సబ్ ఫీచర్

సామాజిక చైతన్యం అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎన్ని రాజకీయ పార్టీలు నాయకులు మారినా భారతదేశంలో మాత్రం అధికశాతం మంది పేదరికంలోనే మగ్గుతున్నారు. వీరి జీవితాల్లో మెరుగుదల కనిపించడంలేదు. అభివృద్ధి పథంలో భారత్ వెలిగిపోతోందంటున్నా, అది కొన్ని రంగాలకు మాత్రమే పరిమితం. రాజకీయ పెద్దన్నలు మాత్రం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమాన్ని విస్మరించి, తమ వ్యక్తిగత ఆస్తులను కూడ బెట్టుకోవడానికే ప్రాధాన్యమిస్తున్నారు. ఓట్లకోసం కులాలు, మతాల మధ్య చిచ్చుపెడుతూ తాము మాత్రం వైభోగాలలో తేలిపోవడం నేటి రాజకీయ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య. ఇటువంటి వారి చర్యలవల్ల దేశం ఇంకా
పేదరికం, నిరుద్యోగం, ఆర్థిక, సామాజిక అసమానత, హింసాకాండలతో కునారిల్లుకొని పోతున్నది. భారతదేశంలో హత్యలు, అత్యాచారాలు, దం దాలు, దోపిడీలు, దౌర్జన్యాలు, కబ్జాలు, మోసాలు, నేరాలు దళారీ వ్యవస్థ, వంటివి విపరీతంగా పెరిగిపోయాయ. చిన్నపిల్లలో అక్షరాస్యత అనుకున్న ప్రమాణాలను సాధించడంలేదు. బడి ఈడు పిల్లల్లో అత్యధికులు ఇంకా కుటుంబ పోషణ నిమిత్తం కూలిపనులకు వెళ్లడం సాధారణంగా గ్రామాల్లో ఇప్పటికీ కనిపిస్తోంది. ప్రైవేటు విద్య వూపందు కోవడం, కునారిల్లుకు పోతున్న ప్రభుత్వ విద్య బడుగు వర్గాలకు ఆశని పాతంగా మారింది. చదివించే ఆర్థిక స్థోమతలేని వారు తమ పిల్లల్ని పనుల్లో పెడుతున్నారు.
పోలీసు వ్యవస్థలు పూర్తిగా రాజకీయ పెద్దన్నల సత్రాలుగా మారుతున్నాయి. వెనకబడిన తరగతులకు అందించే సహాయాలపై ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమైంది. రాజకీయ పెద్దన్నల పిడికిలిలో చట్టం, ధర్మం, న్యాయం నడుస్తున్నది. పెద్దలకు ఒక న్యాయం పేద వాడికి ఒక న్యాయం జరుగుతుండటం ప్రస్తుతం సర్వసాధారణమైపోయంది. చట్టం, న్యాయం, వ్యవస్థ, సామాజికత ధర్మం డబ్బుకు అవినీతికి అమ్ముడుపోతోంది. భారతదేశ రాజకీయ వ్యవస్థ పూర్తిగా దుర్గంధభూయష్టమైంది. నైతికతకు, నీతి నిజాయతీలకు స్థానమేలేదు. ఉగ్రవాదం, ఫ్యాక్షన్, మాఫి యా విద్రోహ అసాంఘిక కార్యక్రమాలు అధికమైపోతున్నాయి. ఇవి సా మాజిక అశాంతికి కారణమవుతున్నాయ. వేధింపులు, గృహహింస, విద్వేషాలు పెచ్చుమీరుతున్నాయి. పేరుకే సెక్యులరిజం, ఎవరి అనుకూలంగా వారు దానికి భాష్యం చెబుతున్నారు. ఫలితంగా మెజారిటీ ప్రజలు ఇబ్బం దులు ఎదుర్కొనక తప్పడంలేదు. ఓటు బ్యాంకువైపే సెక్యులరిజం నిర్వచ నాలు ఉంటున్నాయ.
విద్యావిధానంలో చోటుచేసుకున్న పుణ్యమాని విద్యార్థులకు దేశం, సమాజం, ప్రపంచం పట్ల అవగాహన కొరవడి కేవలం సాఫ్ట్‌వేర్ లేదా మరే ఇతర రంగాల్లో లక్షలు ఏవిధంగా గడించవచ్చునన్న ఆలోచనతోనే తమ విద్యావ్యాసంగాలను కొనసాగిస్తున్నారు. అంది వచ్చే ప్రతి అవకాశాన్ని డబ్బుగా ఏవిధంగా మలచవచ్చుననేదే వారి ఆలోచన తప్ప మరోదానిపై వారి దృష్టి లేనేలేదు. విజన్, టెక్నాలజీ, ఫైబర్‌గ్రిడ్, డిజిటలైజేషన్ గప్పాలు పేద ప్రజల ఆకలిని తీర్చలేకపోతున్నాయి. భారతదేశంలో ఉప్పు, పప్పు ఇతర ఆహార పదార్థాల ధరలు చుక్కలనంటుతున్నాయ. ప్రభుత్వం చెప్పే సరికొత్త ద్రవ్యోల్బణం లెక్కలు, సామాన్యులకు కొరుకుడు పడటం లేదు. ఈ లెక్కల ప్రకారం నిత్యావసర వస్తువుల ధరలు తగ్గాలి. కానీ వాస్తవం అందుకు పూర్తి భిన్నం. ఇది ఏలినవారికి తెలియనిది కాదు. కానీ ఏదో విధంగా ప్రజలను మభ్యపెడుతూ కాలంగడపడమే వారి లక్ష్యం. అధి కారాన్ని మాత్రం వదులుకోవడం వారికి ఎంతమాత్రం ఇష్టం ఉండదు. దేశ వ్యవస్థలో పూర్తి మార్పు రావాలి. ఇందుకు ప్రజల్లో చైతన్యం అత్యంత అవసరం. చైతన్య రహిత సమాజం నుంచి ఏమీ ఆశించలేం. ప్రభుత్వం సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే చైతన్య కార్యక్రమాలు అమలు పరచాలి.

- డి.చాంద్‌బాష