సబ్ ఫీచర్

వంగ దేశంలో కుక్కమూతి పిందెలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటి జాదవ్‌పూర్ యూనివర్సిటీని స్థాపించిన మహాత్ముడు చిత్తరంజన్‌దాస్. ఇది ప్రాథమికంగా ఉన్నత పాఠశాలగా నెలకొన్నది. ఇప్పుడు మార్క్సిస్టుల ఉసిళ్ళపుట్టగా రూపొందింది. సమస్త భారతదేశానికి మహాత్మగాంధీ ఎంత మహనీయుడో ఆనాటి బెంగాల్‌కు చిత్తరంజన్‌దాస్ అంతటి మహాత్ముడు. ఆయన స్థాపించి, నూరు సంవత్సరాలలో ఎదిగి విశ్వవిద్యాలయ స్థాయిని సంపాదించుకున్న సంస్థ ఇపుడు దేశవ్యతిరేక కార్యకలాపాలకు, విద్రోహపు కుట్రలకు నిలయమైంది. అంతకన్నా ఆధునిక భారతదేశానికి విషాదకరమైన పరిణామం ఏముంది? ఎక్కడుంది?
ఈ కలకత్తా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి ఛానె్సలర్‌గా, స్నాతకోత్సవపు పెద్దగా, యజమానిగా వ్యవహరించవలసిన రాజ్యాంగబద్ధమైన విధులు నిర్వర్తించవలసిన జగదీశ్ థక్కర్‌ను వేదిక దిగిపోయే దాకా విద్రోహ నినాదాలు హోరెత్తించిన విద్యార్థులను ఏమనాలి? మార్క్సిస్టులను ఏమనుకోవాలి? విభిన్నమైన అభిప్రాయాలను, భేదాభిప్రాయాలపట్ల సామరస్యాన్ని ప్రజాస్వామ్యపు వౌలిక లక్షణాలని ఘోషించే ఉగ్ర కమ్యూనిస్టు పంథీయులు, సాధారణ మార్క్స్ భావదాస్య పంథీయులు ఈ దేశద్రోహ సంఘటనగూర్చి పల్లెత్తు మాటకూడా పలకకపోవటం గూర్చి ఏమనాలి?
దౌర్జన్యం, క్రోధం, హింస, గూండాగిరి, రౌడీయిజం ప్రజాస్వామిక ప్రాథమిక లక్షణాలా? సమస్త భారతావనికి ఒకనాడు వంగదేశం స్వాతంత్య్రోద్యమంలో ఆచార్య స్థానం వహించింది. జాతీయ పునరుజ్జీవనం అక్కడే ప్రారంభమైంది. అక్కడ నూటికి తొంభై మంది దేశభక్తులుండేవారు. స్వాతంత్య్రోద్యమ విప్లవవీరులు నడయాడిన పురిటిగడ్డ అది. ఇంగ్లీషు భాషను, ఇంగ్లీషు సారస్వతాన్ని ఇంగ్లీషువారి సంస్కృతిలోని స్వేచ్ఛా స్వాతంత్య్రాలను ఉదారాశయాలను, వారికే బోధించగల మేధావులక్కడ జన్మించారు. ఇంగ్లీషులో పత్రికలు నిర్వహించినవారు మొదట అక్కడే ప్రభవించారు. సామాజిక, సాంస్కృతిక, సనాతన, భారతీయ ఉదారవైఖరి అక్కడనుంచే మొదట భారతదేశాన్ని ప్రభావితం చేశాయి.
రాజారామ్మోహన్‌రాయ్ బ్రిష్టల్ నగరానికి ఓడలో ప్రయాణిస్తూ, మహారధిలో ఎదురుపడ్డ బ్రిటిషునౌకపై వారి పతాకం రెపరెపలాడుతుండగా చూసి, అశ్రుసిక్త గద్గద కంఠంతో నా దేశానికి ఈ సౌభాగ్యం ఎన్నడో! అని పరితపించినట్లు భారతదేశ స్వాతంత్య్రోద్యమ చరిత్రకారులు స్మరించుకున్నారు. అటువంటిది ఇప్పుడు వంగ దేశానికి ఘోరమైన దుర్గతి సంభవించింది.
