సబ్ ఫీచర్

జ్ఞానపంచమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనం ఇంద్రధనుస్సు రంగుల అందాలను కనుల పండుగగా చూసి ఆనందించగలుగుతున్నాం. కోకిలమ్మ పంచమ స్వర గీతికల మాధుర్యాలను వీనులవిందుగా విని తన్మయత్వం పొందగలుగుతున్నాం. షడ్రసోపేతమైన ఆహారాలలను నోరారా భుజించి సంతృప్తిని పొందగలుగుతున్నాం. కుసుమకోమలమైన పూబోడి స్పర్శాసుఖాలలో, ఆనంద సముద్రంలో ఓలలాడగలుగుతున్నాం. మనకు ప్రపంచాన్ని చూపించేవి కన్నులు, శబ్దాలను వినిపించేవి చెవులు, వాసనలను చూపించేది ముక్కు, రుచులను చూపించేది నాలుక, స్పర్శను తెలిపేది చర్మం. ఈ ఐదూ ‘జ్ఞానేంద్రియాలు’. వీటిని పంచేంద్రియాలు అని కూడా అంటారు.
అయితే కొందరు కన్నులు ఉండి కూడా చూడలేరు. చెవులు ఉండి కూడా వినలేరు. ముక్కు ఉండి కూడా వాసన చూడలేరు. జిహ్వ ఉండి కూడా రుచి తెలుసుకోలేరు. చర్మం ఉండీ స్పర్శజ్ఞానం పొందలేరు. దీనికి కారణం ఏమిటో తెలుసా? ఈ జ్ఞానపంచమికి అధిపతి మెదడు. మెదడులో ఈ ఐదు ఇంద్రియాలకూ ప్రత్యేకంగా ఐదు కేంద్రాలు ఉన్నాయి. పంచేంద్రియాలనుంచి వాటి కేంద్రాలకు వార్తలు మోసుకురావటానికీ, కేంద్రాలనుంచి ఆజ్ఞలు తీసుకురావటానికీ తంతి తీగలవంటి నాడులు ఉన్నాయి. కాబట్టి ఈ బాహ్యమైన ఇంద్రియాలలోగానీ, కేంద్రాలనుంచి ఆజ్ఞలు తీసుకురావడానికీ తంతి తీగలవంటి నాడులు ఉన్నాయి. కాబట్టి ఈ బాహ్యమైన ఇంద్రియాలలోగానీ, నాడులలోగానీ, మెదడు కేంద్రాలలోగానీ దోషాలుంటే, ఇంద్రియాలు ఉన్నా కూడా ఇంద్రియజ్ఞానం ఉండదు. పంచేంద్రియాలు శరీరంలో ఇతర మామూలు అవయవాల వంటివి కావు. ఇవి ప్రత్యేకమైన అవయవాలు. ఇవి మెదడులో భాగాలనే చెప్పాలి. ఈ ఇంద్రియాలలో ఏ మాత్రం ఒడుదుడుకులు వచ్చినా ఈ జ్ఞానేంద్రియం దెబ్బతింటుంది. కొన్ని వ్యాధులలో జ్ఞానేంద్రియాలలోనో, వాటి జ్ఞాన నాడులలోనో, మెదడులోని జ్ఞాన కేంద్రంలోనో మార్పులు రావచ్చు. ఈ మార్పులవల్ల ఆ ఇంద్రియ జ్ఞానంలో కూడా మార్పులు వస్తాయి. ఉదాహరణకు కంటిలోగాని, కంటి నాడిలోగాని, కంటి కేంద్రంలోగానీ మార్పులు వస్తే చూపులో మార్పులు వస్తాయి.
కనుల పండుగగా ఉండే దృశ్యాలు, వీనులవిందుగా వుండే శ్రావ్యాలూ, జిహ్వకు రుచిగా ఉండే భక్ష్యాలూ, ముక్కుకు ఇంపైన వాసనలూ, మేనుకు సుఖకరమైన స్పర్శల ఆనందాలు అనుభవించాలనే మానవుడు ఉవ్విళ్లూరుతుంటాడు. కానీ మన పూర్వీకులు, మహాజ్ఞానులూ ఇంద్రియాలను అరికట్టడానికి ప్రయత్నించేవారు. ఇంద్రియ నిగ్రహంవల్ల మనిషి ఉన్నత స్థాయిని చేరుకోగలడు. ఇంద్రియాలను నిగ్రహించి, అరిష్వర్గాలను జయించి, యోగి పుంగవులు ముక్తిమార్గాన్ని అనే్వషిస్తున్నారు. ఈ ప్రయత్నాన్ని ఆధునికులు కొందరు హేళన చేస్తారు. అనుభవించగల శక్తి ఉండి అనుభవించకపోవడమేమిటి? అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట శని ఉండటమేమిటని ఈ మెట్ట వేదాంతుల వాదం.
ఏది ఎలా ఉన్నప్పటికీ పంచేంద్రియాలు మానవుడి విజ్ఞానాన్నీ, వివేకాన్నీ పెంపొందించి వికాసాన్ని కలిగించే మాట మాత్రం నిజం. కావున పంచేంద్రియాలకు సుఖం ఉంటే సంపూర్ణ మానవుడుగా పరిగణించవచ్చు.

-డా.దన్నాన అప్పలనాయుడు 8919413432