సబ్ ఫీచర్

పల్లెలకు కెమెరా కాపలా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాత సినిమాల్లో హీరో తన డేగ కళ్లతో విలన్లను ఆటపట్టించడం, విలన్లు అడ్డంగా దొరికిపోయి చిత్తుచిత్తుకావడం అందరికీ తెలిసిన కథనాలే. సమాచార, సాంకేతిక పరిజ్ఞానం విపరీతంగా పెరిగి అన్ని రంగాల్లో అది విస్తృతం అవుతోంది. విద్య, వైద్యం, రవాణా వంటి విభిన్న రంగాల్లోనే కాదు.. నేరాల నియంత్రణలోనూ ఆధునిక టెక్నాలజీని విరివిగా వాడుకుంటున్న రోజులివి. నేరస్థుల కదలికలను పసిగట్టడం, వాహనాల గమనాన్ని తెలుసుకోవడం చివరికి వ్యక్తిగతంగా వాడుకునే మొబైల్ ఫోన్ల ఆచూకీని కనుగొనేందుకు కూడా సాంకేతిక వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. నేరం జరిగిన సమయంలో మొబైల్‌కు వచ్చే ఫోన్‌కాల్స్‌ను గుర్తించి, ఆ ‘క్లూ’ల ఆధారంగా నేరస్థులను గుర్తించడం నేడు ఎంతో సులువుగా మారింది. నేరాలు జరిగిన ప్రదేశాల్లో సిసిటివి ఫుటేజీ తీసుకుని తద్వారా ఆ ఘటనలకు పాల్పడినవారెవరో ఆరా తీయగలుగుతున్నారు. తాజాగా దేశవ్యాప్తంగా పెద్దనోట్లను రద్దు చేసిన తర్వాత అధిక మొత్తంలో నగదు డిపాజిట్లు చేస్తున్న వారి వివరాలు సేకరించే పనిలో కూడా సిసిటివిలు తమ పని తాము రహస్యంగా చేసుకుపోతున్నాయి. రైల్వే ప్లాట్‌ఫారాలు, ఇంటి చుట్టూ భద్రత విషయంలోనూ, ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద సిసిటివి (క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్ ) చేస్తున్న సేవలు మనకు తెలిసినవే. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వాహన చోదకుల ఇళ్లకు నేరుగా జరిమానా నోటీసులు చేరుకుంటున్నాయంటే సిసిటివిలతో సెంట్రల్ కమాండ్‌లకు అనుసంధానం చేయడంతో ఎవరికీ తెలియకుండానే టెక్నాలజీ తన పని తాను చేసుకుంటూ పోతోంది.
ఇంతవరకూ ఇళ్లకు పరిమితమైన సిసిటివి కాస్తా వీధులకు, ఊళ్లకు కూడా రక్షణ తంత్రంగా మారింది. దీంతో టెక్నాలజీ- ‘ఊళ్లను కాపాడే అతిపెద్ద పోలీసు వ్యవస్థ’గా ఎదిగింది. ఊళ్లో ఏం జరిగినా స్థానికులు సిసిటివి ఫుటేజిలను చూసి ఇట్టే పసిగడుతున్నారు. హర్యానాలోని మచిగఢ్ గ్రామంలో నాలుగు బర్రెలు అదృశ్యం కావడంతో సంబంధిత రైతు ఆందోళనకు గురైనా, గ్రామ పెద్దలు మాత్రం అంత ఆందోళనకు గురికాలేదు. తీరిగ్గా సెంట్రల్ కమాండ్‌లోని సిసిటివి ఫుటేజీ చూడగానే ఆ బర్రెలు తీసుకువెళ్లిన ప్రబుద్ధులు ఎవరో ఇట్టే తెలిసిపోయింది. మచిగఢ్‌లో దాదాపు 160 కెమరాలను ఏర్పాటు చేసి తమ గ్రామాన్ని అక్కడి ప్రజలే భద్రంగా కాపాడుకుంటున్నారు. సిసి కెమరాల్లో బర్రెలు తీసుకువెళ్లిన వారిని గుర్తించడమే గాక, బర్రెలను తిరిగి రైతుకు అప్పగించి, తప్పు చేసిన ఇద్దరు యువకులను పోలీసులకు అప్పగించారు. తమ గ్రామంలో సిసిటీవీలను ఏర్పాటు చేశాక అక్రమ మద్యం వ్యాపారానికి తెర పడిందని, వీధుల్లో లైంగిక వేధింపులకు పాల్పడే ఆకతాయిల బెడద తగ్గిందని, జూదం, పబ్లిక్ న్యూసెన్స్ వంటి సమస్యలు తొలగిపోయాయని చండావలి సర్పంచ్ అంజూ యాదవ్ అంటున్నారు. 22 ఏళ్ల ఈ మహిళా సర్పంచ్ తమ గ్రామంలో 95 సిసి కెమెరాలను ఏర్పాటు చేయించారు. ఈ ఏర్పాటుతో నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టిందని, మహిళలకు వేధింపులు తగ్గాయని ఆమె అంటున్నారు.
గ్రామాల్లో నాటుసారా వ్యాపారం, రేషన్ బియ్యం తరలింపు, అర్ధరాత్రి కలప రవాణా.. ఇలా ఎక్కడ ఏం జరిగినా సిసిటివిలు నిఘా పోలీసుల మాదిరి నిలుస్తున్నాయి. మనుషులు సైతం చేయలేని పనులను సిసిటివిలు చక్కబెడుతున్నాయి. ఊరి శివారుల్లోనే కాదు, వీధుల్లో ఎవరేం చేస్తున్నారో తమ డేగకళ్లతో కనిపెడుతున్నాయి. హర్యానాలోనే కాదు, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లోని గ్రామసీమల్లోనూ సిసిటివిలను ఏర్పాటు చేసుకుంటున్నారు.

-బివి ప్రసాద్