వంగదేశంలో ఆనాడు ఎటువంటి మహాపురుషులుద్భవించారు! స్వాతంత్య్రోద్యమానికి తమ ప్రాణాలు సైతం సమర్పించారు!
ఇప్పుడు భారతదేశాన్ని పరిపంథుల, శ్రాతవ నివహానికి అప్పగించి చోద్యం చూడాలని చూస్తున్నారు అక్కడి దౌర్జన్య తరుణ యువకులు. ఇటీవలే అర్థశాస్త్రంలో నోబెల్ పురస్కార గ్రహీత అయిన అభిజిత్ వినాయక బెనర్జీ, ఈ దేశం మతాంతరం కావటానికి చిన్నమెత్తు అవకాశంకూడా లేదని బూకరిస్తున్నారు. ఆయనకు చరిత్రగతి అంతా బాగా విదితమైనట్లు!? పాకిస్తాన్ ఏ విధంగా రూపొందింది? ఆయన చదువుకోలేదా?
ఒకనాడు లాహోర్ నగరం పూర్తి భారతీయ నగరం. అక్కడ పంజాబ్ విశ్వవిద్యాలయంలో శతాధికానేక సంస్కృత తాళపత్ర గ్రంథాలుండేవి. తమిళ మాధ్యమంలో ప్రాథమిక పాఠశాలలుండేవి. అఖిల భారతదేశ ఆయుర్వేద విజ్ఞాన పరిషత్ వార్షిక సమావేశానికి దివి గోపాలాచార్యులవారు అధ్యక్షత వహించారు. పంజాబ్ విశ్వవిద్యాలయ ప్రాచ్య భాష పరిశోధన విభాగంలో తెలుగు లిపిలో ఉన్న అనేక తాళపత్ర గ్రంథాలుండేవనీ, వాటికి తాను వివరణాత్మక సూచిక రూపొందించాననీ తిరుమల రామచంద్ర స్వీయచరిత్రలో ‘లావణ్యం ఒలికే లాహోర్’ అనే ప్రకరణంలో ఆనాటి దేశకాల పరిస్థితులు వివరించారు. అట్లానే ఈ దేశాన్ని లాహోర్‌లా పరివర్తింపచేయాలని వామపక్ష కుతంత్ర మేధావుల ఆలోచన అని విస్పష్టంగా కనపడటం లేదా?
వి.ఎస్. నయపాల్ నిన్నటిమొన్నటివాడు. ఈయన ఇంగ్లీషు సాహిత్య సారస్వత మేధావి. తన రచనలతో నోబెల్ పురస్కారం పొందినవాడు. ‘బియాండ్ బిలీఫ్’ (నమ్మలేని నిజాలు) అనే తన గ్రంథంలో భారతదేశం స్వాతంత్య్రం సముపార్జించిన తరువాత ఆరు దేశాలు ముస్లిమీకరణ ఎట్లా చెందాయో దిగ్భ్రాంతికరమైన వాస్తవాలను ఏకరువుపెట్టాడు. ఇండోనేషియా, మలేషియా, ఇరాన్, ఆప్ఘనిస్తాన్ అటువంటి ముఖ్య దేశాలు ఈ దేశద్రోహాన్ని ఎట్లా సాధించారో బరాక్ ఒబామా స్వీయ చరిత్రాత్మకమైన తన గ్రంథాలలో ‘డ్రీమ్ ఫ్రం మై ఫాదర్’, ‘ది అడాసిటీ ఆఫ్ హోప్’ అనే గ్రంథంలో ప్రసక్తం చేశాడు. ఇందులో కమ్యూనిస్టు దుష్టపాత్రను విశదీకరించాడు.
ఇరాన్ ఒకప్పుడు పూర్తిగా వేద సంస్కృతీయమైన దేశం. వాళ్ళ వేదం పేరు ‘జెండవెస్తా’ (జరత్కృష్ట). వారి జాతీయ దైవం పరశురాముడు. వారి యజ్ఞయాగ సాంస్కృతిక ప్రతీక అగ్ని. వారు అగ్ని పూజకులు. ‘జెండవెస్తా’ను సర్వసహితంగా పఠించగల ప్రజావిభవశాలి మన వేదం వెంకటాచలమయ్యగారని తెలుగువారి విజ్ఞాన సరస్వంలో ఉంది. అందువల్లనే ఎక్కడైనా గొప్ప అగ్నిప్రమాదం సంభవించినప్పడు, దాహదావానల సంఘటన చెలరేగినప్పుడు ‘పరుశురామప్రీతి’ అని దీనిని తెలుగువారు చెప్పుకుంటారు. భారతదేశం ఇరాన్ సరిహద్దులలో ‘శిబి’ అనే పట్టణం ఉందని తిరుమల రామచంద్ర స్వీయచరిత్రలో ప్రస్తావిస్తూ ఆ నగరాన్ని తాను దర్శించినట్లు చెప్పారు.
