సబ్ ఫీచర్

అర్థంకాని అభివృద్ధి లెక్కలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమపాలనాకాలంలో జరిగిన ఆర్థికాభివృద్ధిని, పారిశ్రామికాభివృద్ధినీ సాంకేతిక భాషలో చెబుతుంటారు. దేశంలో జిడిపి ఇంతగా పెరిగిందని, తలసరి ఆదాయం అంత పెరిగిందని చెబుతుంటారు. ఈ లెక్కలు సాధారణ ప్రజలకేమీ అర్థం కావు. విద్యావంతులక్కూడా అర్థం కావు. అసలు జిడిపి అంటే ఏమిటో, దానినెలా లెక్క కడతారో ప్రజలకర్ధమయ్యేలాగున ఒక్కరుగాని, ఒక్కసారి గాని చెప్పరు. ప్రభుత్వం జిడిపి పెరిగిందని చెబితే, ఆ లెక్కలు సరైనవి కావు. నిజానికది తగ్గిందని ప్రతిపక్షాలవారు విమర్శిస్తారు, పోనీ జిడిపిని ఇలా లెక్క కడతారు, కాని ప్రభుత్వం లెక్కలు మార్చి చూపిస్తున్నారు అని ప్రతిపక్షాలైనా చెప్పవు. అసలు పార్టీల్లోని వారికే కొందరికి, దాన్ని నిజమైన అర్థమయ్యే రీతిలో ఎలా లెక్కకడతారో తెలియదనిపిస్తున్నది.
అసలు ప్రజలక్కావలసింది ఇలాంటి లెక్కలు కావు. సగటు ప్రజల వార్షికాదాయం పెరిగిందా? ఎంత పెరిగింది? నిత్యావసర వస్తువుల ధరలుపెరిగాయా, తరిగాయా? ఆ ధరలు సాధారణ ప్రజల ఆదాయాలకు అందుబాటులోనే ఉన్నాయా? పెరుగుతున్న దేశ సంపద ఏయే వర్గాలకు, ఎంతమేరకు ఏవిధంగా పంపకం చేయబడుతోంది? అనే విషయాలు తెలియాలి. ఈ విషయాలు తేలిగ్గా తేటగా అర్థమయ్యేలాగున ప్రభుత్వాలు కాని, ప్రతిపక్షాలు కాని చెప్పడంలేదు. ప్రభుత్వాలు అభివృద్ధి, పంపిణీల విషయాల్లో ప్రజలను మభ్యపెడుతుంటే, ప్రతిపక్షాలు ప్రభుత్వాలను మంచికీ, చెడ్డకూ తిట్టిపోస్తున్నారే తప్ప ప్రజలకర్థమయ్యేలాగున లోపాలను చెప్పడంలేదు.
ధరల సూచీను లెక్కగట్టి చూపిస్తుంటారు మనకు. వాటినెప్పుడూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వోద్యోగులను దృష్టిలో పెట్టుకునే తయారు చేస్తుంటారు. నిత్యావసర వస్తువుల సూచీ పెరిగితే ఆరునెలలకోసారి ఉద్యోగుల కామేరకు డిఏ పెంచుతుంటారు. అది బాగానే ఉండవచ్చును. ధరల భారం నుండి వారు బైటపడతారు. మరటువంటి ధరల సూచీ ప్రకారం దేశంలోని కోట్లాదిమంది సాధారణ ప్రజలకు పెరిగిన ధరల భారాన్ని తట్టుకోవడానికి ఎవరు డిఎ లాంటివి ఇస్తారు? స్థిర ఆదాయాన్ని పొందుతున్న ఆ ప్రజలంతా ధరల పెరుగుదల భారాన్ని ఎలా భరించగలరు? ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు, ఉద్యోగులు, ఈ విషయాలను ఆలోచించగలరా? వీరంతా విద్యావంతులేకదా. ఏ వర్గానికావర్గంవారు, వారి నాయకులూ, తమ తమ లబ్దిని గురించే పోరాడుతున్నారు. ఇటువంటి విధానాలూ, పోకడలూ ప్రజాస్వామ్య సమసమాజానికి ఎంత దగ్గర? ఎంత దూరం? చెప్పమనండి?
