సబ్ ఫీచర్

నవరూపాలకు నైవేద్యాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దసరా సంబరం మొదలైంది. శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి విశేష పూజలందుకునే శరన్నవరాత్రులలో అమ్మవారిని పూజించుకుంటే సకల శుభమంగళాలు జరుగుతాయని భక్తుల విశ్వాసం. అమ్మవారికి నవరాత్రులలో నవరూపాలకు నివేదించాల్సిన నైవేద్యాలు, అమ్మవారి అలంకారాలు ప్రత్యేకతను సంతరించుకుంటాయి. సంప్రదాయానుసారంగా ఈ అలంకారాలు ఉంటాయి. ఎవరికి తోచిన విధంగా వారు భక్తిశ్రద్ధలతో, నియమనిష్టలతో ఏ తీరున పూజించినా అమ్మ తప్పక పలుకుతుంది. భక్తికి తలవంచే ఆ జగన్మాతను పూజించి ధన్యులమవుదాం.

గాయత్రికి దేవి : పసుపు రంగు ఇష్టం, పసుపు కొమ్ములతో పూజిస్తారు. పెసర పప్పు పాయసం పెడితే ఆయుర్దాయము బాగుంటుంది.నైవేద్యంగా పంచదార పెడతారు. 3 ఏళ్ళ పిల్లని పూజించి వస్త్భ్రారణాలు గాజులు ఇచ్చి దీవెన పొందుతారు.

అన్నపూర్ణాదేవి: పువ్వులతో పూజించి పాలు , కొమ్ము శెనగల వంటకం, బొబ్బట్లుమహానైవేద్యంలో పెడితే దుఃఖ నాశనం అవుతుంది. 4 ఏళ్ళ పిల్లని పూజించి వస్త్ర ఆభరణాలు గాజులిచ్చి దీవెన పొందుతారు.

మహాలక్ష్మిపూజ: నాణెములతో పూజించాలి. అప్పాలు , బొబ్బర్ల పిండివంట, క్షీరాన్నం పెడితే విఘ్ననాశనం. 5 ఏళ్ల బాలికను పూజించి అలంకరించి దీవెనలు పొందాలి.

లలితా త్రిపుర సుందరి: సిమెంట్ రంగు చీర ధరించి అరటిపండ్లు, గోధుమ రవ్వ పరమాన్నం, పులిహోర మహానైవేద్యం. బుద్ధిబలం పెరుగుతుంది. 6 ఏళ్ళ పిల్లను అలంకరించి పూజించి దీవెనలు పొందాలి.

రాజరాజేశ్వరి: గులాబీలతో పూజించి, తేనె, రాజమల వంటకంగాని, చక్రపొంగలిగాని నైవేద్యం పెడితే తేజస్సు- కీర్తి కలుగుతాయి. రాజయోగం కల్గుతుంది. 7 ఏళ్ళ పిల్లని అలకరించి పూజించాలి.

సరస్వతీదేవి: తెలుపు చీరతో అలంకరించి, తెల్ల కలువల తామరలు, లిల్లీ మల్లెలతో గాజులతో పూజించాలి. బెల్లం అవసర నైవేద్యం, తెల్లని పిండి వంటలు, దద్దోజనము, పూతరేకులు, పాలకోవా, రసగుల్ల వంటివి నైవేద్యం పెట్టాలి. 8 ఏళ్ళ పిల్లని పూజించి అలంకరించి దీవెనలు పొందాలి.

కనకదుర్గ: వైలెట్ రంగు చీరతో నిమ్మకాయలు, కుంకుమ, ఎర్రపూసలతో పూజించి కొబ్బరి చెక్కలు అవసర నైవేద్యం మినపప్పు గారెలు మహానైవేద్యం పెట్టాలి. దీనివల్ల శత్రు నాశనం జరుగుతుంది. 9 ఏళ్ళ పిల్లని కాత్యాయినిగా పూజించి ఆశీస్సులు పొందుతారు.

మహిషాసురమర్థిని: నీలం రంగు చీరతో, నీలం పూలతో పూజించి నల్లకలువలు, శంఖాలు, విష్ణుక్రాంతలు పూజించాలి. పేలాలు ,ఉలవచారు, బూరెలు చేసి మహానైవేద్యం పెడితే ఉపశాంతి జరుగుతుంది. 10 ఏళ్ళు పిల్లని పూజించి భోజనం పెట్టి అలంకరించి ఆశీస్సులు పొందాలి. మినప వంటలు, గారెలు, పెరుగు వడలు పెట్టాలి.

భువనేశ్వరిదేవి: పసుపు, ఆకుపచ్చ రంగు వ్రస్తాలతో అలంకరించి అరటి, ఖర్జూరం, కొబ్బరి, దానిమ్మ అవసర నైవేద్యంగా పెట్టి పిండి వంటలతో, ఉండ్రాళ్ళు, గారెలు, బూరెలు, అప్పాలు, బొబ్బట్లు, పరమాన్నం, పులిహోర, దద్ద్యోజనం, చక్రపొంగలి వంటి 9 రకాల పిండి వంటలతో పులగం, పులుసు వండి నైవేద్యం పెడితే ఇహపర సౌఖ్యం కలుగుతుంది. 11 ఏళ్ళ పిల్లని అలంకరించి పూజించి దీవెనలు పొందాలి.

- వాణి