సబ్ ఫీచర్

స్వదేశీ ఉత్పత్తుల్ని స్వాగతిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సరిహద్దు సమస్య మొదలు అనేక అంతర్జాతీయ సమస్యల వరకు మన పొరుగున వున్న చైనా.. పాకిస్తాన్‌తో కలిసి కుట్రలు పన్నుతూ బహిరంగ శత్రువుగా వ్యవహరిస్తుంటే- మన ప్రభుత్వం మాత్రం ఆర్థిక, సాంకేతిక సాయం కోసం చైనా చుట్టూ తిరగటం మన గౌరవానికి భంగకరం. నేడు చైనా సహా ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలు పారిశ్రామిక మాంద్యంతో సతమతమవుతుంటే- సహాయం, ఒప్పందాల పేరిట మనమే ఎన్నో రాయితీలిస్తూ చైనాకు పరోక్షంగా సాయం చేస్తున్నాము. ఇప్పటికే చైనా మనకు మూడు రెట్లు ఎక్కువ ఎగుమతులు చేస్తూ లాభం పొందుతోంది. చైనా సరకులు మన దేశంలో భారీగా పెరిగిపోతున్నాయి. ఇక- పారిశ్రామికాభివృద్ధి, ఆదాయం పెరిగి మన బ్యాంకుల్లో నగదు నిల్వలు పేరుకుపోతుంటే, ఆ నిల్వలను వదిలించుకోవడానికి కార్పొరేట్ సంస్థలకు బ్యాంకులు ఉదారంగా రుణాలిస్తున్నాయి. వివిధ కార్పొరేట్ సంస్థలు బ్యాంకులకు ఎగవేసిన మొండి బకాయిలు ఇప్పటికే 5 లక్షల కోట్లకు చేరాయి. ‘ఈనగాచి నక్కలపాల్జేసినట్లు’ సామాన్యులు పొదుపుచేసుకున్న డబ్బును కార్పొరేట్ ప్రముఖులు గద్దల్లా తన్నుకుపోతుంటే బ్యాంకులకు నష్టాలు తప్పడం లేదు. దీంతో డిపాజిట్లపై వడ్డీరేట్లను బ్యాంకులు తరచూ తగ్గిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో సంక్షేమ పథకాల ముసుగులో లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తున్న ప్రభుత్వాలు బ్యాంకులకు బదులు ఇతర సంస్థల నుంచి రుణాలు తీసుకోవడం మంచిది. సంక్షేమ పథకాల అమలుకు సైతం బ్యాంకులను ఆశ్రయిస్తే అవి మరింతగా మునిగిపోయే ప్రమాదం ఉంది. సాంకేతిక సహకారం విషయానికొస్తే చైనా కంటే ఏ అభివృద్ధి చెందిన దేశానికి వెళ్లినా అక్కడి పరిజ్ఞానం బాగున్నట్లుంటుంది. అవసరమైతే జపాన్, ఇజ్రాయిల్ వంటి మిత్రదేశాల సాయం కోరాలి. ఇప్పుడు మన దేశం కూడా సాంకేతికంగా అభివృద్ధి చెందుతోంది గనుక విదేశాలపై ఆధారపడటం, విదేశీ వస్తువులపై మోజు తగ్గించుకుంటే మన రూపాయి విలువ పెరుగుతుంది. ముందుగా తిండిగింజల ధరలు తగ్గిస్తే అత్యధిక ప్రజానీకానికి తక్షణ ఉపశమనం లభిస్తుంది. ద్రవ్యోల్బణం తగ్గుతుంది. కానీ, మన పాలకులు- ‘బ్రెడ్’ దొరకటం లేదని ఆందోళన చేసిన ప్రజలకు ‘కేక్’తినమని చెప్పిన ఒకప్పటి ఫ్రెంచి రాణి వలే పరిశ్రమలు, ఐటీ, రియల్ ఎస్టేట్ రంగాల మోజులో వేల ఎకరాల వ్యవసాయ భూములను బడాబాబులకు చౌకగా కట్టబెడుతూ ధరల పెరుగుదలకు కారణమవుతున్నారు. ఐటీ దిగ్గజం బిల్‌గేట్స్ చెప్పినట్లు కంప్యూటరు, కార్లు కడుపు నింపవు. గనుక ఇకనైనా నిత్యం డిమాండ్ వున్న ఉత్పత్తిరంగంపైన, వ్యవసాయ రంగంపైన దృష్టి సారించాలి. స్వదేశీ ఉత్పత్తులను విధిగా ప్రోత్సహించాలి. ప్రజలే చైతన్యవంతులై సాధ్యమైనంతవరకూ స్వదేశీ సంస్థల ఉత్పత్తులనే వాడాలి. మన వ్యాపార సంస్థలు కూడా లాభాపేక్ష తగ్గించుకుని ప్రజలకు అందుబాటు ధరల్లో ఉత్పత్తులను విక్రయించాలి.

-తిరుమలశెట్టి సాంబశివరావు