వి.ఎస్. నయపాల్ తన గ్రంథంలో ఎర్రపార్టీ వారు ఇరాన్ రాజరికపు తిరుగుబాటుదారులతో మసీదులకు వెళ్ళి మోకరిల్లేవారు అని ప్రసక్తం చేశాడు. కమ్యూనిస్టుల జీవితధ్యేయం దేశంలో సంక్షోభకర పరిస్థితులు, అలజడులు, తిరుగుబాట్లు సంభవిస్తే తమ పబ్బం గడుపుకోవటం అని వి.ఎస్. నయపాల్ ఉవాచ. ఇప్పుడు అటువంటి పరిస్థితులు సృష్టించాలని గంపెడాశతో ఉన్నారు మార్క్సిస్టులు.
సరే! మిర్జ్ఫార్ పుణ్యమా అని వంగదేశం బ్రిటిషువారి సామ్రాజ్య భుక్తమైంది. మమతాబెనర్జీ సాచివ్యంవల్ల ఇప్పుడేమీ కానున్నదో!?
వంగదేశం ఎటువంటి పుణ్యభూమి ఒకప్పుడు!!
రాజారామ్మోహన్‌రాయ్, ద్వారకానాథ్ ఠాగూర్, రవీంద్రనాథ ఠాగూర్, అరవిందయోగి, వివేకానందుడు, రామకృష్ణ పరమహంస, కేశవచంద్రసేన్, క్రిష్టదాస్‌పాల్ (గాంధీజీ ఈయనను ఋషితుల్యుడని అభివర్ణించాడు).
జడేంద్రనాథ్ బోస్ అండమాన్ ఖైదీలు అనుభవిస్తున్న నరకానికి నిరసనగా 72 రోజులు ప్రాయోపవేశం చేసి అమరుడైనాడు. వందేమాతరం ఉద్యమంలో వంగదేశపు వీరయువకులు ప్రాణత్యాగం చేశారు. ఉరికంబాలను ఆశే్లషించారు.
బెనర్జీలు, చటర్జీలు, సేన్‌లు, సీల్‌లు వంగభూమికి చిరయశస్సు తెచ్చారు. ఇప్పుడు మమతాబెనర్జీ చల్లని పాలనలో విద్యార్థులు రాజ్యాంగ బద్ధమైన రాష్ట్ర గవర్నరును ఘోరంగా అవమానించారు. మానిక్‌తోలా హత్య కేసులో కన్నహయలాల్ ఉరి కంబం ఎక్కారు.
నేడు వంగదేశం ఏ మార్గదర్శనం చేస్తుందో రేపు అఖిల భారతం ఆ దారిని నడుస్తుంది అని ఆ భాషణకు లక్ష్యమైనది ఒకనాటి వంగ దేశం. లాల్ బాల్ పాల్‌లో బిపిన్‌చంద్రపాల్ వంగదేశ శిరోభూషణం. తెలుగునాట స్వాతంత్య్రోద్యమ కీలలను రగిల్చినవాడు నేడో! వంగదేశం అరణ్యక జాతుల ఆలవాలమైంది. వి.ఎస్. నయపాల్ ‘బియాండ్ బిలీఫ్’ అనే గ్రంథం చదివితే భారతదేశపు రేపు ఏమి ఎదుర్కోబోతున్నదో విశదమవుతుంది.
‘స్వస్తిప్రజాభ్యాం పరిపాలయంతం’ అని ముక్కుమూసుకుని జపిస్తూ కూచుంటే భారతదేశ సౌభాగ్య చిరస్వప్నం ఏమవుతుందో, విషదోద్విగ్న హృదయులై మాతృదేశ పరిరక్షకులు ఆలోచిస్తారుగాక!!

- అక్కిరాజు రమాపతిరావు