సబ్ ఫీచర్

కురుల సిరులకు సులువైన పద్ధతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేశ సంపద ఆడవారికి అందాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. మన ఇంట్లో పోపు సామానులు, పుష్పాలు, కాయలు, ఆకులు వంటివి వాటితో నల్లటి కేశాలను మన సొంతం చేసుకోవచ్చు. వీటి గురించి ఆయుర్వేదం, హెర్బల్ వైద్యం, చిట్కాల వంటి వానిలో ఎన్నో నిరపాయకరమైన, ఖర్చు తక్కువైన గ్యారంటీ విధానాలు ఉన్నాయి. వైద్య సలహాననుసరించి ఉపయోగిస్తే ఎంతో మేలు జరుగుతుంది. జుట్టు ఊడిపోవడం, నెరవడం వంటివి తగ్గించే ఉపాయాలు ఎన్నో. జుట్టు పొడవుగా పెరగడానికి కూడా అనేక పద్ధతులు ఉన్నాయి. వాటిలో కొన్ని.
జుట్టు ఊడిపోతుంటే..
- కొబ్బరి పాలు మాడుకు పట్టించి మర్దనా చెయ్యాలి.
- గుంటకలగర ఆకులు నువ్వుల నూనెలో వేసి బాగా మరిగించి, వడగొట్టి జుట్టుకు రాయాలి.
- అరకప్పు కొబ్బరి పాలలో ఒక నిమ్మకాయ రసం కలిపి తలకు మర్దనా చెయ్యలి.
-నిమ్మ రసం, ఉసిరి రసం కలిపి తలకు మర్దనా చెయ్యాలి.
- తమలపాకుల ముద్ద తలకు పట్టించి మరునాడు స్నానం చేయాలి.
- వెచ్చటి ఆలివ్ ఆయిల్ కుదుళ్లకు పట్టించి 10-15 నిముషాల తర్వాత స్నానం చెయ్యాలి.
- మెంతులు, మినపపిండి ముద్దగా చేసి తలకు రాసి గంట తరువాత వేడి నీళ్ళతో స్నానం చెయ్యాలి.
- బాగా పండిన అరటి పండులో ఒక స్పూన్ మెంతిపొడి కలిపి మాడుకు పట్టించాలి.
- కరివేపాకు పొడి కొబ్బరినూనెలో కలిపి మాడుకు, కేశాలకు పట్టించాలి.
- మెంతులు నానబెట్టి, ముద్దగా చేసి, తలకు పట్టించాలి. గంట తరువాత స్నానం చెయ్యాలి.
-ఉసిరి పచ్చడి ప్రతిరోజూ తినడం మరొక సులువైన చిట్కా.
- ఖర్జూరంలో అధికంగా ఉన్న పాస్ఫరస్ జుట్టు రాలకుండా నిరోధిస్తుంది.
- నువ్వుల నూనెతో తలకు అభ్యంగన స్నానం చేసుకోవాలి.
- మునగాకు రసం, బూడిద గుమ్మడి రసం సమపాళ్ళతో కలిపి త్రాగడం
- కొబ్బరి నూనెలో మందారపూలు వేసి మరగ కాచి, చల్లార్చి, వడగట్టి తలకు రాసుకోవాలి.
- సీతాఫలం గింజలను మేకపాలతో నూరి తలకు లేపనం చెయ్యాలి.
- జుట్టు ఊడిపోకుండా ఉండడానికి బీరకాయ, పొట్లకాయ, ఆకుకూరలు, ఆయా ఋతువులలో లభించే ఫలాలు, పాలు, మినపగారెలు మంచివి.

-గురునాధరాజు వి.వి.వి.