అందుకే దేశ, రాష్ట్రాల ఆర్థిక రంగాల్లో, వ్యవస్థల్లో ఎలాంటి ఆర్థిక స్థితి ఉన్నదో ప్రజలకు తెలియాలి. ఎలాంటి క్లిష్ట పరిస్థితి లేకుండా, సాంకేతిక పద ప్రయోగాలను తగ్గించి, సులువుగా తెలియజెప్పాలి. ఎంత సులువుగా అంటే ‘ఒకటో ఎక్కం’ ఎంత సులువుగా ఉంటుందో అంత తేలిగ్గా. సంక్షేమ పథకాలనూ, అభివృద్ధి పనులనూ, ఒకేలాగున చూపుతున్నారు. నిస్సహాయస్థితిలో ఉన్నవారికి సాయం అందించి నిలబెట్టేవి సంక్షేమ పథకాలు. ప్రజలకు శాశ్వత ప్రాతిపదికన ఆదాయాన్ని తెచ్చిపెట్టేవి అభివృద్ధి పనులు. అంతేకాదు, సంక్షేమ పథకాలు అర్థవంతంగా ఉండటం లేదు. కిలో బియ్యం ఒక రూపాయకి పేదలికిచ్చే పథకముంది. కాని ఆ బియ్యాన్ని పేదలలో చాలామంది తినడంలేదు. తిరిగి వాటిని ఆ డీలరుకో, ఇతరులకో కిలో 15 రూపాయలకు అమ్మేస్తున్నారు. మళ్లీ మంచి బియ్యాన్ని కొనుక్కొని వారు తింటున్నారు. ఇంతకన్న, వారు తినగలిగే బియ్యాన్ని సబ్సిడీతో అయిదారు రూపాలకిస్తే వాటినే వారు తింటారు కదా. ఇందువలన, దొడ్డిదారి అమ్మకాలు, కొనుగోళ్లూ కూడా ఆగిపోతాయి. ఇలాంటి ప్రజాకర్షణ పథకాలవల్ల చాలా డబ్బు వృధాఅయిపోతున్నది.
రైతుల రుణమాఫీకోసం కొన్ని వేలకోట్లు వెచ్చించారు. వ్యవసాయ పెట్టుబడికోం రైతులు తీసుకున్న రుణాలను అవసరాన్ని బట్టి మాఫీ చేయాల్సిందే. ఎందుకంటే, వాతావరణంలో అనిశ్చితి వలన పంటలు దెబ్బతింటున్నాయి. పెట్టుబడి ఖర్చు బాగా పెరిగిపోయింది. గిట్టుబాటు ధర రావడంలేదు. అందువల్ల కొన్ని సార్లు రుణాలను తీర్చలేకపోతున్నారు. అయితే ఇటీవల చేసిన రుణమాఫీ వలన, విధివిధానాల లోపం వలన, వ్యవసాయ పెట్టుబడికోసం తీసుకున్న రైతులకంటే, వ్యవసాయేతర ఉపయోగానికి తీసుకున్న పంట రుణాలే ఎక్కువగా మాఫీ అయ్యాయి. ఈవిషయం ప్రభుత్వ దృష్టికి వచ్చినా కూడా, రుణమాఫీని కొనసాగించారు.అందువలన వేలకోట్ల ప్రజాధనం అనర్హులకు అందింది.
ఇంజినీరింగ్ చదివే ఎస్‌సి, బిసి విద్యార్థులకు మొత్తం ఫీజు ప్రభుత్వమే కడుతున్నది. ఈ ఫీజులకోసమే ప్రత్యేకంగా అనేక ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలు వెలిశాయి. ఆ కళాశాలల్లో అర్హత కలిగిన బోధనా సిబ్బంది ఉండరు. లేబొరేటరీలు ఉండవు. ఇతర సదుపాయాలు ఉండవు. అందువలన, విద్యార్థులకు అక్కడ అల్పస్థాయి విద్య మాత్రమే లభిస్తున్నది. ఈ కారణంచేత, వారిని ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు తీసుకోవడంలేదు. ఒకవైపు వందల కోట్ల ప్రభుత్వ ధనం వృధా అవుతున్నది. విద్యార్థుల భవిష్యత్తుకూ భరోసా కలగడంలేదు. అవినీతి పెరుగుతున్నది. దీనంతటికీ కారణం, విధానాల్లో స్పష్టత లేకపోవడం. ప్రజలకు ఇవేమీ తెలియకపోవడం వల్లనే. ప్రజలకన్నీ అర్థమయ్యే లాగున తెలియజెయ్యాలి.

- మనె్న సత్యనారాయణ సెల్: 9989076150