సబ్ ఫీచర్

నిరుద్యోగులను పట్టించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక వూడిపోయిందన్నట్లుంది తెలంగాణ ప్రభుత్వ ఆలోచన. నిధులు, నీళ్లు, నియామకం కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందని ప్రకటించిన సిఎం కేసిఆర్ ప్రభుత్వ ఉధ్యోగుల పదవీ విరమణ వయసును 58నుంచి 60కి పెంచనున్నారని వార్త పత్రికలలో కథనాలు వస్తున్నాయి. సమైక్యాంధ్ర పాలనలో 12 ఏళ్లపాటు ఉద్యోగ నియామకాలు సాగలేదు. పోలీసు, టీచర్లు, హెల్త్ డిపార్టుమెంట్ వంటి కొన్ని శాఖల్లోనే పరిమిత పోస్టులకు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్లు ఇచ్చి 60 ఏళ్ల సమైక్య పాలనలో తెలంగాణలోని జిల్లా, జోనల్ స్టేట్ లెవెల్ పోస్టుల్ని కుట్రలు, కుతంత్రాలతో దొడ్డిదారిన కొల్లగొట్టుకుని పోయారు.
1956 ఫిబ్రవరి 20న కుదిరిన పెద్ద మనుషుల ఒప్పం దం నీరుకార్చారు. తెలంగాణ ప్రాంతానికి 14 అంశాలలో రక్షణలు అమలు చేయలేదు.1985లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 610 జీవో జారీ చేసారు. 1976 అక్టోబర్‌లో 5, 6వ జోన్‌లలో జోనల్, జిల్లా నియామకాలు తెలంగాణేతరులకు సుమారు లక్షకు పైగా ఉద్యోగాలు పొందారు. వారిని ఆంధ్రకు పంపించి ఆ ఖాళీల్లో తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాల్సి వుంది. 610 జీవో ఇచ్చింది సీమాంధ్రులే. అమలు ఎలా చేస్తారు? ఇప్పటికి జూరాల, శ్రీశైలం ఎడమగట్టు శ్రీరాంసాగర్‌లో వున్న ఆంధ్ర ఉద్యోగులు, గెజిటెడ్‌లను హైదరాబాద్ సచివాలయం, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో బోగస్ స్థానిక సర్ట్ఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వారిని ఆంధ్రకు పంపలేదు. 1986 జూన్ 30లోగా 610 జివోను అమలు చేస్తామన్న ఆంధ్ర పాలకులు జివో ఇచ్చి మరిచిపోయారు. 1956-68 మధ్య 22వేల మంది ఆంధ్రులు తెలంగాణాలో నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగాలు పొందారు. 1969 జనవరి 19న కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేసి స్థానికేతరులను బదిలీ చేయాలని నిర్ణయించి జీవోనెం 36ను 21-1-69న జారీ చేసింది. ఇదీ అమలు కాలేదు.1985లో ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సీనియర్ ఐఎఎస్ అధికారులతో కమిటీ వేసారు. వారు 58,952 మంది ఆంధ్రులు అక్రమంగా తెలంగాణలో ఉద్యోగాలు చేస్తున్నారని నివేదిక ఇచ్చారు. 610 జీవో జారీ చేసి అమలు జరపడం లేదని తెలంగాణ ఉద్యోగులు మొరపెట్టుకోగా గిర్‌గ్లాని విచారణ కమిటీని నియమించారు. 2001లో గిర్‌గ్లాని కమిటీ నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టారు. 5 లక్షల పైచిలుకు అక్రమ ఉద్యోగులు వున్నారని కమిటీ తెలిపింది. తెలుగుదేశం ప్రభుత్వం ఒక్క తప్పును సరిచేయలేదు.
2001 ఏప్రిల్ 27న ప్రస్తుత ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ రాష్టస్రమితిని స్థాపించారు. తెలంగాణకు నీరు, నిధులు నియామకాల్లో జరిగిన అన్యాయాల గురించి గొంతెత్తి ప్రచారం చేసారు. 1995నుంచి 2014 మధ్య సీమాంధ్ర ప్రభుత్వం ప్రతి ఏటా రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. ప్రభుత్వ ఖాళీలను రెగ్యులర్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయకుండా అర్హులైనవారికి అన్యాయం చేసారు. చదువుకు తగ్గ ఉద్యోగాలు ఇవ్వలేదు. ఎన్ని ఏండ్లకు నోటిఫికేషన్ ఇస్తారో, ఇచ్చారో ఎవరికీ తెలియదు. రెగ్యులర్ ఉద్యోగాలను కాంట్రాక్టు అవుట్‌సోర్స్, పార్టుటైమ్ పద్ధతిలో చంద్రబాబు ప్రభుత్వం నియమించింది. చంద్రబాబు సర్కారీ కొలువులను ప్రైవేట్‌పరం చేసారు. స్వయంగా వక్త అయిన కెసిఆర్ 2014 ఎన్నికల్లోను, అంతకు ముందు తెలంగాణ వ స్తేనే ఇంటికి ఉద్యోగం వస్తుంది, తెలంగాణ నిరుద్యోగుల తలరాత మారుతుందని తెలంగాణ నిరుద్యోగులకు పుష్కలంగా నౌకరీ కల్పిస్తామని ఎన్నికల సభల్లో ప్రసంగించి ప్రతి ఇంట్లోని ఓట్లు పొందారు. సీట్లు పొందారు. తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు. 1956 నుంచి 2017 వ రకు 66 ఏళ్లలో జరిగిన అన్యాయాలు ఇంకా తెలంగాణ సర్కారు సరిదిద్దలేదు. తెలంగాణ వచ్చింది. నా కొడుకు నా బిడ్డకు సర్కారీ కొలువు వస్తుందని కొండంత ఆశతో తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు.
