్చడానికైన సామాన్య ప్రజానీకంలో ఉన్న ఏకైక ఆయుధం ‘ఓటు హక్కు’, దేశ చరిత్రలో ఇది ఒక కీలక మైలురాయి. ఆంగ్లేయుల కాలంలో పరిమిత ప్రాతిపదికన భారతీయులకు కల్పించిన ఓటుహక్కును ధనిక, పేద మరియు కులము, మతము, లింగం అనే తేడా లేకుండా రాజ్యాంగం ద్వారా సార్వత్రిక వయోజన ఓటు హక్కును రాజ్యాంగం ద్వారా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భారతీయ పౌరులందరకి కల్పించడం జరిగింది. దేశ స్వతంత్ర వ్యవస్థలో ఆగస్టు 15, 1947లో ఆంగ్లేయుల కబంధ హస్తాల నుండి ఈ దేశ మట్టికి స్వతంత్రం వస్తే, జనవరి 26, 1950లో కులము, మతము, లింగము అనే చారిత్రక అడ్డుగోడలకు చరమగీతం పాడి మనుషులకు స్వతంత్రం సిద్ధించడం జరిగింది. తద్వారా రాజ్యాధినేతను ఎన్నుకొనే గణతంత్ర వ్యవస్థకు పునాది వేసిన గొప్ప పవిత్ర భారత రాజ్యాంగం. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 మరియు ఆర్టికల్ 19(1) ఎ ప్రకారం ఓటు అనేది రాజ్యాంగబద్ధ ప్రాథమిక హక్కుగా భారత రాజ్యాంగంలో పేర్కొని ఒక ఓటు ఒక విలువతో సమానత్వం ప్రస్తావించడం జరిగింది.
భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకుని పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం కల్పిస్తామని రాజ్యాంగ పీఠికలో పేర్కొని రాజ్యాంగ అంతర్లీన సూత్రాన్ని పీఠికద్వారా ప్రజలముందు ఉంచడం జరిగింది. భారతదేశంలో కులము, మతము, లింగము అనే చారిత్రక అడ్డుగోడలను కూకటివేళ్లతో కూల్చేసిన పవిత్రగ్రంథం భారత రాజ్యాంగం. రాజ్యాంగం ద్వారా ‘ఒక ఓటు ఒక విలువ’ రాజకీయ వ్యవస్థలో సాకారం అయినప్పటికీ సామాజిక, ఆర్థికవ్యవస్థలో నేటికి సాకారంకావడం లేదు. తండ్రి అంబేద్కర్ భారత రాజ్యాంగంలో ఓటుహక్కును ప్రవేశపెట్టి మన తల రాతను మార్చిన దేవుడు. ప్రజల సామాజిక, ఆర్థిక, అసమానతలే లక్ష్యంగా చేసుకొని నేడు రాజకీయ పార్టీల అభ్యర్థులు ఓటర్లకు ఎర వేస్తూ సామాన్య ప్రజానీకం యొక్క ఓటు అనే ఆయుధాన్ని చిదిమేస్తున్నారు. ధన ప్రవాహం ద్వారా గెలిచిన అభ్యర్థులు అవినీతి వైపు వెళుతూ సామాన్య ప్రజానీకం గొంతుకు తాళం వేసి అంధకారంలోకి నెడుతున్నారు. ప్రపంచంలోని ప్రజాస్వామ్య రాజ్యాంగ దేశాలు వేగవంతమైన అభివృద్ధి వైపు ప్రయాణిస్తుంటే, గడిచిన 71 వసంతాలు స్వతంత్ర భారతదేశం నేటికీ ఆశించిన స్థాయిలో అభివృద్ధికి నోచుకోక, కులము, మతము, వర్గం అనే తారతమ్యాలతో కొట్టుమిట్టాడడం జరుగుతుంది. అదేవిధంగా ధన బలం, అధికార బలంతో పరిపాలనను హస్తగతం చేసుకొని, చట్టసభల్లో వెళ్లి ప్రగతిశీల చట్టాలకు పాతరేసి భారత రాజ్యాంగంను సంక్షోభంలోకి నెట్టడం జరుగుతుంది.
ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో విపరీత ప్రలోభ సంస్కృతి వలన ఓటు అనే ఆయుధం బలైపోయి ప్రజాస్వామ్య స్ఫూర్తి రోజురోజుకూ దెబ్బతినడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో భారతీయ ఎన్నికల కమిషన్ మరియు రాజకీయ నాయకులు ధనస్వామ్యవ్యవస్థకి స్వస్తి చెప్పి, నవ నూతన జీరో బడ్జెట్ పాలిటిక్స్‌కు పునాది వేయవలసిన అవసరం ఉంది. అప్పుడే ఎన్నికలలో సామాన్య సమర్థవంతమైన నిస్వార్థ ప్రజానాయకుడు గెలుపొంది ప్రజల అవసరాలు తీరుస్తాడు. అదే విధంగా భారతదేశంలో ఓటు హక్కును ప్రసాదించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌ను అధికారికంగా ప్రచారం చేస్తూ, ఓటు హక్కు మరియు రాజ్యాంగ పీఠిక ప్రాముఖ్యతపై భారత ఎన్నికల కమిషన్ మరియు అధికార యంత్రాంగం విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగ రక్షణ మరియు అమలులో భాగంగా భారత రాజ్యాంగం యొక్క ప్రాశస్త్యాన్ని తెలియజేస్తూ, రాజ్యాంగ ప్రతిమలు మరియు అంబేద్కర్ ప్రతిమ ప్రతి జెండా దగ్గర పెట్టాలని దళిత శక్తి ప్రోగ్రాం జిల్లా స్థాయినుండి రాష్టస్థ్రాయి వరకు ప్రాతినిధ్యమివ్వడం, తండ్రి అంబేద్కర్ రాసిన రాజ్యాంగ స్ఫూర్తికి నిజమైన నివాళి. అదేవిధంగా భారత రాజ్యాంగం కల్పించిన విద్య, వైద్యం, ఉపాధి అనే హక్కులను ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనార్టీ వర్గాలకు రాజ్యాంగబద్ధంగా కల్పించాలని దశాబ్ద కాలం క్రితం డాక్టర్ సిహెచ్. విశారదన్ మహరాజ్‌గారి సారధ్యంలో ఆవిర్భవించిన దళిత శక్తి ప్రోగ్రామ్ అనే మహా అదిగల వ్యక్తిత్వ నిర్మాణ ఉద్యమం గొప్ప ప్రజాపోరాటాన్ని తమ భుజస్కంధాలపై వేసుకొని చేయడం అశేష ప్రజానీకం కన్నీళ్ళకు, బాధలకు నిజమైన గణతంత్రంగా భావించవచ్చు.

- సంపతి రమేష్ మహారాజ్, 9959556367