సబ్ ఫీచర్

బొమ్మల కొలువు .. భక్తికి ఆనవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దసరా అనగానే పిల్లలకి పెద్దలకి సందడి. ఇంటింటా పూజలు, బొమ్మల కొలువు, పేరంటంతో ఆహ్లాదం వెల్లివిరుస్తోంది. సంస్కృతి సంప్రదాయాలు నేటి తరం బాల బాలికలకు తెలుస్తాయి. కొన్ని స్కూళ్ళల్లో దేవతా వేషాలు, విచిత్ర వేషధారణ పోటీలు, పాటల పోటీలు నిర్వహిస్తారు. దుష్టసంహారం చేసి దుర్గాదేవి విజయం పొందినందుకు ప్రజలంతా ఆమెను స్తుతిస్తూ పూజలు చేయడం ద్వారా శాంతి సౌఖ్యాలు, విజయాలు పొందుతారని నమ్మకం. దసరాకి బొమ్మలు కొలువు పెట్టి, పిల్లల నోళ్లన్నీ తీపి చేయవచ్చు. వివిధ ప్రాంతాలు, సందర్భాలను బట్టి తెచ్చిన బొమ్మల్ని అందంగా పొందికగా దాచి వాటిని బొమ్మల కొలువుగా పెట్టడంలో వల్ల పురాణగాథలు నేటి తరానికి నేర్పినవారమవుతాం. సృజనకు పదును పెట్టడం ద్వారా ఈ కొలువు అందాన్ని సంతరించుకుంటుంది. పొందికగా బెంచీలపై మెట్లను ఏర్పాటుచేసుకోవాలి. బొమ్మలు ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలి. బొమ్మలకొలువులో వీణ, పుస్తకాలు, మృదంగం ఇత్యాది వాయిద్యాలు ఉంటే వాటిని కొలువులో అందంగా పేర్చాలి. దేముడి బొమ్మలు, మట్టి, ప్లాస్టిక్, రబ్బరు, పార్సిలిన్, గాజు, పాలరాయి బొమ్మలు, ఫొటోలు, అట్టలతో చేసిన ఇళ్లు, మెమొంటోలు, పిల్లలచేత తయారుచేసిన బొమ్మలు, ఇత్యాదివి అమర్చాలి. ఇందులో 5, 9 మెట్లు ఎక్కువ మంది పెడతారు. అందమైన లేసులతో టేబుల్ క్లాత్, పట్టుశాలువాలు వేసి బొమ్మల్ని అలంకరించి పెడతారు. కొండపల్లి, నిర్మల్, ఏటికొప్పాక బొమ్మల రకరకాల రాళ్ళ బొమ్మలు, రతనాల బొమ్మలు పూలు, పళ్లు, బళ్లు, ఓడలు, కార్లు, మోటారు సైకిళ్ళు ఇలా ఎనె్నన్నో రకాల వైవిధ్యభరితమైన బొమ్మలతో పాటు విమానాశ్రయం, బస్‌స్టాండ్, రైల్వేస్టేషన్, సూపర్ మార్కెట్..ఇలా అందమైన నేటితరం షాపులతోపాటు పార్క్, జూ వంటి వినోదభరితమైన సెట్లను కూడా ఏర్పాటుచేస్తారు. ఉదయం సాయంత్రం బొమ్మల హారతి, పేరంటం వుంటాయి. అంతేకాకుండా పిల్లలకి పాటల పోటీలు, డాన్సు పోటీలు కూడా నిర్వహిస్తారు. తొమ్మిది రోజులు విధిగా పూజ చేసి పిండి వంటల నైవేద్యం చేసి చేసి బాలికలకు పూజ చేస్తారు. పిల్లలకి చరిత్ర, మన సంస్కృతి సంప్రదాయాలు తెలియజెప్పటానికి ఇది ఒక ప్రత్యేక వేదిక.

- వాణీప్రభాకరి