తెలంగాణ వచ్చిన తర్వాత ఖాళీగా వున్న రెండు లక్షల ఖాళీల భర్తీ చేయలేదు. కేవలం 30వేల ఉద్యోగాలకే మొక్కుబడి ప్రకటన ఇచ్చి చేతులు దులుపుకున్నారు. కమలనాధన్ కమిటీ పేరు చెప్పి కాలయాపన చేస్తున్నారు. నియామకాల కోసం తెలంగాణ పోరాటం జరిగిందని ఎన్నికల్లో చెప్పి ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చిన కెసిఆర్ ప్రభుత్వం నిరుద్యోగులు, విద్యార్థుల నోట్లో మన్నుకొట్టే పనికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే 2 లక్షల ఖాళీలుండగా ఈ ఏడాది 50వేలమంది రిటైర్ అవుతున్నారు. వచ్చే ఏడాది మరో 10వేల మంది రిటైర్ అవుతారని తెలంగాణ సర్కార్ ప్రకటించింది. మొత్తంమీద 2019లోగా లక్షకుపైగా తెలంగాణ ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్‌మెంట్ వయసు 58 ఏళ్లుగా వుంది. పక్క రాష్ట్రంలో బాబు సర్కార్ 60కి పెంచి నిరుద్యోగుల పొట్ట కొట్టింది. బాబు సర్కారుమీద నిరుద్యోగులు, ఉద్యోగులు తీవ్ర వ్యతిరేకతతో వున్నారు. తెలంగాణ ఉద్యమంలో పోరాడినవారు విద్యార్థులు, యువత కావడం గమనార్హం. ప్రతి ఏటా ఖాళీగా వున్న పోస్టులను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేస్తారని ఆశపడినవారికి నిరాశే మిగులుతోంది. నిరుద్యోగులు, యువత, విద్యార్థులు తెలంగాణ ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొకరికి ఉద్యోగ విరమణ సమయంలో 30లక్షల దాకా ప్రభుత్వం చెల్లించాలి. ప్రతి నెల పెన్షన్లు ఇవ్వాలి. రిటైర్‌మెంట్ 58 ఏళ్లకు అయిన ఉద్యోగికి ప్రతి నెల కొన్ని వేల పించన్ వస్తుంది. రిటైర్‌మెంట్ తర్వాత 30నుంచి 40 లక్షల దాకా డబ్బు వస్తుంది. రిటైర్‌మెంట్ ఉద్యోగి నెలకు 60వేల జీతం ఇవ్వాల్సి వస్తుంది. అతని స్థానంలో నలుగురు నిరుద్యోగులకు జీవనోపాథి ఇవ్వచ్చు. రిటైర్‌మెంట్ వయసు పెంచకపోతే 4వేల కోట్లు చెల్లించడం తమ వల్ల కాదని తెలంగాణ సర్కారు అంచనా వేస్తున్నది. పదవీ విరమణ పొందే వారి సంక్షేమం కావాలి కాని నిరుద్యోగులకు, ఉద్యోగాలు కల్పించే విషయం తెలంగాణ ప్రభుత్వం మరిచిపోయినట్లుంది. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రంలో ఉద్యోగాలకోసం పదిలక్షల మంది ఎదురు చూస్తున్నారు. పదవీ విరమణ పెంపు ఎవరికి లాభం? ఉద్యోగులకా? సర్కారుకా?
నిరుద్యోగికి ఆకలి బాధ, రిటైర్ అయ్యే ఉద్యోగికి అరగని బాధ. పిల్లల పెళ్లిళ్లు అవుతాయి, ఇల్లు కట్టుకుంటాడు, జీవించడానికి పెన్షన్ ఉంటుంది. కానీ నిరుద్యోగి గురించి కెసిఆర్‌కు తెలియదా? గ్రూప్ 1నుంచి 4 దాకా రెండు లక్షల ఖాళీలు నింపడానికి బడ్జెట్ లే దంటారా! 2016లో దిగిపోయే వారిని రెండుఏళ్లు పెంచితే 2018లో దిగిపోతారు. అప్పటికి 11వ వేతన సవరణ సంఘం పిఆర్‌సి అమలు చేయాల్సిన నేపధ్యంలో ప్రభుత్వం ఆర్థిక లోటును భరించాల్సి వుంటుంది.

-రావుల రాజేశం