సబ్ ఫీచర్

బానిసలుగా ఇంకెన్నాళ్లు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యాడ్మింటన్, క్రికెట్.. ఈ రెండూ మనల్ని బానిసలను చేసిన ఇంగ్లీషు రాజ్యపు ఆటలే. 1925లో మా అమ్మ కాపురానికి వచ్చినదట. అప్పుడు ఆవిడ వయస్సు 15 ఏళ్ళు. పెద్దవడ్లపూడి వెళ్లేందుకు బకింగ్‌హామ్ కాలవలో పడవ ఎక్కటానికి బెజవాడలో పాసెంజర్ రైలు దిగి నడిచేదిట. బెజవాడ రైల్వే స్టేషన్ బయట ఇంగ్లీషు అమ్మాయిలు బ్యాడ్మింటన్ ఆడటం చూసి మా అమ్మ విస్తుపోయేదట. పైగా వాళ్ళు ‘ఏయ్ అమ్మారుూ.. ఆ బంతి ఇటివ్వు’ అని ఆవిడను శాసించే వాళ్లట! .. ఇంకా ఏలూరులో నెలలో నాలుగో రోజు స్నానం చెయ్యటానికని తమ్మిలేరుకు వెడితే ఏటి పక్కనే వున్న కలెక్టర్ ఆఫీసు స్థలంలో కలెక్టర్ గ్రిల్ భార్య, కూతురు, పనిమనిషి క్రికెట్ ఆడుతూ ‘ఏయ్ పిల్లా.. అక్కడ నుంచుని మాకు బంతి విసురుతూ ఉండు’ అనేవారట.
ఇంగ్లీషు వాళ్ళు పారిపోయారు. మనకు స్వతంత్రం వచ్చి 69 ఏళ్ళు అయ్యింది. అయినా మనం ఇంకా ఆ ఆటల్నే గొప్పవనుకొని పట్టుకొని వేళ్ళాడుతున్నాము. మహాభారత కాలం నాటి చదరంగాన్ని మన దేశపు ఆటగా మనం ఎందుకు ప్రచారం చెయ్యము? వెయిట్ లిఫ్టింగ్‌లో పతకాలు సాధించిన కరణం మల్లీశ్వరి లాంటి అమ్మాయిలూ ఎంతోమంది మన దేశంలో ఉండగా, వారికి ప్రోత్సాహం ఎందుకు ఇవ్వము? పేదరికంలో పుట్టి రెండు పూటలా తిండి సరిగ్గా లేకపోయినా ఆటల్లో (స్ప్రింట్) పరుగెత్తి జిల్లాల్లో గెలిచిన అమ్మాయిలు మన కంటికి ఎందుకు ఆనరు?
హైస్కూల్‌లోనూ, కాలేజీలోను ఉండే పిఈటీలు, ఫిజికల్ డైరెక్టర్లు జీతాలు మాత్రం లెక్చరర్లతో సమానంగా పుచ్చుకుంటూ గ్రౌండ్‌లో మాత్రం సాయంత్రం 4-6 మధ్యే కనిపిస్తూ ఉంటారు. పిల్లల చేత ఆటలు ఆడించక ఏదో కాలక్షేపం చేసి ఇళ్లకు వెళ్లిపోతారు. వాళ్లకు చురకలు ఎందుకు పడవు? అస్సలు క్రీడా మైదానలే లేని విద్యా సంస్థలే 75 శాతం ఉన్నాయి. ఆటలు ఆడాలనుకునే పిల్లలు బడుగువర్గాలలోనూ ఎంతోమంది ఉన్నారు. శారీరక నైపుణ్యమూ, కళాత్మకత వారి సొత్తు. వాళ్ళకు దిక్కు ఎవ్వరు? టెన్త్‌లోనూ, ఇంటర్మీడియెట్‌లోను 400, 500 మీటర్ల పరుగు పందేల్లో జిల్లాల్లో ప్రథమంగా వచ్చిన పిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లలు ఆ తరువాత కూరలు అమ్ముకుని, సమోసాలు అమ్ముకొని బతుకు ఈడుస్తున్నారు. వాళ్లకు కోట్ల రూపాయల నజరానాలు అక్కరలేదు, ఖరీదైన బిఎండబ్ల్యూ కార్లు అక్కరలేదు. కూరల కొట్టుకు కాస్త పెట్టుబడి ఇస్తే చాలు. ఏ ప్రభుత్వం ఇస్తోంది? ఒకవేళ ఇచ్చినా రాజకీయాలు లేకుండా ఇస్తోందా? అస్సాం నుంచి కేరళ దాకా అన్ని ప్రభుత్వాలదీ ఒకటే తీరు- ఒలింపిక్స్‌లో బంగారు పతకం రావాలనేది మాత్రమే, మన యువత మహా నైపుణ్యవంతం అవ్వాలి. మన దేశం వైభవోపేతమవ్వాలి అని మాత్రం కానేకాదు!
అస్సలు ఈ దేశపు ఆటలతో మనమే ప్రపంచంలో పోటీలు ఎందుకు పెట్టకూడదు? చదరంగం, కుస్తీలు మాత్రమే కాక గోకులాష్టమి నాటి ‘దాహి-హ్యాండి’, ఆడపిల్లలు ఒకప్పుడు విపరీతంగా ఆడిన వామనగుంటలు, కబడ్డీ, ఖోఖో వగైరాలు మానవత్వాన్ని పెంపొందించే, నైపుణ్యంతో ప్రత్యర్థులకు బెంబేలు పుట్టించే ఆటలు కావా? బంతి చేజారిపోతే పిశాచంలాగా అరిపిస్తాయా? ఏడిపిస్తాయా? ఈ ఆటలు. లక్షలాది రూపాయలు కుమ్మరించి గోపీచంద్, కుంబ్లే లాంటి గురువుల్ని పెట్టి ఆడించే బ్యాడ్మింటన్,క్రికెట్ ఆటలు మన గ్రామాల్లో యువతకు ఇవాళ్టికే కాదు అసలు ఏనాటికి అయినా సొంతం అవుతాయా? అస్సలు అవి వారికి అందుతాయా? ప్రస్తుత దేశ ప్రధాని మోదీమీద కోట్లమందికి కోట్ల ఆశలున్నాయి. మన దేశపుఆటలతో మనమే ప్రపంచాన్ని ఎందుకు శాసించకూడదు.

-గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు 98857 98556