సబ్ ఫీచర్

వినూత్న పద్ధతులతో విద్యాబోధన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిన క్రమంలో ‘ఆంగ్లం’ అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్నది. ప్రపంచ జ్ఞానానికి పునాది వేస్తున్న ఆంగ్ల పరిజ్ఞానం నేడు ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోను ఉన్నత ఉద్యోగాల సాధనలో కూడా కీలక పాత్ర వహిస్తుండడంలో సందేహం లేదు. ప్రపంచ ఆధునిక సమకాలీన విజ్ఞానమంత కూడా ఆంగ్లంలో నిక్షిప్తం అవుతున్న నేపథ్యంలో ఆంగ్లభాష కేంద్రంగా నేడు అనేక ‘ప్రైవేట్ మరియు కార్పొరేట్ పాఠశాలలు’ నెలకొల్పి పట్టణ ప్రజల పిల్లలతోపాటు గ్రామీణ ప్రాంతంలోని బడుగుబలహీనవర్గాల పిల్లలను సైతం ఇంగ్లీష్ విద్యకు ఆకర్షితులనుచేస్తూ, విద్య వ్యాపారానికి పునాది వేస్తున్నారు. ఆంగ్లమాధ్యమం అనేది ప్రతిష్టాత్మకమైన గొప్ప చదవని గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారంచేస్తూ, చదువంటే ఆంగ్ల పదజాలము, చదువంటే బూట్లు, చదువంటే టై మరియు బెల్ట్, చదువంటే హోంవర్క్ అనే భౌతిక ప్రపంచాన్ని తల్లిదండ్రులకు పరిచయంచేసి పిల్లల మానసిక ప్రపంచాన్ని మసకబారుతున్న ప్రైవేట్ పాఠశాలలు కోకొల్లలుగా విలసిల్లాయి. అదేవిధంగా ఇష్టారీతిన ఫీజులతో నిబంధనలకు విరుద్ధంగా నాణ్యతాప్రమాణాలు లేకుండా నడిపిస్తూ విద్యాహక్కు చట్టాన్ని తుంగలో తొక్కుతున్నారు.
‘అమ్మభాష కమ్మదనం’ అంటూ మాతృభాషకు ప్రాముఖ్యత ఇస్తూ పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలకు ప్రాముఖ్యతనిస్తూ విద్యను అందిస్తున్న ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులు లేక వెలవెలబోతున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వ బడులను రక్షించుకోవటానికి ఒక ప్రజాఉద్యమంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు సమాజ భాగస్వామ్యంతో ప్రాథమిక స్థాయినుండే ఆంగ్లమాధ్యమానికి పునాదివేస్తూ ప్రైవేట్ పాఠశాలల సూత్రాన్ని అనుసరిస్తున్న ప్రభుత్వ పాఠశాలలు అత్యధిక విద్యార్థుల నమోదుతో విజయవంతంగా నడుస్తున్నాయి. అనగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ప్రైవేట్ పాఠశాలలు ఇంగ్లీష్ మీడియం అనే మోజును తల్లిదండ్రుల్లో ప్రచారం చేయగానే తమ పిల్లలను ప్రవేట్ పాఠశాలకు, అదే విధంగా అదే ఆంగ్లమాధ్యమమును గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభించగానే తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తూ గొప్ప ఇంగ్లీష్ చదువులు చదువుతున్నారనే భ్రాంతిలో జీవిస్తున్నారు. ఈ తరుణంలో విద్యావేత్తలు, మేధావులు తత్వవేత్తలు, మనస్తత్వవేత్తలు పిల్లల విద్యపై శాస్ర్తియంగా అధ్యయనం చేసి సిద్ధాంతీకరించిన ‘కృత్యాధార విద్య’, ‘ప్రయోగ పూర్వక విద్య’, ‘చేయడం ద్వారా నేర్చుకోవడం’ (లెర్నింగ్ బై డూయింగ్)లాంటి వినూత్నమైన విధానాలకు సమకాలీన విద్యావ్యవస్థలో చోటు ఉందా? అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది.
