సబ్ ఫీచర్

మంచి నిద్రతోనే మరింత ఆరోగ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వయస్సు పెరుగుతోంది.. నిద్ర తరుగుతోంది- తరచూ సీనియర్ సిటిజన్స్ నుండి వినవచ్చే మాట.
కాయం కష్టం చేసేవారి విషయంలో దీనికి ఎగ్జెంప్షన్ వుందేమో కానీ వైట్ కాలర్స్‌కి మాత్రం పైబడుతున్న వయస్సు నిద్రను కరిగించేస్తుంటుంది.
వృద్ధాప్యం పైబడుతున్నకొద్దీ మూడ్ తరచూ అవుట్ అవుతుంటుంది.. జ్ఞాపకశక్తి క్షీణిస్తుంటుంది. కొంత నరాల బలహీతా తప్పదు. ఆకలి తగ్గుతుంటుంది. ఇంద్రియ పటుత్వం తగ్గటం, ఇంట్లో వారి ఆదరణ కరువవుతుండటం కామన్ అవుతుంటుంది. ఇవన్నీ నిద్రలేమికి కారణాలే!
వయస్సులో వున్నప్పుడు ఉరుకుల పరుగుల జీవితం.. అందుకే గాఢ నిద్ర.. కనీసం ఎనిమిది గంటలు. కానీ వయస్సు పైబడుతున్నకొద్దీ నత్తనడకనే... కాలక్షేప జీవితమే.. అందుకే సుఖనిద్ర ఉండదు.. మహా అయితే నాలుగు గంటలు. పగటి జీవితం తృప్తినివ్వనట్లే రాత్రి నిద్రా ఆనందానివ్వదు.. కలవరపెడుతుంది.
అయితే ఈ నిద్రలేమి నుండి బయటపడేదెలా? రాత్రిళ్ళు మనం గడియారం వంక చూస్తూ కూర్చుంటే తెల్లవారదు కదా! పైగా రాత్రంతా భారంగా గడుస్తుంది. కాబట్టి మనం గోడ గడియారంపై దృష్టి పెట్టక అంతరంగ గడియారంపై చూపును ప్రసరింపజేయాలి. మనకు కావలసిన నిద్రను, వలసిన మెలకువను నిర్ణయించేది ఈ ఇంటర్నల్ క్లాకే! అసలు పసితనంలోనైనా, పండినతనంలోనైనా మనల్ని నడపించేది లోనున్న ఈ గడియారమే.
అసలు, వృద్ధాప్యంలో కుటుంబంలోని అందరికంటే ముందుగా నిద్రకు ఉపక్రమించటం సాధారణం. అంతేకాదు, అందరూ గాఢ నిద్రలో ఉండగా లేచి క్చూవటమూ సాధారణమే! పగలు అలసిపోకపోయినా రెండు మూడుమార్లు కనీసం భోజనానికి ముందు భోజన సమయం తర్వాత కునుకు తీయటం చాలా కామన్. దీంతో మధ్యరాత్రి జాగరణ.ఇలా పగటి కునుకులు రాత్రిళ్లు నిద్రలేమికి ఒక కారణం. అయితే మోకాలి నొప్పి, నడుం నొప్పి, వెన్నునొప్పి, గ్యాస్టిక్ ప్రాబ్లమ్, అసిడిటి ప్రాబ్లమ్, ప్రోస్టేట్ గ్లాండ్ ప్రాబ్లమ్‌ల వల్ల కూడా నిద్ర తరిగిపోతుంటుంది. వయసు పైబడుతున్నకొద్దీ దేహ శ్రమ దాదాపుగా ఉండదు. విశ్రాంత జీవనంతో మన దైనందిన కార్యక్రమాలు చాలా మం దంగా, బద్ధకంగా సాగుతుంటాయి. అంటే శారీరక వ్యాయామం లేకపోవటంవల్ల కూడా నిద్ర తరుగుతుంటుంది. రాత్రిళ్లు తరచూ లేస్తుండటంవల్ల పగటి కునుకులు తప్పవు.. పగటి కునుకుల వల్ల రాత్రిళ్లు నిద్రలేమి. కొందరికి ఒంటరితనంవల్ల కూడా నిద్రపట్టదు. ఒకటికి నాలుగుసార్లు కాఫీలు తాగుతున్నా రాత్రిళ్ళు నిద్ర కరువవుతుంది. దీనికితోడు మద్యపాన సేవనం కూడా నిద్రను తగ్గిస్తుంది. అనవసరమైన ఆలోచనలతో మంచం చేరినా, వెంటనే నిద్ర పట్టినప్పటికీ, మధ్యరాత్రి మెలకువ వస్తే చాలు. అవి కలత పెట్టడం ప్రారంభించి, నిద్రకు దూరం కావటం జరుగుతుంటుంది.

- డా వాసిలి వసంతకుమార్