సబ్ ఫీచర్

సమిధలవుతున్న మహిళలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమాజంలో వివిధ సంఘటనలు లేదా దుర్ఘటనలలో కూడా మహిళలే సమిధలుగా మారుతున్నారు. దేశంలో లేదా ప్రపంచంలో ఎటువంటి దాడులు లేదా ఘోర ప్రమాదాలు లేదా వరదలు, తుఫాన్, భూకంపాల వంటి పెను విపత్తులు సంభవించినపుడు, వాటికి సమిధలుగా మారుతున్నది మహిళలే. దీనికి కారణం, కుటుంబ పెద్ద ఎదైనా విపత్తులో మరణిస్తే సదరు కుటుంబం నిర్వహణ బాధ్యతలు మహిళలపై పడటమే. మన దేశంలో గత దశాబ్దకాలంలో పాలకులు అనుసరిస్తూన్న అసంబద్ధమైన విధానాలు కారణంగా వ్యవసాయ రంగం అంపశయ్యనెక్కింది. దీని కారణంగా, వ్యవసాయాన్ని నమ్ముకున్న పలువురు రైతన్నలు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. పదిమందికి అన్నం పెట్టిన చేతులు (రైతులు) అప్పుల బాధలకు తాళలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో సదరు కుటుంబాల పోషణ బాధ్యతలు మహిళలపై పడుతున్నది. ముఖ్యం గా పిల్లల పెంపకం మహిళలకు పెను సవాల్‌గా మారుతున్నది.
ప్రభుత్వాధినేతలు ఎన్నికల హామీలు మాదిరిగానే బాధితులకు ఇచ్చే హామీలను కూడా చూస్తున్నారు. తాము ఇచ్చిన హామీలను ప్రజలు కాలంతో మరచిపోతారనేది వీరి ధీమా. మరుపు (మరచిపోవడం) భగవంతుడు మానవుడికి ప్రసాదించిన ఒక వరం అన్నాడో మహానుభావుడు. ఇది మన రాజకీయ నాయకుల పాలిట వరప్రసాదంగా మారింది.
మహిళలలో వుంటున్న మమకారం, దయ, క్షమాగుణాలు వారిని సమస్యల సుడిగుండంలో నెట్టేస్తున్నాయి. భర్తలను కోల్పోయిన మహిళలు ఎన్నో వ్యయప్రయాసలకు వోర్చి తమ పిల్లలను సాకుతున్నారు. మహిళల అభివృద్ధికి కృషి చేస్తామని ప్రభుత్వాధినేతలు పలికే చిలుక పలుకులు గోడలమీద రాతలుగానే మిగిలిపోతున్నాయి. మన దేశంలో కాదు ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి. అంతర్యుద్ధాలు జరుగుతున్న ఇరాక్, సిరియా, అప్ఘనిస్తాన్‌లతో పాటు ఐసిస్ తీవ్రవాదులు తెగబడి విధ్వంసాలకు పాల్పడుతున్న పలు దేశాలలో సైతం సమిధలుగా మారుతున్నది మహిళలే. మహిళలు లేకపోతే తాము ఉండమనే విషయాన్ని పురుషపుంగవులు మరచిపోతుండటమే నేటి ఈ దుస్థితికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఐసిస్ తీవ్రవాదులు సాగిస్తున్న దురాగతాలకు సమిధలుగా మారుతున్నది మహిళలే. ఎటువంటి కష్టనష్టాలు ఎదురైనా తమ కుటుంబ బాధ్యతలను నెరవేర్చు తూ, సమాజానికి దిక్సూచిలా వెలుగొందుతున్న మహిళలకు సలామ్ చేద్దాం.

- పి.భార్గవరామ్