ఆంగ్లమాధ్యమం అనే సంకెళ్ళ చుట్టూ తిరుగుతున్న విద్యావ్యవస్థకు గల ముఖ్యకారణం తల్లిదండ్రుల అమాయకత్వమా? ప్రైవేట్ పాఠశాల వ్యాపారమా? ప్రభుత్వ పాఠశాలల రక్షణాత్మక ధోరణి దాగి ఉందా అనేది విద్యావ్యవస్థలో రోజురోజుకు చర్చనీయాంశంగా మారుతుంది. పునాది స్థారయ నుండే ఇంగ్లీష్ విద్యనభ్యసించాలని కలలుకంటున్న నేటి సమాజంలో అనేక కమిటీలు, కమిషన్లు చెప్పిన విద్యావిధానం మరియు ఉపాధ్యాయులు శిక్షణలో నేర్చుకున్న జ్ఞానం అమలుఅవడానికి ఆస్కారం లేని అశాస్ర్తియ విద్యావిధానం పాఠశాలలో కొనసాగుతూ ఉంది. తద్వారా విద్యార్థులు చదువంటే అధిక మార్కులురావాలనీ మానసిక ఒత్తిడికి గురై చదువులో వెనుకబడి ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఎదురుకావడం జరుగుతున్నాయి. అదేవిధంగా నేడు ప్రాథమిక స్థాయినుండి ఇంగ్లీష్ విద్యను బోధించే తరుణంలో ఉపాధ్యాయులు పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలను పరిగణనలోకి తీసుకోకుండా విషయజ్ఞానాన్ని పిల్లలపై రుద్దడం జరుగుతుంది. నేటి విద్యాసంస్థలు బట్టీ చదువులతో ర్యాంకులను, మార్కులను చూపెడుతూ సమాజాన్ని మెప్పించే సంస్కృతినీ పెంచి పోషిస్తున్నారు.
పిల్లల మానసిక పరిపక్వత ఆధారంగా విద్యనందించే సంస్కృతి ప్రతి పాఠశాలలో కొనసాగాలి. ఆధునిక కాలమాన పరిస్థితులకు అనుగుణంగా రూపుదిద్దుకున్న శాస్ర్తియ కరీకులాన్ని నేడు పిల్లలకు అందించవలసిన అవసరం ఉంది. కావున పిల్లలకు పాఠ్యాంశాలు బోధించేటప్పుడు శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉపాధ్యాయ విద్యలో ఉన్న బోధనా పద్ధతులను అవలంబిస్తూ విద్య సామర్థ్యాలను సాధించాల్సిన అవసరం ఉంది. ఆంగ్ల మాధ్యమాన్ని బోధిస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు విద్యారంగ నిపుణులు సూచించిన శాస్ర్తియ కరికులంతో కూడుకున్న ప్రభుత్వ పుస్తకాలను వినియోగిస్తూ ప్రైవేట్ పాఠ్యపుస్తకాలను నిషేధించాలి. అప్పుడు విద్యార్థులపై ఒత్తిడిని తగ్గి సృజనాత్మకతతో కూడుకున్న విద్యావిధానానికి బాటలుపడతాయి. ప్రాథమికస్థాయిలో ఆంగ్ల మాధ్యమంలో ప్రతి సబ్జెక్టును బోధించడం ద్వారా విద్యార్థి పరిసరాలతో మమేకమైన జ్ఞానానికి దూరమై బట్టీచదువులను ఆశ్రయిస్తున్నాడు. కావున ఆంగ్లమును ఒక సబ్జెక్టుగానే బోధించాలి, లేదంటే ఆంగ్ల వాతావరణాన్ని ఉపాధ్యాయులు పాఠశాలలో కల్పిస్తూ బోధనచేయాలి. పాఠశాల విద్య అనేది విషయ పరిజ్ఞానానికి పరిమితం కాకుండా ఆటలు, పాటలు లాంటి వినోద కార్యక్రమాల ద్వారా పిల్లల్లోని ప్రతిభను వెలికితీయాలి. ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణకై ప్రభుత్వం దృష్టిపెట్టే ప్రతి గ్రామంలోని విద్యార్థులను స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చేరేటట్లు ప్రోత్సహించాలి. అదే విధంగా ప్రైవేట్ మరియు కార్పొరేట్ పాఠశాలల్లోని ఫీజుల నియంత్రణకై దృష్టిపెట్టాలి. ప్రతి పాఠశాల అధునాతనమైన భవనాలతో మరియు విశాలమైన ఆటస్థలంతో వౌలిక వసతులపై శ్రద్ధచూపాలి. ఉపాధ్యాయులు ఆహ్లాదకరమైన వాతావరణంలో వినూత్నమైన కృత్యాలతో పిల్లల మానసిక, శారీరక వికాసం ఆధారంగా విద్యను బోధించాలి. విద్యాశాఖ పర్యవేక్షణ అధికారులను నియమిస్తూ విద్యలో నాణ్యతను పెంచాలి. అదేవిధంగా విద్యహక్కు చట్టాన్ని కూడా పటిష్టంగా అమలుపరచాలి.

- సంపతి రమేష్ మహారాజ్, 9959556367